జమ్మలమడుగు: పట్టణంలోని పలగాడి వీధిలో కొలువై ఉన్న సయ్యద్ షా బడే గౌస్ పీరాఖాద్రి (పెద్ద ఆస్థానముల ) వారి 81వ ఉరుసు మహోత్సవాలు సెప్టెంబర్ 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రస్తుత పీఠాధిపతి సయ్యద్ షా గౌస్ పీరాఖాద్రి తెలిపారు. ఇందులో భాగంగా 18 వ తేదీ బుధవారం నిషాన్, 19 వతేదీ గురువారం గంధం, 20 వ తేదీ శుక్రవారం ఉరుసు, 21 వ […]పూర్తి వివరాలు ...
గుడికూలును నుయి పూడును వడి నీళ్లం జెఱువు తెగును వనమును ఖిలమౌ చెడనిది పద్యం బొక్కటి కుడియెడమల చూడకన్న గువ్వలచెన్నా! సప్తసంతానాలు కొన్నింటిని పేర్కొని అవన్నీ ఒకనాటికి నశించిపోయేవే కాని చెడనిది పద్యం ఒక్కటే అని చెబుతున్నది గువ్వల చెన్న శతకం. ఇలాంటి ఆణిముత్యాలు మరికొన్ని ఉన్నాయీ శతకంలో. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు ఈ శతకాన్ని అధిక్షేపశతకం క్రింద ప్రచురించారు. శతక రచనా కాలానికి చెందిన సామాజికాంశాలు ఈ శతకంలో చోటు చేసుకొన్నాయి. ‘ఆంధ్రుల సాంఘిక […]పూర్తి వివరాలు ...
పులివెందుల జేఎన్‌టీయు కళాశాలకు యూనివర్సిటీ అకడమిక్ అటానమి స్టేటస్ ప్రకటించిందని అనంతపురం జేఎన్‌టీయూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాల రూపకల్పనపై పులివెందుల జేఎన్‌టీయూ కళాశాలలో బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం నిర్వహించారు. పాఠ్యాంశాల తయారీ కోసం వివిధ ప్రాంతాల ఐఐటీ, ఎన్ఐటీ కళాశాల నుంచి ప్రొఫెసర్లు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కళాశాల ప్రారంభమైన ఏడేళ్లలో గణనీయమైన ప్రగతి సాధించడం గర్వంగా ఉందని చెప్పారు. అటానమి స్టేటస్‌తో […]పూర్తి వివరాలు ...
‘నా వైఖరి మారలేదు’ అన్న ఆర్. విద్యాసాగర్ రావు గారి లేఖ (ఆంధ్య్రజ్యోతి ఆగస్టు 24) చదివాను. రాయలసీమ సాగునీటి సమస్యల గురించి నిష్ఠుర నిజాలు వెల్లడించినందుకు ఆయనను అభినందించాలో లేక తన తెలంగాణ మిత్రులకు సంజాయిషీ చెప్పుకుంటూ రాయలసీమ పట్ల తన సానుభూతిని ఉదాసీనతలోకి మార్చుకుంటున్నందుకు విచారపడాలో అర్థం కాని పరిస్థితి! ఆంధ్ర, తెలంగాణలు రాయలసీమ కోసం కృష్ణా జలాల్లో కొంత వాటాను వదలుకోవాలని చెబితే తెలంగాణ మేధావులలో వ్యతిరేకత ఎందుకు రావాలి! సాగునీటి వ్యవహారాలపై […]పూర్తి వివరాలు ...
రాజంపేట మండలం నారంరాజుపల్లెలోని జవహార్ నవోదయ విద్యాలయంలో 2014-2015 విద్యాసంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి బాలబాలికలు అక్టోబర్ 31వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ కె.వి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2013-2014 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వతరగతి చదువుతూ 02.05.2001 నుంచి 30.04.2005 మధ్య జన్మించిన బాలబాలికలు నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వివరించారు. దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు 08.02.2014 వతేదీ శనివారం నవోదయ […]పూర్తి వివరాలు ...
సమైక్య రాష్ట్రంలో రాయలసీమ వాసులవి బానిస బతుకులు తప్ప అభివృద్ధి దిశగా అడుగులు వేయడం అసాధ్యమని ప్రొద్దుటూరు మాజీ శాసన సభ్యులు, రాయలసీమ ఉద్యమ నేత ఎం.వి.రమణారెడ్డి పేర్కొ న్నారు. రాయలసీమ ప్రజా ఫ్రంట్ కన్వీనర్ యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో రాయలసీమ వెనుక బాటు తనంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయ న మాట్లాడుతూ హైదరాబాద్ లేకపోతే తాము బతకలేమనే విధంగా ఇవాళ ఉద్యమం కొనసాగడం సరైంది కాదన్నారు. తెలంగాణ ప్రాంతం వారు విడిపోతామని […]పూర్తి వివరాలు ...
తెలంగాణకు చెందిన ఆర్ విద్యా సాగర్ రావు కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ గా పని చేసి పదవీ విరమణ పొందారు. వారు మంచి మేధావి, వక్త కూడా. వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడంలోనూ సిద్ధహస్తులు. వారు ఈ మధ్య సినిమాలలో నటిస్తున్నారు కూడా. తెరాసకు సలహాదారుగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. రావు గారు ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రికలో ఈ రోజు ‘నీటి యుద్ధాలు నిజమేనా?’ అని ఒక వ్యాసం రాశారు. వారు రాసిన వ్యాసంలో సీమపై తనకున్న అక్కసును […]పూర్తి వివరాలు ...
– విద్వాన్ కట్టా నరసింహులు బమ్మెరపోతన ఆంధ్రమహాభాగవత రచనకు కొన్నాళ్లముందు చంద్రగ్రహణం నాడు గంగలో స్నానం చేసి ధ్యానం చేస్తున్నాడు. అది మహేశ్వర ధ్యానం. ధ్యానంలో దర్శనమిచ్చినవాడు శ్రీరామభద్రుడు. భాగవతం రచించమన్నాడు. ఆయనకు కలలో కనిపించిన రాముడిలా ఉన్నాడు: మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి ఉవిద చెంగట నుండ నొప్పువాడు చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిఱునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బఱగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి […]పూర్తి వివరాలు ...
రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమకు చుక్క తాగు, సాగునీరు అందక ఈ ప్రాంతం శాశ్వత కరువు బారిన పడుతుందని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛైర్మన్, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శనివారం కడప ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన గర్జన కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ఏజేసీ ప్రసంగించారు. రాయలసీమ సాగునీటి అవసరాలను తీర్చడంలో శ్రీశైలం ప్రాజెక్టు ఆయువుపట్టు లాంటిదన్నారు. విభజన జరిగితే కృష్ణా […]పూర్తి వివరాలు ...