వార్తా విభాగం

వార్తలు

గండికోటను దత్తత తీసుకున్న దాల్మియా సంస్థ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ” వారసత్వ కట్టడాల దత్త స్వీకారం’ పథకం కింద కడప జిల్లాలోని ప్రఖ్యాత చారిత్రిక కట్టడమైన గండికోటను దాల్మియా సంస్థ దత్తతకు తీసుకుంది. గండికోట తో పాటు దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన దిల్లీ లోని ఎర్రకోట ను కూడా దాల్మియా సంస్థ దత్తత తీసుకుంది. ఈ నిర్ణయం పై పలు రాజకీయ పక్షాలు , చరిత్ర కారులలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈమేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాల్మియా […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు రాయలసీమ

ఓ రాయలసీమ రైతన్నా ! – జానపద గీతం

సాగునీటి సౌకర్యాల విషయంలో దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాయలసీమ రైతుకు వ్యవసాయం గుదిబండగా మారి, ప్రాణ సంకటమై కూర్చుండింది. కాయకష్టం చేసి గుట్టలు చదును చేసి తను సాగు చేసిన మెట్ట, పొట్ట కూడా నింపలేదని బాధపడుతున్న రైతు వ్యధను ‘ఓ రాయలసీమ రైతన్నా …’ అంటూ జానపదులు ఇలా ఆలపిస్తున్నారు. మెట్టలూ, గుట్టలుదీసి – పట్టుబట్టీ దున్నితేను చిట్టెడైన పండవేమిరా ఓ రాయలసీమ రైతన్నా..! పొట్టలైనా నిండవేమిరా ఎండలోస్తే పంటలేదు, కుండనొక్కా గింజ లేదు […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

అందమైన దాన … జానపద గీతం

అందమైన దాన,, సందమామ లాంటి దాన నీ అందమంతా సూసి నేను వాలిపోయాను పొద్దుటూరు లోనా పట్టు సీరలంగడి నాది సీరలన్నీ నీవు సింగారించుకోవే ।।అందమైన॥ ఆళ్ళగడ్డ లోన హారాలంగడి నాది హారాలన్ని నీవు రుంగారించుకోవే ॥అందమైన॥ అనంతపురంలోన అద్దాల మాడి నాది అద్దాల మాడిలోన ముద్దాడుకుందాము రావే ॥అందమైన॥ ముద్దనూరి లోన ముద్దాలంగడి నాది ఒక ముద్దయునా తిని పోదువు రావే ॥అందమైన॥పూర్తి వివరాలు ...

శాసనాలు

వన్డాడి (వండాడి) శాసనము

శాసనము : వండాడి శాసనము ప్రదేశం : వండాడి, రాయచోటి తాలూకా శాసనకాలం: ఎనిమిదవ శతాబ్దం రేనాటి చోళుల తరువాత ఎనిమిదవ శతాబ్ది తుదియందు కడప మండలము బాణ రాజులకును,వైదుంబ రాజులకును వశమయ్యెను. వైదుంబులు మొదట చిత్తూరు మండలములో నుండెడివారు. వారికి వైదుమ్బవ్రోలు అను నగరము రాజధాని. తర్వాత రేనాటి చోళులను నిర్జించి చిర్పులి నాక్రమించుకొనిరి.కొంతకాలమునకు పొత్తపి (రాజం పేట తాలూక), కలకడ (వాయల్పాడు తాలూక) నగరములు కూడ వీరికి రాజధానులయినట్లు శాసనము లందు కలదు.రేనాటి చోళులవలె […]పూర్తి వివరాలు ...

కళాకారులు జానపద గీతాలు

మహనందయ్య – జానపద కళాకారుడు (చెక్కభజన)

రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన. చెక్కభజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు అనుగుణంగా చెక్కలు కొడుతుంటారు. గురువు మధ్యలో ఉండి పాట పాడతాడు. జానపదులు ఆదరించిన కళారూపాల్లో చెక్కభజనకు విశేషమైన స్థానం ఉంది. చెక్కభజనను జానపదులకు దగ్గర చెయ్యడంలో […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

శివశివ మూరితివి గణనాతా – భజన పాట

కోలాట కోపుల్లో తాలుపుగట్టి మొదటిది. ‘శివశివ మూరితివి’ అనే ఈ పాట తాలుపుగట్టి కోపుల్లో కడప జిల్లాలో జానపదులు పాడుకునే గణపతి ప్రార్థనా గీతమిది.. వర్గం : భజన పాటలు శివశివ మూరితివి గణనాతా – నువ్వు శివునీ కుమారుడవు గణనాతా ||శివ|| బుద్ది నీదే బుద్ది నీదే గణనాతా ఈ జగతి గొలుచు దేవుడవు గణనాతా ||శివ|| సదువు నీదే సాము నీదే గణనాతా సారస్వతి నీకు దండం గణనాతా ||శివ|| బాపనోళ్ళు నిన్ను గొలువ […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా ఒకటే అనుకోవడం ఒక పద్ధతి (రాయలసీమలోనే జిల్లాల మధ్య అభివృద్ధిలో ఉన్న అంతరాల దృష్ట్యా, అలాగే విభజనానంతర అనుభవాల దృష్ట్యా కూడా నేను దీన్ని బలంగా వ్యతిరేకిస్తాను). అభివృద్ధిలో ఎక్కువ వెనుకబడిన జిల్లాలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలనుకోవడం ఇంకొక పద్ధతి. రాయలసీమలో హైకోర్టు అంటే కర్నూల్లో హైకోర్టు అనే అభిప్రాయం ఒకటి బలంగానే వ్యాప్తిలో ఉంది. […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర ప్రాబల్యం గురించిన అభిప్రాయాలు ఇప్పటికీ అలాగే ఉండడం వల్ల అప్పటి శ్రీభాగ్ ఒప్పందాన్ని అనుసరించి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయటం ఇప్పుడు అనివార్యతగా మారింది. ఐతే ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన అమరావతి ప్రాంతంలోనే జస్టిస్ సిటీ పేరుతో హైకోర్టు ఏర్పాటుచెయ్యబూనడంతో హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చెయ్యాలనే డిమాండుతో దీక్షలు, ఆందోళనలు జరుగుతున్నాయి…. పైకి ఉద్యమకారులు […]పూర్తి వివరాలు ...

వార్తలు

రైతు నేత డిఎన్ నారాయణ ఇక లేరు

కృష్ణాపురంలో అంత్యక్రియలు మైదుకూరు: రాయలసీమ రైతాంగ మౌలిక సమస్య లపై తనదైన రీతిలో పోరాటం సాగించిన మైదుకూరు రైతుసేవా సంఘం అధ్యక్షుడు డి.యన్.నారాయణ(63) శనివారం ఉదయం మైదుకూరులో మరణించా రు. నారాయణకు రెండేళ్ల కిందట గుండె శస్త్ర చికిత్స జరిగింది. రెండు రోజుల కిందట అస్త్వస్థతకు గురి కావడంతో తిరుపతికి తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్ధితి పూర్తిగా క్షీణించింది. నారాయణ అపస్మారక స్ధితిలోకి వెళ్ళిపోవడంతో  ఇంటికి తీసుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయనను శుక్రవారం రాత్రి […]పూర్తి వివరాలు ...

error: