Tags :dl

    రాజకీయాలు

    ప్రభుత్వ పథకాలు పొందాలంటే వాళ్ళ కాళ్లు పట్టుకోవాలా? :డిఎల్

    పచ్చచొక్కాలకే పక్కా ఇళ్ళా? చంద్రబాబును గెలిపించడం ప్రజల ఖర్మ మైదుకూరు: అర్హులు ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని.. ఈ పరిస్థితి చూస్తుంటే కర్మపట్టి ప్రజలు చంద్రబాబును గెలిపించారనిపిస్తోందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఖాజీపేటలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం జన్మభూమి మాఊరు గ్రామసభకు డీఎల్‌ హాజరయ్యారు. అధికారులు వేదికపైకి ఆహ్వానించినా.. ఆయన ప్రజల మధ్య కూర్చొని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ప్రత్యేక రాయలసీమ కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయమొచ్చింది : డిఎల్

    బాబు సీమపైన వివక్ష చూపుతున్నారు ఇలాంటి కలెక్టర్ను ఎప్పుడూ చూడలేదు ప్రొద్దుటూరు: నేటి సమకాలీన రాజకీయ పరిమణాలు దృష్ట్యా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు కోసం మళ్లీ ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని లేకపోతే రాయలసీమ జిల్లాలకు మనుగడ ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రాయలసీమలో పుట్టిన చంద్రబాబు ఈ ప్రాంతం పైన వివక్ష చూపడం దారుణమన్నారు. రాయలసీమ పరిధిలోనే […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    కడప బరిలో తెదేపా అభ్యర్థిగా డిఎల్

    తాను రాజకీయాల్లో కొనసాగాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు కాబట్టే.. వారి ఆకాంక్ష మేరకు రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ మాజీ మంత్రి, మైదుకూరు శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డి వెల్లడించారు. మైదుకూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌యాదవ్, తెదేపా కడప పార్లమెంట్ అభ్యర్థిగా తాను ఎన్నికల గోదాలోకి దిగనున్నట్లు ఆయన ప్రకటించారు.  బుధవారం సాయంత్రం తన స్వగ్రామమైన సుంకేశులలో అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    డిఎల్ సైకిలెక్కినట్లేనా!

    దువ్వూరులో సోమవారం డిఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతోపాటు మైదుకూరు తెదేపా ఇన్‌ఛార్జి పుట్టాసుధాకర్‌యాదవ్, ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎల్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన పరిస్థితులు అందరికి తెలిసిందేనని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అందరం కలిసి కట్టుగా తెదేపా గెలుపునకు పాటుపడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెదేపా ఎంపీ అభ్యర్థిగా మీరు నిలవాలని కార్యకర్తలు కోరగా పార్టీ ఆదేశాల మేరకే అవి జరుగుతాయని చెప్పారు. దువ్వూరు మండలంలో వీలైనన్ని ఎంపీటీసీలు గెలుచుకోవాలని […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    డిఎల్ మైదుకూరులో పోటీ చేయరా?

    కాంగ్రెస్ పార్టీ నుంచి మరోమారు పోటీ చేయాల్సివస్తే కూకట్‌పల్లి నుంచే పోటీ చేస్తానని, మైదుకూరులో పోటీ చేసే ప్రసక్తేలేదని డిఎల్ తన అనుచరులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇకపై హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు నిర్వహిస్తానని వివరించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం పరస్పర సహకారంతో పయనించాం. రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇప్పటి రాజకీయాల్లో కొనసాగలేను. మీ సహకారానికి కృతజ్ఞతలు. రాజకీయంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ మంగళవారం మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతో పేర్కొన్నట్లు సమాచారం. ఖాజీపేటలో ఈనెల […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    డిఎల్ రవీంద్రారెడ్డి కంట కన్నీరు

    తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఖాజీపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో తీవ్ర ఉద్వేగానికి లోనైన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తన వెంట ఉన్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసమే తపించానని అన్నారు. తన భవిష్యత్ రాజకీయ జీవితంపై ప్రజా బ్యాలెట్ నిర్వహించానని, ప్రజలు ఇచ్చే తీర్పుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనేది […]పూర్తి వివరాలు ...

    గుసగుస రాజకీయాలు

    డి.ఎల్ అలా చేస్తారా?

    మాజీ మంత్రి డి.ఎల్ రవీంద్రా రెడ్డి గురించి ఈ మధ్య ఆయన సొంత నియోజకవర్గంలో ఒక ప్రచారం జోరందుకుంది. అదేమిటంటే … రాబోయే సార్వత్రిక ఎన్నికల బరిలో దిగినా దిగాకపోయినా తెదేపాకు సహకరిస్తారని – అందుకు నజరానాగా చంద్రబాబు తదనంతరం డిఎల్ రవీంద్రారెడ్డి గారికి రాజ్యసభ సీటు ఇస్తారని. ఇదే విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు డిఎల్ కు ప్రతిపాదించారని, అందుకు ఆయన సుముఖంగా ఉన్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి. డిఎల్ కూడా ఇందుకు సిద్దమయ్యే పక్షంలో మైదుకూరు నియోజకవర్గంలో […]పూర్తి వివరాలు ...

    గుసగుస రాజకీయాలు

    తెదేపా ఆహ్వానాన్ని పట్టించుకోవట్లేదా?

    డీ ఎల్ కి తెలుగు దేశం నేతలు గాలమేసే ప్రయత్నాలు చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే తెదేపా డీఎల్‌కు రాయబారం పంపి మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పట్ల అంతగా వ్యతిరేకత చూపని డీఎల్‌కు జిల్లాలో కీలక బాధ్యత అప్పగిస్తామని ఆ పార్టీ నేతలు భరోసా ఇస్తున్నారు. అయితే ఈ ఆహ్వానం పట్ల డీఎల్‌ నుంచి ఇంతవరకు సానుకూల స్పందన రాకపోవడంతో వేచి చూసే ధోరణిలో టీడీపీ నేతలు ఉన్నారు. రాబోయే ఎన్నికలలో తెదేపా […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    మంత్రి పదవిపై ఆశలేదంట!

    ‘నాకు మంత్రి పదవిపై ఆశ లేదు. నేను మంత్రి పదవిని కోరుకోవడంలేదు. మంత్రి పదవి రానంత మాత్రాన నిరాశపడను. అధికారం కోసం ఆరాటపడను.’ అని కమలాపురం ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి అన్నారు. కమలాపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ధ్యేయం నెరవేరిందని, మంత్రి పదవిని కోరుకోవడం లేదని చెప్పారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని అందరితో కలిసి […]పూర్తి వివరాలు ...