వార్తా విభాగం

రాజకీయాలు

రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది : బిజెపి

కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్‌ రెడ్డి మండిపడ్డారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన సీమ అభివృద్ధి కోసం త్వరలో కేంద్ర మంత్రులు, ప్రధాని కడప జిల్లాకు రానున్నారని తెలిపారు. రాయలసీమ అభివృద్ధి చేయకుండా టీడీపీ కంకణం కట్టుకుందని అందుకే దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. 2014 ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదని కక్ష తీర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం వ్యాసాలు

మా వూరి చెట్లు మతికొస్తానాయి

ఎందుకో ఈ రోజు మా వూరి చెట్లు గుర్తుకొస్తున్నాయి… బయట నుండి వచ్చేవాళ్ళకు మా వూరి గుమ్మం తొక్కకముందే రోడ్డుకు కుడివైపున పెద్ద పెద్ద చింతమాన్లు కనపడేవి. అవేవీ మేమో, మా నాన్నలో, వాళ్ళ నాన్నలో నాటినవి గాదు. ఆ చింత చెట్ల ప్రాంతాన్నంతా “పాతూరు” అనేవారు. మా వూరికి ముందున్న వూరు అదే. దాని అసలు పేరు అగ్రహారం. అగ్రహారానికి ఉత్తరంగా చెరువు. అదే కల్పనాయుని చెరువు. ఆ చెరువు గట్టున వున్న శివాలయం అప్పటి […]పూర్తి వివరాలు ...

పల్లెలు ప్రత్యేక వార్తలు

కడప జిల్లాలో ప్రాణుల పేర్లు కలిగిన ఊర్లు

కడప జిల్లాలో 16 రకాలయిన ప్రాణులను (Animals, Birds, reptiles etc..) సూచించే ఊర్ల పేర్లున్నాయి. ప్రాణుల పేర్లు సూచించే గ్రామ నామాలను ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు తన పరిశోధనా గ్రంధం ‘కడప ఊర్లు – పేర్లు’లో విశదీకరించారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం … ఆలవ – ఆలవలపాడు ఎద్దు – ఎద్దులఏనె ఎనుము – ఎనుముల చింతల ఏనుగు – అనిమెల కాకి – కాకులవరం కొంగ – కొంగలవీడు కోతి […]పూర్తి వివరాలు ...

ఈ-పుస్తకాలు సంకీర్తనలు

ఘటికాద్రి హట యోగానంద భజన సంకీర్తనలు – కడప నారాయణదాసు

కడప నారాయణదాసు సంకీర్తనలు తాడిపత్రిలో పుట్టి, కడపలో నివసించి పండరి భజన కీర్తనలను రచించి, తానే గురువై బృందాలకు పండరి భజన నేర్పిస్తూ తమిళనాడు (చోళంగిపురం) చేరుకుని ప్రజాబాహుళ్యంలో చిరస్థాయిగా నిలిచి పోయిన వాగ్గేయకారులు కడప నారాయణదాసు అలియాస్ ఏ నారాయణదాసు గారు. వారు 1934లో కూర్చిన పండరి భజన సంకీర్తనల సమాహారమే ఈ పుస్తకం. పుస్తకం పేరు : ఘటికాద్రి హట యోగానంద భజన సంకీర్తనలు రచన : కడప నారాయణదాసు (ఎ నారాయణదాసు) ప్రచురణ […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

సొంపుల నీ వదనపు సోమశిల కనుమ – అన్నమయ్య సంకీర్తన

వర్గం : శృంగార సంకీర్తనలు ॥పల్లవి॥ సొంపుల నీ వదనపు సోమశిల కనుమ యింపులెల్లఁ జేకొనఁగ నిల్లు నీపతికి ॥చ1॥ కలికి నీ పిఱుఁదనే గద్దెరాతి కనుమ మొలనూళ్ళలతలనే ముంచుకొన్నది కలయఁ బోకముడినే కట్లువడ్డది అలరువిలుతుదాడికడ్డము నీ పతికి ||సొంపుల|| ॥చ2॥ ఇదివొ నీ కెమ్మోవి యెఱ్ఱశిల కనుమ కదిసి లేఁజిగురులఁ గప్పుకొన్నది వదలకింతకుఁ దలవాకిలైనది మదనుని బారికి మాఁటువో నీ పతికి ||సొంపుల|| ॥చ3॥ కాంత నీ చిత్తమే దొంగలసాని కనుమ యింతటి వేంకటపతికిరవైనది పంతపు […]పూర్తి వివరాలు ...

ఈ-పుస్తకాలు కథలు

నీలవేణి (కథల సంపుటి) – భారతం నాదమునిరాజు

నీలవేణి కథల సంపుటి కడప జిల్లాలో మొదటి కథా రచయితగా భారతం నాదమునిరాజు గుర్తించబడ్డారు. 1930లో జన్మించిన నాదమునిరాజు గారి జన్మస్థలం వేంపల్లి.రాజు గారు 1956లో రాసిన ‘నీలవేణి’ కడప జిల్లా నుండి వెలువడిన మొదటి కథగా సాహితీకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాదమునిరాజు గారి కథలను వారి మొదటి కథ ‘నీలవేణి’ పేరుతో ఒక సంపుటిగా వెలువరించినారు.పూర్తి వివరాలు ...

నివేదికలు

ఎవరి రాజధాని అమరావతి ?

పుస్తకం : ‘ఎవరి రాజధాని అమరావతి ?’,  రచన: ఐవైఆర్ కృష్ణారావు (మాజీ ప్రధాన కార్యదర్శి, ఆం.ప్ర.ప్రభుత్వం), ప్రచురణ : మార్చి 2019లో ప్రచురితం.  సౌజన్యం :ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్, హైదరాబాదు విభజిత ఆం.ప్ర రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు వెనకున్న రహస్య అజెండాలను అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు పుస్తక రూపంలో ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు.పూర్తి వివరాలు ...

పర్యాటకం సమాచారం

రాయచోటి పట్టణం

రాయచోటి (ఆంగ్లం: Rayachoti ఉర్దూ: ریچارچی), వైఎస్ఆర్ జిల్లాలోని ఒక పట్టణము, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రము మరియు మండల కేంద్రము. రాయచోటి పాలన ‘రాయచోటి పురపాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. రాయచోటి పేరు వెనుక కథ: రాచవీడు అనే పేరు క్రమంగా రాయచోటిగా మారింది భౌగోళికం: రాయచోటి పట్టణం భౌగోళికంగా 14°03’33.4″N, 78°45’05.0″E వద్ద ఉన్నది. ఇది సముద్రమట్టానికి 138 మీ (452 అడుగుల) ఎత్తులో, మాండవ్య నదీ తీరంలో కడప – చిత్తూరు రహదారిలో ఉంటుంది. రాయచోటి పట్టణం యొక్క […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

మామరో కొండాలరెడ్డి – జానపదగీతం

మామరో కొండాలరెడ్డి మామిడీ పూవంటిదాన్ని పాయముంటే ఏలుకుంటావా కొండాలరెడ్డి-సేసుకొని సూసుకుంటావా అంతనైతి ఇంతనైతి సంతలో నెరవాజి నైతి తగులుకొని నీయంట నేనొత్తి కొండాలరెడ్డి ముగము సాటు సేయకోయబ్బి ||మామరో || సింతమాని ఇంటిదాన్ని సిలకలా కొమ్మాల దాన్ని సిలుకు సీరల వాలుజడదాన్ని కొండాలరెడ్డి కులుకు నడకల ఎర్రసినదాన్ని ||మామరో || కొత్తకుండల నీరుతీపి కోరిన మగవాడు తీపి వాడిన దంటెంతతీపబ్బి కొండాలరెడ్డి వాలలాడె బాలపాయము ||మామరో || బాయిగడ్డన బంగిసెట్టు ఎండితే ఒకదమ్ము పట్టు కోరేదాన్ని కొంగుపట్టబ్బి […]పూర్తి వివరాలు ...

error: