డిఎల్ సైకిలెక్కినట్లేనా!

దువ్వూరులో సోమవారం డిఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతోపాటు మైదుకూరు తెదేపా ఇన్‌ఛార్జి పుట్టాసుధాకర్‌యాదవ్, ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎల్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన పరిస్థితులు అందరికి తెలిసిందేనని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అందరం కలిసి కట్టుగా తెదేపా గెలుపునకు పాటుపడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెదేపా ఎంపీ అభ్యర్థిగా మీరు నిలవాలని కార్యకర్తలు కోరగా పార్టీ ఆదేశాల మేరకే అవి జరుగుతాయని చెప్పారు.

చదవండి :  ప్రత్యేక రాయలసీమ కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయమొచ్చింది : డిఎల్

దువ్వూరు మండలంలో వీలైనన్ని ఎంపీటీసీలు గెలుచుకోవాలని కోరారు.  పుట్టాసుధాకర్‌యాదవ్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతోపాటు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో తెదేపా గెలుపునకు అందరూ సహకరించాలని కోరారు.

పోటీలో అభ్యర్థులు ఎవరున్నా వైషమ్యాలు పక్కన పెట్టి కార్యకర్తలు గెలుపునకు తోడ్పడితే పార్టీలో అందరికి సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు.

మొత్తానికి డిఎల్ కూడా పచ్చ చొక్కా తొడుక్కోవడానికి సిద్ధంయ్యారన్నమాట. బహుశా కూకట్ పల్లి  నుండి తెదేపా తరపున శాసనసభ టికెట్ హామీ లభించిందేమో!

చదవండి :  కడప జిల్లా తెదేపా నేతలు నోరు మొదపరేం?

ఇదీ చదవండి!

telugudesham

జిల్లా పేరు మార్చాలని తెదేపా తీర్మానం

కడప: వైఎస్‌ఆర్ జిల్లాకు కడప జిల్లాగానే పేరు మార్చాలని ఆదివారం కడపలో జరిగిన తెదేపా మినీ మహానాడులో ఆ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: