కడప జిల్లాలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కడప పేరెత్తితే నాకు తెలియని ఆనందం కలుగుతుంది. కన్నతల్లి, కన్న ఊరు ఇష్టంలేని వారెవరు? తొలి తెలుగు కవయిత్రి తిమ్మక్క మొదలు, నాచన సోమన్న, వల్లభరాయలు, అల్లసాని పెద్దన, రామరాజ భూషణుడు, అయ్యలరాజు రామభద్రుడు, వేమన లాంటి మహామహులు జన్మించిన గడ్డపై పుట్టానంటే నా అణువణువూ తన్మయత్వంతో పులకిస్తుంది. 5 దశాబ్దాల్లో సాధించినంత పురోగతిని గత మూడున్నరేళ్లలోనే జిల్లాలో సాధించడంతో మాతృభూమి రుణాన్ని కొంతైనా తీర్చుకోగలిగాననే సంతృప్తి కలుగుతోంది.