ముఖ్యమంత్రికి రాసిన బహిరంగలేఖలో కడప జిల్లా కాంగ్రెస్ కడప: కడప జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యాన్ని, జిల్లాపైన తెదేపా కొనసాగిస్తున్న వివక్షను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాసింది. ఈమేరకు ఇందిరాభవన్‌లో బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ ఆ లేఖను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా చూస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కడప జిల్లాపై వివక్ష కొనసాగిస్తూనే ఉన్నారని ఆరోపించారు. ‘మీరు […]పూర్తి వివరాలు ...
Tags :congress
కడప: రాష్ట్ర మంత్రులకు కడప జిల్లా విహార కేంద్రంగా మారినట్లుందని.. ప్రైవేటు కార్యక్రమాలకు, మేమున్నామన్నట్లు ప్రెస్‌మీట్‌ల కోసం వస్తున్నారే కానీ అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని డీసీసీ అధ్యక్షుడు నజీర్అహ్మద్ ఆరోపించారు. స్థానిక ఇందిరాభవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర మంత్రి పీతల సుజాతకు రాష్ట్రవిభజన గురించి సరిగా తెలిసినట్లులేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రవిభజనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాసిన విషయాన్ని ఆమె మరచినట్లుందన్నారు. […]పూర్తి వివరాలు ...
జిల్లా అభివృద్ధిపై ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో కడప : దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నాడని, కడప జిల్లాను పూర్తిగా మరిచారని శాసనమండలిలో ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లా అభివృద్ధిపై ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థంకాలేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కింద సుమారు రూ. 80వేల కోట్లు […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో మొత్తం పది శాసనభ నియోజకవర్గాలున్నాయి. ఈ పది నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలైన వైకాపా, కాంగ్రెస్, తెదేపా+భాజపా మరియు జైసపాల తరపున బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు.పూర్తి వివరాలు ...
శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పరిస్థితి కడప జిల్లాలో దయనీయంగా మారింది. ఈనెల 30న జరిగే పురపాలక పోరులో ఆ పార్టీ తరపున నామినేషన్ వేసే నాధుడే కరవయ్యారు. జిల్లాలోని ఏడు మున్సిపాల్టీల్లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థుల సంఖ్య రెండంకెలకు మించలేదు. ముఖ్యంగా మైదుకూరు, ఎర్రగుంట్ల మున్సిపాల్టీల్లో ఆ పార్టీ తరపున నామినేషన్ వేసే అభ్యర్థి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం పార్టీ పరిస్థితికి అద్దంపడుతోంది. కడప కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు […]పూర్తి వివరాలు ...
నిన్ననే రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. నిన్న రాత్రి పొద్దు పోయే వరకు పాత్రికేయ మిత్రులు ఎన్నికల ఫలితాలను సేకరించి పార్టీల వారి మద్దతుదారులను లెక్కించే పనిలో ఉండగా, సంపాదకులు, బ్యూరో చీఫ్ లు క్షేత్ర స్థాయి నుండి అందిన సమాచారాన్ని క్రోడీకరించి జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయి బ్యానర్ కథనాన్ని తయారు చేశారు. ఇవాళ ఉదయం ఆయా పత్రికలలో వెలువడిన కథనాలు చెప్పింది ఒక్కటే .. ‘వైకాపా హవా తగ్గిందీ’ అని. నేరుగా […]పూర్తి వివరాలు ...
అధికార యంత్రాంగం మొత్తం వైకాపాకు అనుకూలంగా పనిచేశారని కడప జిల్లా కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు అనిల్ కుమార్ కు ఫిర్యాదు చేయడం విశేషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున డి.సి.సి అధ్యక్షుడు మాకం అశోక కుమార్ దీనికి సంబంధించి కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించడం ఆసక్తికరంగా ఉంది. జిల్లాలో మంగళవారం జరిగిన రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల ఉపఎన్నికల పోలింగ్‌లో పలువురు అధికారులు, ఉద్యోగులు ఏకపక్షంగా వ్యవహరించారని, ఆ మూడు నియోజకవర్గాల్లో అధికార […]పూర్తి వివరాలు ...
స్వల్ప సంఘటనలు మినహా వైఎస్సార్ జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంల ఏర్పాటులో తలమునకలయ్యారు. ఉదయం 8 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 10 గంటల సమయం తర్వాత ఊపందుకుంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్ల ఉత్సాహం కొనసాగింది. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. 2009 అసెంబ్లీ ఎన్నికల కంటే అధిక సంఖ్యలో ఓటర్లు ఈసారి […]పూర్తి వివరాలు ...
ఎట్టకేలకు సిబిఐ ఊహాగానాలకు తెరదించింది. కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ అరెస్టు చేసింది.ఈ మేరకు వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల సిబిఐ సమాచారం అందించింది. రేపు జగన్ కోర్టుకు హాజరు కావాల్సిన నేపధ్యంలో విచారణ పేరుతొ సిబిఐ జగన్ను అదుపులోకి తీసుకుంది. నా అరెస్టుకు రంగం సిద్ధమైన్దంటూ జగన్ చేస్తున్న ఆరోపణలను నిజమయ్యాయి. జగన్ అరెస్టు సమాచారాన్ని ముందస్తుగా అందుకున్న ప్రభుత్వమూ, పోలీసు శాఖ నిముషాల వ్యవధిలో భారీగా పోలీసు బలగాలను మోహరించింది.పూర్తి వివరాలు ...