చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (కూటమి), గత వైకాపా ప్రభుత్వం కడప జిల్లాలో 250 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన MSME టెక్నాలజీ సెంటర్‌ను కడప జిల్లా, కొప్పర్తి నుండి అమరావతికి తరలిస్తూ జీవో నెంబరు 56 (పరిశ్రమల శాఖ) ను సెప్టెంబరు 24వ తేదీన విడుదల చేసింది. ఆ జీవో ప్రతిఇది. పూర్తి వివరాలు ...
Tags :tdp
పసుపు పచ్చని విషం తెదేపా, ఆ పార్టీ నేతలు, వారికి బాకా ఊదే కరపత్రాలు పదే పదే కడప జిల్లాను, ఇక్కడి సంస్కృతిని, ప్రజలను కించపరుస్తూ వ్యాఖ్యలు చెయ్యటం సర్వ సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో పచ్చ పార్టీకి చెందిన పలువురు నేతలు కడప జిల్లా, రాయలసీమల పైన చేసిన విపరీత వ్యాఖ్య/ఆరోపణలను వీక్షకుల సౌలభ్యం కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాం… తేదీ: 03 ఫిబ్రవరి 2023, సందర్భం: మీడియా సమావేశం (అమరావతి) నాయకులు: అచ్చెంనాయుడు [divider style=”normal” top=”10″ […]పూర్తి వివరాలు ...
పోతిరెడ్డిపాడును నిరసిస్తూ అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం
2008 శాసనసభ సమావేశాలలో ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా తెలుగుదేశం పార్టీ పోతిరెడ్డిపాడు వెడల్పు కారణంగా అవిశ్వాసం ఎదుకు కోరరాదు అంటూ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోతిరెడ్డిపాడు గురించి ఆ రోజు సభలో తెలుగుదేశం పార్టీ చేసిన ప్రొసీడింగ్స్ కడప.ఇన్ఫో సందర్శకుల కోసం… తేదీ : 1 ఏప్రిల్ 2008 పూర్తి వివరాలు ...
సూక్ష్మ సేద్య పరికరాల (స్ప్రింక్లర్లు, బిందు సేద్య పరికరాలు మొదలైనవి) కొనుగోలు సబ్సిడీ విషయంలోనూ కడప, కర్నూలు జిల్లాలపై తెదేపా ప్రభుత్వం వివక్ష చూపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మసాగునీటి పథకం కింద వివిధ వర్గాల రైతులకు ప్రకటించిన సబ్సిడీల విషయంలో జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలలో ఉన్న రైతులకు ఎక్కువ లబ్ది కలిగేలా ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబరు-34(https://kadapa.info/gos/go34/)ని విడుదల చేసింది. అదే సమయంలో రాయలసీమకే చెందినా కడప, కర్నూలు […]పూర్తి వివరాలు ...
కడప: వైఎస్‌ఆర్ జిల్లాకు కడప జిల్లాగానే పేరు మార్చాలని ఆదివారం కడపలో జరిగిన తెదేపా మినీ మహానాడులో ఆ పార్టీ నేతలు తీర్మానించారు. కడపకు ఎంతో ఘనచరిత్ర ఉందని, జిల్లాలో ఎంతోమంది కవులు, కళాకారులు, మహనీయులు, పుట్టారని, అలాంటి వారి పేర్లను మరచి జిల్లాకు వైఎస్‌ఆర్ కడప జిల్లా అన్న పేరు పెట్టడం దురదృష్టకరమని పలువురు తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన మినీమహానాడులో నూతన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకురాగా వైఎస్‌ఆర్ పేరు […]పూర్తి వివరాలు ...
పట్టిసీమ ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకురావడానికి సీఎం చంద్రబాబు మహాయజ్ఞం చేస్తుంటే, విపక్ష నేత జగన్ దీనికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ శాసనమండలి ఉపాధ్యక్షులు సతీష్‌కుమార్‌రెడ్డి (తెదేపా) ఆధ్వర్యంలో సోమవారం పులివెందుల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లాలోని తెదేపా నేతలంతా హాజరై పట్టిసీమకు అనుకూలంగా మాట్లాడటం విశేషంగా ఉంది. అనంతరం ర్యాలీనుద్దేశించి సతీష్‌రెడ్డి, తెదేపా నేతలు ప్రసంగించారు. వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితి మున్ముందు […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో వైకాపాకి ఆదరణ ఎక్కువ ఉందని చెప్పి ముఖ్యమంత్రి కడప జిల్లాకు పూర్తి అన్యాయం చేస్తున్నారని వైకాపా జిల్లా కన్వీనర్ అమరనాథరెడ్డి, కడప శాసనసభ్యుడు అంజాద్‌బాష, నగర మేయర్ సురేష్‌బాబులు ధ్వజమెత్తారు. వైకాపా జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… కడప విమానాశ్రయం పూర్తయి సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇంత వరకు ప్రారంభించకపోవడం దారుణమన్నారు.ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కావొస్తున్నా జిల్లాకు ఒక్కపైసా నిధులు మంజూరు చేయలేదన్నారు. వస్తాయని భావిస్తున్న బ్రహ్మణి ఉక్కు ఫ్యాక్టరీని, […]పూర్తి వివరాలు ...
1980, 90 దశకాలలో రాయలసీమ జిల్లాలలో ఎక్కడ ఓ మోస్తరు దొంగతనం జరిగినా మరుసటి నాటి దినపత్రికలలో పోలీసుల ప్రకటన ఇలా ఉండేది. ‘దొంగతనం జరిగిన తీరును చూస్తోంటే ఇది స్టూవర్టుపురం ముఠాల పని అయి ఉంటుందని పోలీసులు ప్రాధమిక విచారణలో తేలింది’ అనేది ఆ ప్రకటనల సారాంశం. సదరు వార్తలు చదివిన వారికి స్టూవర్టుపురం దొంగల వెర్రితనం ఆశ్చర్యం కలిగించేది. ఎందుకంటే ఒకప్పుడు గుంటూరు జిల్లాలో భాగంగా ఉండిన చీరాలకు దగ్గరలో ఉన్న స్టూవర్టుపురం అనే […]పూర్తి వివరాలు ...
అనగనగా మంగాపురం అని ఒక ఊరు. ఆ ఊర్లో జనాలంతా కూలీ నాలీ చేసుకుని రెక్కల కష్టం మీద బతికేవోల్లు. ఉన్నట్టుండి ఒక రోజు ఆ ఊరికి వచ్చిన కొంతమంది స్థానిక యాపారులకి అక్కడ ఉన్న భూముల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. వెంటనే వాళ్ళు ఆ దేశపు రాజు దగ్గరికి పోయి ఇలా అడిగినారు.. ‘రాజా… మేము మంగాపురంలో ఉన్న బంగారు నిక్షేపాలను కనుగొన్నాం. మీరు అనుమతిస్తే ఆ నిక్షేపాలను వెలికితీసి అమ్ముతాం. తద్వారా వచ్చిన […]పూర్తి వివరాలు ...