రాయలసీమ ప్రాంతంలో కడప లాంటి నగరంలో రాజధాని నెలకొల్పకుంటే, సమీప భవిష్యత్తులోనే ప్రత్యేక తెలంగాణా తరహా మరో వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి అటు అభివృద్ధి పరంగాను, ఇటు శాంతిభద్రతల పరంగాను ఈ ప్రాంతాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిరక్షించదలచుకుంటే కడప నగరంలో రాజధాని ఏర్పాటు ప్రభుత్వపరంగా ఒక చారిత్రక బాధ్యత.పూర్తి వివరాలు ...
అన్నమయ్య, కడప జిల్లాలో చాలా దేవాలయాలని దర్శించి, అక్కడి దేవుళ్ళ మీద కీర్తనలు రచించారు. వీటిలో కొన్ని ప్రదేశాలని కొంతమంది పరిశోధకులు, టిటిడి వాళ్ళు, వారి పరిశోధనలో గుర్తించడం జరిగింది. కాని ఇంకా కొన్ని ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలియలేదు. అలాంటి ప్రదేశాలలో, మేడిదిన్నె హనుమంతాలయం ఒకటి. ఈ ఊరి గురించి మాకు అన్నమయ్య కీర్తనల మీద పరిశోధన చేస్తున్న, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా తెలిసింది. మేడిదిన్నె కడప జిల్లాలో పెద్దముడియం మండలానికి చెందిన గ్రామము. […]పూర్తి వివరాలు ...
మైదుకూరు పట్టణంలోని పోరుమామిళ్ళ రోడ్డులో కె.సి.కెనాల్ పక్కగా వెలసిన శ్రీ సదానంద ఆశ్రమానికి (సదానందమఠం) మైదుకూరు చరిత్రలో విశిష్టమైన స్థానం ఉంది. “పిచ్చమాంబ మఠం” “పిచ్చమ్మ మఠం” పేర్లతో ఈ ఆశ్రమం పిలువబడుతోంది. మైదుకూరు మండలం వనిపెంటలోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించిన పెద్దయార్యులు మొదటగా సదానందశ్రమాన్ని స్థాపించి ప్రజల్లో తాత్విక చింతన, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడానికి శ్రీకారం చుట్టారు. తండ్రి పెద్దయార్యుల భోధనలతో పిచ్చమాంబ ప్రభావితురాలైయ్యారు . ఆశ్రమం మరింతగా అభివృద్దిచెందడానికి విశేష కృషి చేశారు. […]పూర్తి వివరాలు ...
కడప: ఇప్పటి వరకు మండలాల వారీగా గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికయిన సర్పంచ్‌ల వివరాలు. ప్రొద్దుటూరు మండలం : సోములవారిపల్లి- మోపురి ప్రశాంతి దొరసానిపల్లి- ఆరవ ఈశ్వరమ్మ చౌటపల్లి- మార్తల లక్ష్మీ సునీత తాళ్లమాపురం- మాదిరెడ్డి కొండారెడ్డి చౌడూరు- నేతిపల్లి చండ్రాయుడు రాజుపాలెం మండలం : వెంగలాయపల్లి- దనిరెడ్డి రేణుకమ్మ కొర్రపాడు- పిల్లి ఓబులమ్మ కుమ్మరపల్లి- బీరం నారాయణమ్మ గాదే గూడూరు- పొలా వరలక్ష్మీ దువ్వూరు మండలం : సంజీవరెడ్డిపల్లెలో ఇరగంరెడ్డి వీరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జొన్నవరం- [&పూర్తి వివరాలు ...
ఆలయాల వద్ద పటిష్ట నిఘా గ్రామ రక్షక దళాలతో పోలీసుల సమన్వయం అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారమివ్వండి కడప : జిల్లాలో ఉన్న దేవాలయాలు, ప్రార్థనా మందిరాల భద్రతపై పోలీసుల పటిష్ట నిఘాతో పాటుగా రాత్రి వేళ పెట్రోలింగ్ , ఆకస్మిక తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్.పి అన్బురాజన్ ఈ రోజు (సోమవారం) మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటుగా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. […]పూర్తి వివరాలు ...
ముత్తులూరుపాడు (ఆంగ్లం : Muttulurupadu or Muthulurupadu) – కడప జిల్లా ఖాజీపేట మండలంలోని ఒక ఊరు. ఈ ఊరు ఖాజీపేట, మైదుకూరుల నడుమ చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారి పై నుండి 2 కి.మీల దూరంలో ఉంది. స్థానికులు ఈ ఊరి పేరును ‘ముత్తులపాడు’ లేదా ‘ముత్తులుపాడు’ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఊర్లో పోస్టాఫీసు, రెండు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలు, పశువైద్యశాల ఉన్నాయి. ముత్తులూరుపాడులో వివిధ కులాలకు, మతాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి […]పూర్తి వివరాలు ...
సాహితి లోకంలో రారాగా సుప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డిగారి పరిచయభాగ్యం నాకు 1977లో ‘ఈనాడు’ పత్రికలో సబ్‌ఎడిటర్ ట్రెయినీగా పని చేస్తున్నప్పుడు కలిగింది. మా బ్యాచ్‌లో మేము పదిమంది దాకా ఉండేవాళ్ళం. వార్తల్ని ఇంగ్లీషు నుండి తెలుగులోకి ఎలా అనువదించాలో ఆర్నెల్ల పాటు మాకు శిక్షణ ఇచ్చారు. అను వాదం ఎంత సంక్లిష్టమైనదో అప్పుడే నేను తెలుసుకున్నాను. రా.రా.మాకు శిక్షణ గురువు. తాను సంపాదకీయాలు రాస్తూనే వార్తల్ని ఎలా అనువదించాలో మాకు నేర్పించారు. ఆయన నిండైన విగ్రహం నాకింకా […]పూర్తి వివరాలు ...
నంద్యాలంపేట (English: Nandyalampeta) – వైఎస్‌ఆర్ జిల్లా, మైదుకూరు మండలానికి చెందిన ఒక పల్లెటూరు. ఈ ఊరు మైదుకూరు – బద్వేలు రహదారిపైనున్న ‘గుడ్డివీరయ్య సత్రం’ సమీపంలో ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామం 2856 ఇళ్లతో, 11457 మంది జనాభాతో 5090 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5900, ఆడవారి సంఖ్య 5557. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3230 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 463. నంద్యాలంపేట గ్రామంలో ప్రధాన […]పూర్తి వివరాలు ...
రాజంపేట పట్టణ విశేషాలు, చరిత్ర, జనాభా వివరాలు మరియు ఫోటోలు. రాజంపేటకు వెళ్లే వారి కోసం అవసరమైన సమాచారం మరియు సూచనలు.పూర్తి వివరాలు ...