వైఎస్ జగన్ హయాంలో కడప అభివృద్ధి జగన్ గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి (దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారి కుమారుడు) 30/05/2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లాకు మంజూరు చేసిన/చేయించిన కొన్ని అభివృద్ది పనులు … విద్యారంగం : సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రిమ్స్ విస్తరణ ప్రదేశం : కడప నగరం అంచనా […]పూర్తి వివరాలు ...
Tags :ysr congress
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ నేత నందిగం సురేశ్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కడప జిల్లా నుండి సిటింగ్ ఎంపీలుగా ఉన్న ఇద్దరికీ మల్లా పొటీ చెసే అవకాశం దక్కింది. 1. కడప – వైఎస్ అవినాష్‌రెడ్డి 2. రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పూర్తి వివరాలు ...
కడప : వైకాపాలో సీనియర్ నేతగా ఒక వెలుగు వెలిగిన మైసూరారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి వైకాపా అధినేతకు ఆయన రాసినట్లుగా చెబుతున్న నాలుగు పేజీల లేఖ బుధవారం మీడియాకు విడుదలైంది. మైసూరారెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వైఖరి పట్ల అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైసూరా లేఖలో తెలిపారు. వైకాపాలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని లేఖలో మైసూరా ఆరోపించారు. గతంలో తన ప్రమేయం లేకుండానే వైకాపాలో […]పూర్తి వివరాలు ...
ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించాయి. కడపలో… కడప కలెక్టరేట్ దగ్గర మేయర్ సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ధర్నా చేశారు. అనంతరం మాట్లాడుతూ…తన అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఓటుకు నోటు వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూస్తున్నారని పేర్కొన్నారు. పులివెందులలో… అవినీతి చంద్రబాబు గద్దె దిగాలంటూ వైకాపా నేతలు, కార్యకర్తలు పులివెందులలో భారీ ర్యాలీ నిర్వహించారు. […]పూర్తి వివరాలు ...
కృష్ణా నీటిని పునః పంపిణీ చేయాల రాజధాని పారిశ్రామిక కారిడార్ కోసమే పట్టిసీమ ఓవైపు సీమ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం.. మరో వైపు సీమ కోసమే పట్టిసీమ అనడం కుట్ర పట్టిసీమ ఉత్తర్వులో సీమకు నీరిస్తామన్న అంశాన్ని ఎందుకు పొందుపరచలేదో చెప్పాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు కడప: రాజధాని ప్రాంతం చుట్టూ ఏర్పాటయ్యే పారిశ్రామిక కారిడార్‌కు నీరందించడం కోసం రాయలసీమ పేరు చెప్పి కోస్తా వారు చేస్తున్న మరో మోసమే పట్టిసీమ అని ఏపీ రైతుసంఘం […]పూర్తి వివరాలు ...
మొత్తానికి కడప జిల్లాకు చెందిన నాయకులు జిల్లా అభివృద్ది కోసం సమాలోచనలు సాగించడానికి సిద్ధమయ్యారు. ఈ దిశగా అఖిలపక్షం గురువారం కడపలో సమావేశం నిర్వహించింది. జిల్లా అభివృద్ది కోసము పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులూ, రైతు సంఘాల నాయకులూ నొక్కి చెప్పారు. ఇది ఒక ముందడుగు… ఈ అడుగులు గమ్యం చేరే వరకు ఇలాగే సాగాలని జిల్లా ప్రజానీకం ఆకాంక్షిస్తోంది! కడప: రాయలసీమలో వెనుకబడిన కడప జిల్లాను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే వివక్ష చూపుతోన్ననేపధ్యంలో […]పూర్తి వివరాలు ...
కడప: శుక్రవారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, జెడ్పీ అధికారులతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు చెప్పిన సమాచారం ఆసక్తికరంగా ఉంది. బోర్లలో అదనంగా పైపులు వేయడానికి, తాగునీటి రవాణాకు జిల్లాకు ఎన్ని నిధులు మంజూరయ్యాయో చెప్పాలని వైకాపా ప్రజాప్రతినిధులు కోరగా జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం రూ.14.40 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించగా ప్రభుత్వం కేవలం రూ.1.90 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని మరో రెండు కోట్లు […]పూర్తి వివరాలు ...
కడప: 93 మంది సభ్యులతో కూడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి పదిమంది ప్రధాన కార్యదర్శులు, పన్నెండు మంది కార్యదర్శులు, పద్దెనిమిది మంది సంయుక్త కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, కోశాధికారి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఇద్దరు, 44 మంది కార్యనిర్వాహక సభ్యులతో భారీ కార్యవర్గాన్ని ప్రకటించారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం నగర మేయర్ కె.సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో వైకాపాకి ఆదరణ ఎక్కువ ఉందని చెప్పి ముఖ్యమంత్రి కడప జిల్లాకు పూర్తి అన్యాయం చేస్తున్నారని వైకాపా జిల్లా కన్వీనర్ అమరనాథరెడ్డి, కడప శాసనసభ్యుడు అంజాద్‌బాష, నగర మేయర్ సురేష్‌బాబులు ధ్వజమెత్తారు. వైకాపా జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… కడప విమానాశ్రయం పూర్తయి సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇంత వరకు ప్రారంభించకపోవడం దారుణమన్నారు.ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కావొస్తున్నా జిల్లాకు ఒక్కపైసా నిధులు మంజూరు చేయలేదన్నారు. వస్తాయని భావిస్తున్న బ్రహ్మణి ఉక్కు ఫ్యాక్టరీని, […]పూర్తి వివరాలు ...