
జిల్లా పేరు మార్చాలని తెదేపా తీర్మానం
కడప: వైఎస్‌ఆర్ జిల్లాకు కడప జిల్లాగానే పేరు మార్చాలని ఆదివారం కడపలో జరిగిన తెదేపా మినీ మహానాడులో ఆ పార్టీ నేతలు తీర్మానించారు.
కడపకు ఎంతో ఘనచరిత్ర ఉందని, జిల్లాలో ఎంతోమంది కవులు, కళాకారులు, మహనీయులు, పుట్టారని, అలాంటి వారి పేర్లను మరచి జిల్లాకు వైఎస్‌ఆర్ కడప జిల్లా అన్న పేరు పెట్టడం దురదృష్టకరమని పలువురు తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన మినీమహానాడులో నూతన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకురాగా వైఎస్‌ఆర్ పేరు తొలగించాలని తీర్మానించారు.
జిల్లాలోని వైఎస్‌ఆర్ పేరు తొలగింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేయాలని జిల్లా నేతలు డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ తీర్మానాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.