కడప జిల్లాలో వాడుకలో ఉన్న ఎర్రగడ్డ లేదా ఎరగడ్డ లేదా యరగడ్డ అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘ఎరగడ్డ‘ in Telugu Language. ఎర్రగడ్డ లేదా యరగడ్డ : నామవాచకం (noun), ఏకవచనం (పూర్తి వివరాలు ...
కడప నగరంలోని అస్థానా-ఏ-మగ్దూమ్ ఇలాహీ (అమీన్‌పీర్ దర్గా లేదా పెద్ద దర్గా లేదా కడప దర్గా) దేశంలోని గొప్ప దర్గాలలో ఒకటి. ‘దక్షిణ భారత అజ్మీర్’గా పేరుగాంచిన ఈ దర్గాను నిత్యం వందలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కడప దర్గాలో అడుగిడిన ప్రతి ఒక్కరూ తొలుత ప్రధాన గురువులైన హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ సాహెబ్ మజార్‌ను దర్శించుకుంటారు. అనంతరం అదే ప్రాంగణంలోని హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ మజార్‌తోపాటు ఆ వంశానికి చెందిన […]పూర్తి వివరాలు ...
విద్వాన్ రామిరెడ్డి యల్లారెడ్డి గారు రాసిన భైరవేశ్వర ఆలయ చరిత్ర – ‘మోపూరు కాలభైరవుడు’. 2002లో ప్రచురితం.పూర్తి వివరాలు ...
పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని వశీకరణకు గురైన ఒక నాయిక ఆ ‘మాయగాడి’ని మోహిస్తూ.. వచ్చి వలపులందుకొమ్మని ఇట్లా పిలుస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 0879-5 సంపుటము: 18-472 సారెనేలే జగడము – అన్నమాచార్య సంకీర్తన ‘కన్నుల మొక్కేము…’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ నన్నుఁ గన్నెనాఁడె యేలితివి […]పూర్తి వివరాలు ...
చంద్రన్నకు రాయలసీమ ప్రజల బహిరంగ లేఖ మేధావీ,అత్యంత ప్రతిభావంతుడూ, సంపన్నుడూ అయిన మా రాయలసీమ ముద్దుబిడ్డకు… అన్నా! చంద్రన్నా!! మీరు ఈ మధ్యకాలం లో పదే పదే “నేనూ రాయలసీమ బిడ్డనే” అని ప్రకటించుకోవాల్సివస్తున్నందుకు మీకెలా ఉందేమో గాని, మీ తోబుట్టువులయిన మాకేమో చాలా భాధగా వుంది. మీరాప్రకటనను గర్వంగా చేస్తున్నారో,లేక అపరాధబావంతో చేస్తున్నారో ? మీరు చేస్తున్న పద్దతిలో మాత్రం మాకు అపరాధనాభావమే కనపడుతూంది. అయినా చంద్రన్నా! తాగునీరు,సాగునీరు కరువై,ఉపాధి లేక యితర రాష్ట్రాలకు వలసలకు […]పూర్తి వివరాలు ...
కడప నారాయణదాసు సంకీర్తనలు తొలితెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య, ప్రజాకవి వేమన , కాలజ్ఞానకర్త పోతులూరి వీరబ్రహ్మం కడప ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. వారికోవకే చెందిన పండరి భజన వాగ్గేయకారుడు కడప నారాయణదాసు తాజాగా వెలుగులోకి వచ్చారు. దాదాపు80- 90 ఏళ్ల కిందట తాడిపత్రిలో పుట్టి, కడపలో నివసించి ఈ నేలలో నడయాడి పండరి భజన కీర్తనలను రచించి, తానే గురువై బృందాలకు పండరి భజన నేర్పిస్తూ తమిళనాడు (చోళంగిపురం) చేరుకుని ప్రజాబాహుళ్యంలో చిరస్థాయిగా నిలిచి పోయిన వాగ్గేయకారులు […]పూర్తి వివరాలు ...
పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని వశీకరణకు గురైన ఒక నాయిక ఆ ‘మాయగాడి’ని మోహిస్తూ.. వచ్చి వలపులందుకొమ్మని ఇట్లా పిలుస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: శంకరాభరణం రేకు: 1610-4 సంపుటము: 26-58 మాఁటలేలరా యిఁక మాఁటలేల మాఁటలేలరా మాయకాఁడా ॥పల్లవి॥ చూచి చూచే చొక్కించితి యేచి నీ చేఁత కేమందురా కాచెఁ బూచెను కాఁగిట చన్నులు లోఁచి చూడకు లోనైతి […]పూర్తి వివరాలు ...
పదకవితా పితామహుని ‘కడపరాయడు’ ఎవరినో తలపోస్తూ కోపిస్తున్నాడని కలహాంతరియైన నాయిక ఇట్లా వాపోతున్నది. వర్గం : శృంగార సంకీర్తన రాగము: హిందోళవసంతం రేకు: 0214-2 సంపుటము: 8-80 నేనుసేసే చేఁతలలో నెరుసున్నదా మీనుల వినుమంటేను వేసరేవుగాక ॥పల్లవి॥ కప్పుర మిచ్చితిఁ గాక కవకవ నవ్వితినా రెప్పల మొక్కితిఁగాక రేసు రేచేఁనా ముప్పిరినెవ్వతెచేనో ముందువాడివచ్చి దప్పితో నొక్కటొక్కటే తలచేవుగాక ॥నేనుసేసే॥ చిగురందిచ్చితిఁగాక చేగోరు దాఁకించితినా మొగమోటనుంటిఁగాక ముంచికైకోనా మగువ యెవ్వతెచేనో మర్మాలు తొరలి వచ్చి పగటులనూరకే భ్రమసేవుగాక ॥నేనుసేసే॥ […]పూర్తి వివరాలు ...
నల్లబల్లి చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన – 2 నల్లబల్లి, కడప జిల్లాలోని ముద్దనూరు మండలానికి చెందిన ఒక గ్రామము. ఇది మండల కేంద్రమైన ముద్దనూరు పట్టణానికి సమీపంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పదకవితా పితామహుడు పలుమార్లు సందర్శించినట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. నల్లబల్లి చెన్నకేశవుని సరససల్లాపాలను అన్నమాచార్యుడు ఈ విధంగా కీర్తిస్తున్నాడు… వర్గం : శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 0190-4 సంపుటము: 7-534 చేకొనుమీ నల్లఁబల్లి చెన్నకేశవా […]పూర్తి వివరాలు ...