వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వేరేవారికి పడుతున్నాయి?
ఉప ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసి ఇవిఎంలు పలు కేంద్రాలలో పని చేయకుండా మొరాయించాయి. ఇవిఎంలకు సంబంధించి పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా చాలా కేంద్రాలలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
కొన్ని చోట్ల మధ్యమధ్యలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తుంటే 4వ నెంబరు అభ్యర్థికి పడుతోంది. కడపలోని రెండు పోలింగ్ కేంద్రాలలోని ఇవిఎంలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వేరేవారికి పడుతున్నాయి.
బద్వేలులోని ఒక పోలింగ్ బూత్లో ఇవిఎంలలోని వరుస సంఖ్య మొదటి నుంచి చివరికి కాకుండా, చివర నుంచి మొదటికి ఉంది. అంటే 1, 2, 3… కాకుండా 42,41,40… గా ఉన్నాయి.