కడప, పులివెందుల ఉపఎన్నికల తాజా సమాచారం

 • వైఎస్‌ఆర్ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో రీపోలింగ్ గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలనాధికారులు అందించే నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందిస్తామన్నారు.
 • ఎన్నికల ప్రచారంలో ఎక్కడా మాట్లాడని పులివెందుల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి , దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి భార్య వై.ఎస్.విజయలక్ష్మి ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా మాట్లాడలేదు. అవిడను మాట్లాడవలసిందిగా మీడియా పదే,పదే కోరినా, నవ్వుతూ తిరస్కరించారు.
 • కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీలకు ఉప ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసాయి. ఉప ఎన్నికల ఓటింగ్ సమయం ముగిసి పోయినప్పటికి పోలింగ్ బూత్‌లలో భారీగా ఓటర్లు వున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు ముందే క్యూలో వున్న ఓటర్లను అనుమతిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా క్యూలో వందలాది మంది ఓటర్లు వున్నట్టు సమాచారం.
 • పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గానికి 82 శాతం ఓటింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.
 • కడప లోకసభ నియోజకవర్గంలోని ప్రొద్దుటూరులో సాక్షి మీడియా ప్రతినిధులపై దుండగులు దాడికి పాల్పడ్డారు.
 • దర్పం ప్రదర్శిస్తూ ఏజంట్లను, ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్న మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని తక్షణం గృహనిర్బంధం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి ఒక వినతి పత్రం ఇచ్చారు.
 • మైదుకూరు నియోజకవర్గంలోని సుంకేసుల గ్రామంలో రిగ్గింగ్ చేయాలని 15 వాహనాల్లో బయలుదేరిన డీఎల్ వర్గాన్ని చిత్రీకరిస్తున్న సాక్షి మీడియాపై దాడి పాల్పడ్డారు. డీఎల్ అల్లుడు ఓబీ వ్యాన్‌ను తన వాహనంతో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించిన మీడియా ప్రతినిధులు వాహనం నుంచి దూకి ప్రాణాల్ని దక్కించుకున్నారు
 • కడప నియోజకవర్గంలోని అలంఖాన్ పేట పోలింగ్ స్టేషన్‌కు తాళం వేసిన ఘటనపై  జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలింగ్ స్టేషన్‌కు తాళం ఎందుకు వేశారని ఎన్నికల అధికారులను జగన్ ప్రశ్నించారు.
 • ఓటు హక్కు వినియోగించుకోవాలని వచ్చిన ఓటర్లపై ఆలంఖాన్‌పల్లి కాంగ్రెస్ నేత లక్ష్మిరెడ్డి దౌర్జన్యం చేశారు. ఓటర్లను లక్ష్మిరెడ్డి అనుచరులు అడ్డుకుని జెడ్పీ కార్యాలయానికి తాళం వేశారు. అయితే జిల్లా ఎస్పీ తాళం తీసి ఓటర్లను అనుమతించారు.
 • కాంగ్రెస్‌కార్యకర్తలు రెచ్చగొట్టడంతో సిద్దారెడ్డిగారిపల్లి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
 • దువ్వూరు మండలం గడ్డంవారిపల్లెలో ఉదయమే 90 శాతం పోలింగ్ జరిగింది. ఈ గ్రామంలో మొదటి 4 గంటలలోలో 221 మంది అంటే 90శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
 • పెండ్లిమర్రి మండలం గుర్రాలచింతలపల్లి గ్రామంలో ఓ వృద్దురాలు తనకు కళ్లు సరిగా కనిపించక తన ఓటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయమని కోరితే అధికారి కాంగ్రెస్ పార్టీకి వేశాడు. విషయం తెలిసిన వెంటనే ఆ అధికారిని విధుల నుంచి తొలగించారు.
 • కొన్నిగ్రామాలలో పోలింగ్ ఏజెంట్లు టిడిపి, కాంగ్రెస్ లకు దొరకని మాట నిజం . ఆ మాట చెప్పకుండా తమకు ఏజెంట్లు లేకుండా చేశారని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
 • కడప ఉప ఎన్నికలపై ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది.పులివెందులలో ఒక వృద్దుడు ఎంత వేడిమికి తాళలేక మరణించారు.
 • ఉప ఎన్నికలలో బద్వేలు నియోజకవర్టం అట్లూరు మండలం ఎస్.వెంకటాపురం గ్రామంలో పోలింగ్ బూత్ కు అతి సమీపంలోనే కాంగ్రెస్ పార్టీవారు ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు.
 • ఉప ఎన్నికలలో మధ్యాహ్నం 12 గంటలకు 35 శాతం దాటి పోలింగ్ జరిగినట్లు అంచనా.
 • కడప లోక్ సభ నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు 28 శాతం ఓట్లు పోలయ్యాయి. పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో 24.22 శాతం ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.
చదవండి :  ఉక్కు కర్మాగారం ఏర్పాటు పరిశీలనకై వచ్చిన సెయిల్‌ బృందం

 

డప లోక్ సభ నియోజకవర్గం 28.43 శాతం
మైదుకూరు శాసనసభ నియోజకవర్గం 29 శాతం
జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం 31 శాతం
కడప శాసనసభ నియోజకవర్గం 18.53 శాతం
కమలాపురం శాసనసభ నియోజకవర్గం 28.76 శాతం
బద్వేలు శాసనసభ నియోజకవర్గం 33.55 శాతం
ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గం 33.95 శాతం
పులివెందుల శాసనసభ నియోజకవర్గం 24.22 శాతం

 

 • కడప ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి పోలింగ్ సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏజంట్ల పట్ల, సాక్షి విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘం రాష్ట్రప్రధాన అధికారి భన్వర్ లాల్కు ఫిర్యాదు చేశారు.
 • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు సురేష్ బాబుని పోలీసులు అరెస్టు చేసి చిన్నచౌక్ పోలీస్ స్టేష న్ కు తీసుకువెళ్లారు. తన వద్ద అనుమతి పత్రం ఉన్నా అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన వాపోయారు. జగన్మోహన రెడ్డికి మెజార్టీ తగ్గించేందుకు అధికార పార్టీ వారు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
 • జగన్ వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ అభ్యర్ధి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డి ఆరోపించారు. జగన్ మీడియాకు చెందిన వాహనాలలో రౌడీలు, గూండాలు తమను వెంబడిస్తున్నారని ఆయన ఆరోపించారు. డి.ఎల్ ను అనుక్షణం సాక్షి మీడియాకు చెందిన ప్రత్యక్షప్రసార వాహనం అనుసరిస్తుండడంతో ఆయన ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని జగన్ వర్గం పేర్కొంటోంది.
 • తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ పై ఫిర్యాదు చేశారు. ఆయన నలభై మంది డి.ఎస్.పిలను వెనక్కి పంపించివేశారని దీనివల్ల రిగ్గింగుకు అవకాశం ఉంటుందని వారు ఆరోపించారు. దీనిపై స్పందిచిన భన్వర్ లాల్ అదనంగా ఉన్న డిఎస్సీలను మాత్రమే వెనక్కు పంపారని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సరిపడ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు లేవని ఆయన చెప్పారు
  లోక్‑సభ స్థానానికి యువజన శ్రామిక రైతు(వైఎస్ఆర్) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగన్మోహన రెడ్డి ఓటింగ్ తీరుని పరిశీలించడానికి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
చదవండి :  'జగన్‌లో ఇంత నిబ్బరం ఉందని అనుకోలేదు'

 

 • మైదుకూరు కె.అగ్రహారం పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ లోక్‑సభ అభ్యర్థి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

 

 • ఖాజీపేట అగ్రహారం పోలింగ్ బూత్‑లో మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సతీమణి సుభద్రమ్మ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా ఆమె ఇవిఎంలకు కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు.

 

 • తొండూరులోని ఒడ్డెర కాలనీలో ఓటు వేయడానికి గుంపులుగా వెళుతున్న మహిళలపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ఈ ఘటనలో ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారు.
చదవండి :  రేపూ...మన్నాడు ఆస్థానే మురాదియాలో ఉరుసు ఉత్సవాలు

 

 • గుత్తికొట్టాల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజంట్‑ని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బయటకు పంపారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కొద్దిసేపు అక్కడ వీరంగం సృష్టించారు. మంత్రి వచ్చి ఆ ఏజంట్ ఆ గ్రామానికి చెందిన వ్యక్తి కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో పోలింగ్ సిబ్బంది భయపడ్డారు.

 

 • ముందుగా అనుమతించిన అధికారులు మంత్రి వచ్చి అడిగేసరికి ఆ ఏజంట్‑ సింధూజాని బయటకు పంపారు. ఈ విషయం తెలుసుకొని కలెక్టర్ జోక్యం చేసుకొని ఆ ఏజంట్‑ని అనుమతించారు. ఆ ఏజంట్ ఆదే రెవెన్యూ గ్రామానికి చెందిన యువతి అయినందున అనుమతించవచ్చని తహసీల్దార్ చెప్పారని అధికారులు తెలిపారు

 

 • ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఎస్పీ ఆదేశాలను లెక్క చేయకుండా గ్రామాలలో విచ్చలవిడిగా పర్యటిస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఓటర్లతో మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఆయన ఉదయం గన్‑మేన్లను వెంటబెట్టుకొని హడావుడి చేశారు. ఆయన పర్యటన విషయం తెలిసి ఎస్పీ ఫోన్ చేసి ఆయనని బయట తిరగవద్దని చెప్పారు. అయినా ఆయన బయట తిరుగుతూనే ఉన్నారు.

 

 • గాంధీనగర్ హైస్కూల్లో ఏర్పాటు చేసి పోలింగ్ బూత్‑లో కేంద్ర మంత్రి సాయిప్రతాప్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

ఇదీ చదవండి!

పచ్చని విషం

పోతిరెడ్డిపాడును నిరసిస్తూ అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం

2008 శాసనసభ సమావేశాలలో ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా తెలుగుదేశం పార్టీ పోతిరెడ్డిపాడు వెడల్పు కారణంగా అవిశ్వాసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: