రాయచోటి వీరభద్రాలయం

రాయలకాలంలో రాయచోటి పక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం వెలసింది. వీరభద్రస్వామికి రాచరాయుడు అనే పేరుకూడ ఉంది. ఇక్కడ మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

బ్రహ్మోత్సవాలు జరిగిన తరు వాత మధ్యలో ఉన్న ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం ప్రత్యేక విశేషం.

ఆనవాయితీ

మరో విశేషం ఏమంటే ముస్లింలలోని దేశముఖితేకు చెందిన వారు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి పూజా సామాగ్రి పంపుతారు. ఆ పూజా సామగ్రితో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తిరిగి వారికి పంపడం ఆనవాయితీగా వస్తుంది.

ప్రధాన ఆకర్షణ :

ఆలయ ముందు భాగంలో 56 అడుగుల ఎత్తుగల ఏక శిలా రాతి దీపస్తంభం ఉంది. ఇది ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంత పెద్ద ఏకశిల దీపాస్తంభం దక్షిణ భారతదేశంలోనే మరెక్కడా లేదని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ స్తంభంపై భాగంలో దీపం వెలిగించి స్వామి వారిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది.

ఆలయ నిర్మాణం

ఈ దేవాలయం రాయల కాలం నుండి అత్యంత ప్రసిద్ధి గాంచింది. పూర్వ కాలంలో సామంత రాజులు ఈ ప్రాంతానికి విచ్చేసిన సమయంలో మాండవ్య నది ఒడ్డున సేద తీరుతూ ఉండేవారని ప్రతీతి. ఆ కాలంలోనే భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయాన్ని భక్తి ప్రపత్తులతో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు మాండవ్య నది ఒడ్డున వెలసిన వీరభద్రస్వామి దేవాలయం భక్తులతో కళకళలాడుతోంది.

చదవండి :  చీకటి మాటున గంజికుంట సీమ చరిత్ర

చోళ సామ్రాజ్య విస్తరణలో భాగంగా యుద్ధాలు చేసి అలసి పోయిన రాజాధిరాజ చోళుడు మానసిక ప్రశాంతత కోసం దేశాటనకు బయలుదేరి ఇక్కడి మాండవ్య నది తీరానికి చేరుకున్నాడు. కొండల గుట్టల మధ్య ప్రవహిస్తున్న మాండవ్య నది ఒడ్డున విరాజిల్లు తూండిన పూల తోటలు ఆయనను విశేషంగా ఆకర్షించాయి. దీంతో ఆయన ఇక్కడే తన పరి వారంతో నిలిచిపోయి జీర్ణావస్థలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రుని కొలువు ఆలయాన్ని పున: నిర్మించాడని చరిత్ర చెబుతోంది.

 దేవాలయ చరిత్ర

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ జిల్లాకు చెందిన భావిగి అనే గ్రామంలో సుమారు 200 సంవత్సరాల క్రితం భద్రప్ప జన్మించి నట్లు భక్తుల నమ్మకం. ఈయన వీరభద్రుని అవతారమని చెబు తారు. భద్రప్ప నిజసమాధి ఉన్న భావిగిలో కూడ ఉత్సవాలు జరు గుతాయి.

తాండూరు నివాసి పటేల్‌ బసన్న బీదర్‌ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భావిగి గ్రామంలో జరిగే శ్రీభద్రేశ్వర స్వామి మఠం ఉత్సవాలకు ఏటా ఎడ్లబండిపై వెళ్లి దర్శించుకొని వచ్చేవారు. ఒక సంవత్సరం స్వామిని కలిసి వెళ్లిపోతున్నానని చెప్పి బండిపై తిరుగి వస్తుండగా ఆ భద్రేశ్వరస్వామి బండి వెంబడి రాసాగాడు. ఇది గమనించిన బసప్ప స్వామివారిని బండి ఎక్కమని ప్రార్థించగా అందుకు నిరాకరించి అలాగే బండి వెంబడి నడక సాగించి చివరికి ప్రస్తుతం దేవాలయం ఉన్న స్థలంలో అదృశ్యమయ్యాడు.

వీరభద్రాలయం

అదే రోజు రాత్రి బసన్నకు భద్రప్ప కలలో కనిపించి తన పాదుకలను భావిగి మఠం నుంచి తీసుకువచ్చి వీటిని తాండూరులో ప్రతిష్టించి, ఆలయాన్ని ఏర్పాటు చేయాలని, జాతర జరపాలని ఆజ్ఞా పించినట్లు చెపుతారు.

చదవండి :  ఒంటిమిట్ట కోదండరామాలయం

గర్భగుడి ప్రక్కనే శివపార్వతుల ఆలయాన్ని కూడా నిర్మించారు.

 జాతర రథోత్సవం

ప్రతిఏటా ఉగాది పర్వదినం అనం తరం చైత్రమాసంలో మదన పూర్ణిమ తరువాత వచ్చే మంగళవారం రోజు జాతర ఉత్సవాలు ప్రారంభమై శని వారం స్వామి వారి రథోత్సవం అత్యం త వైభవంగా నిర్వహిస్తారు. పరిసర ప్రాంతాలవారే కాకుండా ఇతర జిల్లాల నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి కూడా భక్తులు స్వామివారిని దర్శిం చుకుంటారు.

స్వామివారిని అర్థరాత్రి రథంలో ఊరేగిస్తారు. ఏడు అంతస్థులు 50 అడుగుల ఎత్తునగల రథాన్ని భక్తులు తాళ్లతో ముందుకు లాగుతూ బసవన్నకట్ట వరకు తీసుకువచ్చి మళ్లి యధా స్థానానికి చేరుస్తారు. భక్తులు తమ కోరికల్ని మనసులో తలచి రథం పైకి అరటిపళ్లు విసురుతారు. కలశపు భాగానికి అవి తగిలితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

ఆదివారం రోజు లంకా దహనం జరుగుతుంది. పల్లకిలో స్వామివారిని పట్టణమంతా ఊరే గిస్తూ లంకాదహన స్థలానికి వచ్చాక లంకా దహనం ప్రారంభమౌ తుంది. లంకాదహన కార్యక్రమంలో రకరకాల ఆకారాలు, డిజైన్లు ఉన్న బాణాసాంచా కాలుస్తారు.

 స్వామివారి మహిమలు

కర్ణాటకలోని భావిగిలో ఒకసారి సామూహిక భోజనాలు జరుగుతుండగా నెయ్యి అయిపోయింది. స్వామివారికి ఈ విషయం తెలిసి నీటిగుండం నుంచి కడివెడు నీటిని తీసుకురమ్మని ఆదేశి స్తాడు. ఆ నీటిని స్వామివారు నెయ్యిగా మార్చి వేశారు. భోజనశాల అనంతరం మొక్కుబడి కలవారు స్వామివారికి ఐదు కడవలనెయ్యి సమర్పిస్తారు. అందులో బదులుగా తీసుకున్న ఒక కడివెడు నెయ్యిని కలపమని ఆదేశిస్తాడు. ఇప్పటికి ఆ గుండాన్ని తప్ప ( తప్ప అంటె నెయ్యి,) గుండంగా పిలుస్తారు. స్వామివారు నీటిలో దీపం వెలిగించినట్లు, మరణించిన వారిని మహిమతో బతికించినట్లు తరాల నుంచి చెప్పుకొనే కథలు ప్రచా రంలో ఉన్నాయి.

చదవండి :  400 ఏండ్ల రాయచోటి పత్తర్‌ మసీదు

రాయచోటి వీరభద్రాలయానికి ఎలా వెళ్ళాలి ?

వాయు మార్గంలో:

దగ్గరి విమానాశ్రయం: కడప (51 కి.మీ), తిరుపతి (129 కి.మీ), బెంగుళూరు (198 కి.మీ), చెన్నై (257 కి.మీ),  హైదరాబాదు (450 కి.మీ)

రైలు మార్గంలో:

దగ్గరి రైల్వేస్టేషన్: కడప (51 కి.మీ)

రోడ్డు మార్గంలో:

దగ్గరి బస్ స్టేషన్: రాయచోటి (0.5 కి.మీ)

కడప నుండి రాయచోటికి ప్రతి 20 నిముషాలకు బస్సు సౌకర్యం కలదు.

బస్ టైమింగ్స్ :

కడప – రాయచోటి బస్సు టైమింగ్స్ 

ప్రయివేటు వాహనాలలో:

బెంగుళూరు వైపు నుండి : చింతామణి, మదనపల్లి, రాయచోటి మీదుగా

చెన్నై వైపు నుండి : తిరువళ్ళూరు, ఊత్తుకోట, పుత్తూరు, రేణిగుంట,పీలేరు, కలికిరి  మీదుగా

హైదరాబాదు వైపు నుండి : జడ్చర్ల, కర్నూలు, నంద్యాల, మైదుకూరు, కడప, రాయచోటి మీదుగా

విజయవాడ వైపు నుండి : గుంటూరు, ఒంగోలు, కావలి, ఉదయగిరి, బద్వేలు, మైదుకూరు, కడప, రాయచోటి మీదుగా

ఇదీ చదవండి!

yuvatarangam

రేపు సాయి ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

రాయచోటి: స్థానిక సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కళాశాల అధికారులు ఒక ప్రకటనలో తెలియచేశారు. …

2 వ్యాఖ్యలు

  1. hii dear all viewers i like kadapa very much but now iam not in kadapa still i will think about it why because from childhood i was their in kadapa form past 15 years iam in banglore so totaly i like kadapa very much………

    regards
    ajay

  2. నేను రాయచోటి వాసిని. ఈ మాండవ్య నది గురించి చదువుతుంటే చాలా బాధేస్తుంది. ఇప్పుడు అక్కడ నది లేదు !!! మన వూరి వారికి చైతన్యం చాలా తక్కువ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: