చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (కూటమి), గత వైకాపా ప్రభుత్వం కడప జిల్లాలో 250 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన MSME టెక్నాలజీ సెంటర్‌ను కడప జిల్లా, కొప్పర్తి నుండి అమరావతికి తరలిస్తూ జీవో నెంబరు 56 (పరిశ్రమల శాఖ) ను సెప్టెంబరు 24వ తేదీన విడుదల చేసింది. ఆ జీవో ప్రతిఇది. పూర్తి వివరాలు ...
వైఎస్ జగన్ హయాంలో కడప అభివృద్ధి జగన్ గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి (దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారి కుమారుడు) 30/05/2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లాకు మంజూరు చేసిన/చేయించిన కొన్ని అభివృద్ది పనులు … విద్యారంగం : సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రిమ్స్ విస్తరణ ప్రదేశం : కడప నగరం అంచనా […]పూర్తి వివరాలు ...
“రామారావు తెలుగువాడిగా పుట్టటం మన అదృష్టం. ఆయన దురదృష్టం” అంటారు ఆయన అభిమానులు. అయన అంతటి ప్రతిభాశాలి కావడం, ఆ సినిమాలను మళ్ళా మళ్ళా చూసి ఆస్వాదించగలగడం తెలుగు ప్రేక్షకుల అదృష్టం. ఆయన దురదృష్టం ఏమిటంటే (బహుశా) తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడే మొదలైన డ్యాన్సులు చెయ్యలేక, చెయ్యకుండా ఉండలేక, డ్యాన్సుల పేరుతో ఆయన చేసిన ఎక్సర్‌సైజులు హాస్యాస్పదంగా, రొమాన్స్ పేరుతో హీరోయిన్ల మీద ప్రదర్శించే హింసాకాండ చూడడానికి ఇబ్బందిగా ఉంటాయి. విదేశీ సినిమాల్లో అయితే ఆ బాధ […]పూర్తి వివరాలు ...
రాయలసీమ తొలితరం వచన కవయిత్రి , ప్రముఖ రచయిత్రి, సంఘసేవకురాలు పసుపులేటి పద్మావతమ్మ (76) గురువారం కన్నుమూశారు. ‘మౌనఘోష’ కవితా సంపుటి ద్వారా కవయిత్రిగా పేరుపొందారు. చేరా, పొత్తూరి వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు మౌనఘోష గురించి ప్రత్యేకంగా రాశారు. రాధా మహిళా సమాజాన్ని స్థాపించి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. ప్రొద్దుటూరు, కడప పట్టణాల్లో వృద్ధాశ్రమాలను నిర్వహించారు. హాస్పటల్ ద్వారా రోగులకు సేవలను అందించడమే కాక అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. కడపజిల్లా రెడ్ క్రాస్ […]పూర్తి వివరాలు ...
కడప నడిబొడ్డున ఉన్న కలెక్టరేట్ పాత భవనాన్ని 1889 సంవత్సరంలో బ్రిటీషువారు నిర్మించారు. అంటే ఈ భవనం వయసు : 132 ఏళ్ళు భవన నిర్మాణ వ్యయం అప్పట్లో కేవలం 2 లక్షల 50 వేల రూపాయలు మాత్రమే. బ్రిటీష్ రాజరిక నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. స్వాతంత్య్రం రాక ముందు 65 మంది కలెక్టర్లు, స్వాతంత్య్రం వచ్చిన తరువాత 44 మంది కలెక్టర్లు ఈ భవనం నుంచి తమ […]పూర్తి వివరాలు ...
కొండపేట కమాల్ “నేను మా ఇంట్లో పెద్ద ఆద్దాలను అమర్చుకుని స్త్రీపాత్రల హావభావాలను, వివిధ రసాభినయాలాలో ముఖకవలికలను, ముస్తాబు తెరగులను, నవ్వులను, చూపులను, నడకలను కొన్నేళ్ళపాటు సాధన చేశాను. ఈ కమాల్ ఈ సౌకర్యాలను సమకూర్చుకునే ఆర్ధిక స్తోమత లేని వాడయినప్పటికీ హావభావ ప్రదర్శనలో నన్ను ముగ్ధుణ్ణి గావించాడు. ఈయన గానమాధుర్యం అసమానమైనది. ఈయన నిజంగా వరనటుడు.. ఈయనను గౌరవించుటకెంతో సంతోషిస్తున్నాను’’ ప్రఖ్యాత స్త్రీ పాత్రల నటుడు, పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు తాడిపత్రిలోని ఒక రంగస్థల […]పూర్తి వివరాలు ...
ఈ ఊరున్న తావులో కుందేళ్ళ పైకి యాటకుక్కను ఇడిసిపెడితే ఆ యాటకుక్కపైన కుందేళ్లు తిరగబడినాయంట. ఈ తావు శౌర్యం కలిగినదని భావించి ఇక్కడ ఊరు కట్టించగా దానికి 'పోట్లదుర్తి' అనే పేరు పొందిందట.పూర్తి వివరాలు ...
సాక్షి, కడప: వెనుకబడిన ప్రాంతమైన జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్. శుక్రవారం ఆయన వైఎస్సార్ జిల్లా బద్వేలు, కడపలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తొలుత బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గాల్లో బద్వేలు ఒకటన్నారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, దివంగత ప్రియతమ నేత నాన్న గారి హయాంలో మాత్రమే ఈ నియోజకవర్గానికి మంచి […]పూర్తి వివరాలు ...