వార్తా విభాగం

వార్తలు

ఈ రోజు ఆర్ట్స్ కళాశాల మైదానంలో సమైక్య గర్జన

సమైక్య ఉద్యమ తీవ్రత తెలియచేప్పెందుకు రెండు లక్షల మందితో చేపట్టనున్న సమైక్య గర్జనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జన ప్రవాహం కదిలిరానున్నందున ఆందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కడప కళాశాల మైదానంలో ఈ రోజు (శనివారం) ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు సమైక్యాంధ్ర పరిరక్షణ వేదికప్రతినిధులు సమాయత్తమయ్యారు.  ‘సమైక్య గర్జన’ నిర్వహణ స్థలం విషయంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 31వ తేదీన జిల్లా కేంద్రంలోని కోటిరెడ్డి కూడలిలో నిర్వహించాలని రాజకీయేతర ఐకాస ఇదివరకే ప్రకటన చేసింది. ప్రకటన […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

29న తాటిమాకులపల్లెలో బండలాగుడు పోటీలు

వేంపల్లె: మండల పరిధిలోని తాటిమాకులపల్లెలో ఈ నెల 29న జిల్లాస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు యోగానంద గురివిరెడ్డి స్వామి ఆశ్రమ నిర్వహణ కమిటీ తెలిపింది. గురివిరెడ్డిస్వామి మొదటి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని వీటిని నిర్వహిస్తున్నారు. మొదటి బహుమతి కింద రూ.30116, ద్వితీయ బహుమతి కింద రూ.20116, తృతీయ బహుమతిగా రూ.10116, నాల్గో బహుమతిగా రూ.5116 నగదు అందించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు పి.వి.మొహన్‌రెడ్డి తెలిపారు.పూర్తి వివరాలు ...

వార్తలు

884.80 అడుగులు చేరిన శ్రీశైలం నీటిమట్టం

శ్రీశైలం డ్యాం నీటిమట్టం శుక్రవారం 884.80 అడుగులు చేరింది. దీంతో జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం 214.8450 టీఏంసీలుగా నమోదయింది. ఎగువ పరివాహకం నుంచి జలాశయానికి వరదనీటి ప్రవాహం స్వల్పంగా పెరిగింది. రాత్రి 8 గంటల సమయానికి జూరాల నుం చి 54,658 క్యూసెక్కులు, రోజా నుం చి 43,300 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి చేరుతోంది. ఈ క్రమంలో ఆ సమయానికి కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఒక్కో యూనిట్‌ను 92.4 మెగావాట్ల సామర్థ్యంతో ఏడు యూనిట్లను […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

సీమవాసుల కడుపుకొట్టారు

రాయలసీమ హక్కుల కోసం ముక్తకంఠంతో ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. సీమకు న్యాయం జరిగిన తరువాతనే విడిపోవడమైనా, కలిసి ఉండటమైనా అని ఎలుగెత్తిచాటాలి. రాష్ట్ర విభజనకు రంగం సిద్ధమవుతున్న ప్రస్తుత సందర్భంలో అప్రమత్తత తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వానికి సీమ స్థానీయత సెగ తగలాలి. ఆ వైపుగా సీమ ప్రజలంతా కదం తొక్కాలి. రాష్ట్రంలో అన్ని రంగాలలో చిన్నచూపునకు గురైన ప్రాంతం రాయలసీమ. 1953-1956 ఆది గా అన్యాయాలను అడుగడుగు నా అనుభవిస్తున్నప్పటికీ అంద రం కలిసే అభివృద్ధి […]పూర్తి వివరాలు ...

చరిత్ర వ్యాసాలు

చెన్నయ్ భవిష్యం చెప్పిన ఆ రెండు పద్యాలు

గుడికూలును నుయి పూడును వడి నీళ్లం జెఱువు తెగును వనమును ఖిలమౌ చెడనిది పద్యం బొక్కటి కుడియెడమల చూడకన్న గువ్వలచెన్నా! వంటి పద్యాలతో గువ్వల చెన్న శతకం శతకసాహిత్యంలో వన్నె కెక్కింది. ఆ నాటి సామాజికాంశాలను ప్రస్ఫుటంగా ప్రకటించి అధిక్షేపశతకాల్లో ఒకటిగా నిలిచింది. ఢిల్లీ, కలకత్తా, బొంబాయి వంటి నగరాల చరిత్రలు వందల వేల సంవత్సరాలవి కాగా మద్రాసు లేదా చెన్నపట్టణం అని పిలువబడుతూ ఉండిన నేటి ‘చెన్నయ్‌’ నగర చరిత్ర క్రీస్తు శకం పదిహేడో శతాబ్దం […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

విభజన తర్వాత సీమ పరిస్థితి …

“స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం సీమ భవిష్యత్తును అంధకారంలోకి నేట్టేయడానికి కాంగిరేసు బరితెగించిన సందర్భమిది. తెలంగాణకు చెందిన  కేంద్ర జలమండలి మాజీ సభ్యడు, నీటి పారుదల రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగర్ రావు ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విభజన జరిగితే సీమ ఎదుర్కోనబోయే సంక్షోభాన్ని చూచాయగా వివరించారు. ఆయన చెప్పిన విషయాలు సీమ ఎడారిగా మారనుందనే విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇప్పటికైనా కుహనా రాజకీయాలకు పాల్పడుతున్న సీమ కాంగ్రెస్ నాయకులు స్వప్రయోజనాల ‘రాయల తెలంగాణ’ పాటలను, హైదరాబాదు […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘రాయల తెలంగాణ’నూ పరిశీలిస్తున్నాం

పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సిఫారసు చేసినప్పటికీ.. రాయల తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదన కూడా ఆంటోనీ కమిటీ పరిశీలనలో ఉందని ఆ కమిటీ సభ్యుడు, కాంగిరేసు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ డిగ్గీ రాజా వెల్లడించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదనటం సరికాదన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాలను కాపాడే విధంగా కాకుండా.. కాంగ్రెస్ […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

వాళ్ల గులాములుగా బ్రతాకాల్సి వస్తుంది

హైదరాబాదు: రాయలసీమను ఎట్టి పరిస్థితిలోనూ విడదీసేందుకు అంగీకరించేది లేదని రాయలసీమ ఐకాస పేర్కొంది. సీమ చరిత్ర తెలియకుండా, ప్రజల మనోభావాలను గుర్తించకుండా, నిర్దిష్ట ఆలోచన లేకుండా చేసిన ప్రకటన ద్వారానే నేడీ పరిస్థితి నెలకొందని సమితి నేతలు అన్నారు. బుధవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఐకాస నేతలు మాట్లాడుతూ రాయల తెలంగాణ అనేది రాయల్‌సీమ ప్రజల ఉనికిని దెబ్బతీయటానికేనని తెలిపారు. ప్రత్యేక తెలంగాణకు రాయలసీమ ఐకాస వ్యతిరేకం కాదని, పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. […]పూర్తి వివరాలు ...

చరిత్ర వ్యాసాలు

అల్లసాని పెద్దన చౌడూరు నివాసి

ఆంధ్ర సాహిత్య ప్రబంధాలలో మనుచరిత్ర కున్నంత స్థానం మరే ప్రబంధానికీ లేదు. అల్లసాని పెద్దనామాత్యుడీ ప్రబంధాన్ని రచించాడు. ఈయన నందవరీక బ్రాహ్మణుడు. చొక్కనామాత్యుని పుత్రుడు. అహోబలం మఠం పాలకుడు శఠగోపయతి వల్ల చతుర్విధ కవిత్వాలు సంపాదించుకొన్నాడు. అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల కొలువులో ప్రవేశించక మునుపే హరికథాసారం రచించాడు. ఈ గ్రంథం లభ్యం కాలేదు. ఇందలి కొన్ని పద్యాలను కస్తూరి రంగకవి తన ఆనందరంగరాట్ఛందంలో ఉదాహరించాడు. శ్రీకృష్ణరాయలు క్రీ.శ. 1509లో విజయనగర సింహాసనం అధిష్ఠించాడు. అప్పటికే ఆ రాజ్యం […]పూర్తి వివరాలు ...

error: