మా గురించి

కడప కోసం ఏదో ఒకటి చెయ్యాలి.

“ఏం చెయ్యాలి?”

“ఏం చేస్తే బాగుంటుంది?”

“మీ ఊరికి మంచి జరిగే ఏదో ఒక పనికి విరాళం ఇవ్వు” ఒక మిత్రుని సలహా.

“కడప పైన (విశేషాలు) తెలిపే ఒక పుస్తకం తెస్తే బాగుంటుందేమో! ఆలోచించు.” మరో మిత్రుని సూచన.

“పుస్తకమే ఎందుకు?”

“కడప గురించి మిగతా ప్రాంతాలలో దురభిప్రాయం ఉంది. కడప విశేషాలతో పుస్తకం తెస్తే అది కొంతమంది కైనా నిజాలను తెలియచేస్తుంది.” ఇదీ ఆ మిత్రుని వివరణ.

“కడప పైన మంచి కంటే చెడు అభిప్రాయం ఎక్కువుంది. కరక్టే!”

చంపుకుండే వాళ్ళు, రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, కరుకు మనుషులు…. మూర్ఖులకు పుట్టిల్లు కడప అన్నంతగా సినిమాలలో చూపిస్తున్నారు. అంతేనా … సీమ ముఠా సంస్కృతీ, ముఠా కక్షలు అంటూ చిన్న సంఘటనలను పట్టుకుని ప్రచార మాధ్యమాలు మన సంస్కృతి పైన మన పైన దాడి చేస్తున్నాయి. ఈ దాడిలో నిజాలను సమాధి చేస్తున్నాయి.” అంటూ ఒక మిత్రుడు ఆవేదన చెందాడు.

అవును నిజమే. హత్యలు కోస్తా ప్రాంతంలో జరగటం లేదా ? తెలంగాణలో జరగటం లేదా? ముఠా కక్షలు పల్నాడు ప్రాంతంలో లేవా? అక్కడి వాటిని సాధారణమైన విషయాలుగా పరిగణించే మాధ్యమాలు ఇక్కడి అంశాలను విభిన్నంగా ఎందుకు ప్రచారం చేస్తున్నాయి? ఇక్కడున్న ప్రత్యేకతలను, ఇక్కడున్న గొప్ప విషయాలను, మారిన పరిస్థితులను ఎందుకు చెప్పలేకపోతున్నాయి?” ఇదీ మా మనసులను తొలచిన ప్రశ్న.

మహామహుల పుట్టిల్లైన మన కడప గడప ఖ్యాతిని, సమస్యలను, సంస్కృతిని మనమే ఎలుగెత్తి చాటాలి. సాంస్కృతికంగా మన పైన జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి. ఈ క్రమంలో ఇతరుల సంస్కృతిని దూషించరాదు.” ఇదీ మా లక్ష్యం.

“పుస్తకం నవీకరించటానికి ఉపయోగపడదు.” ఇదీ సమస్య.

“మరి పరిష్కారం?”

“వెబ్ సైట్!”  టక్కున వినబడింది మిత్రుని నోటి నుండి.

“నిర్వహణ, ఖర్చులు ఎంత కాలం భరిస్తావు?” మరో మిత్రుని సంశయం.

“చేతనైనంత వరకు, మీ లాంటి వారి చేయూత ఉన్నంత వరకూ….”

5 వ్యాఖ్యలు

  1. Nizamabad py kooda ila evaryna oka prayatnam cheste baagundunu!

  2. ఎవరికైనా పుట్టిన ఊరు అంటే .. పెరిగిన బాల్యం మధుర స్మృతులు గుర్తుకొస్తాయి. కడపలో పుట్టిన మాకు కడప మీద అభిమానం చాలా ఎక్కువ. కడప గురించి ఈ సైట్ చూడగానే నాకు కడప జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. అందుకే ఈ వ్యాఖ్య నే రాస్తున్నా. కడప గొప్పదనం చాటి చెపుదాం!!

  3. Good Morning sir,
    Really you are doing excellent service to your district. I have seen your site recently and liked it very much. Like you, I am also having an idea to do something special to my native dist. – Chittoor. With your inspiration, I too got an idea to start something like this. But, I do not know how to create the site and procedures if any to be followed. Could you please guide me? My cell No is 9550206122.

  4. Nice effort.keep going.all the best

  5. dumplagattu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: