ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం జిల్లాలోని లక్కిరెడ్డిపల్లెకు రానున్నారు. మాజీ మంత్రి ఆర్,రాజగోపాల్‌రెడ్డి పెద్దకర్మ ఆదివారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. కలెక్టర్ కోన శశిధర్,జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హా హెలిప్యాడ్ స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. చిత్తూరు జిల్లాలో స్వగ్రామమైన కలికిరికి శనివారం ముఖ్యమంత్రి చేరుకుంటారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హెలీకాప్టర్‌లో లక్కిరెడ్డిపల్లెకు చేరుకుని ఆర్‌ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారని మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గంటపాటు లక్కిరెడ్డిపల్లెలోనే గడిపి 12 గంటలకు హైదరాబాదుకు వెళతారన్నారు.పూర్తి వివరాలు ...
కడప.ఇన్ఫో మరియు తెలుగు సమాజం మైదుకూరులు సంయుక్తంగా ప్రచురించిన ‘గండికోట’ పుస్తకానికి గాను పర్యాటక శాఖ అందించే ‘ఉత్తమ పర్యాటక రచన’ పురస్కారం లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27 రాత్రి హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంత కుమార్, చేనేత, జౌళి శాఖా మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా పుస్తక రచయిత, కడప.ఇన్ఫో గౌరవ సంపాదకులు తవ్వా ఓబుల్ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు.పూర్తి వివరాలు ...
క్విడ్ ప్రో కో కేసులో అరెస్టయి, 16 నెలలుగా జైలులో ఉన్న కడప పార్లెంటు సభ్యుడు, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం… సోమవారం జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ‘కేసులోని అన్ని అంశాలపై దర్యాప్తు ముగిసింది’ అని సీబీఐ దాఖలు చేసిన మెమో మేరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. బెయిల్ పిటిషన్‌పై వాదోపవాదాలు, పలు కంపెనీల ద్వారా జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు […]పూర్తి వివరాలు ...
ఆంధ్రప్రదేశ్‌లో జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపద గేయాలు వేనవేలు. ఔత్సాహిక కళాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో జన్మించారు మునెయ్య. సరిగ్గా ఇది (2013) ఆయన 70వ జయంతి సంవత్సరం. అబ్బ శ్రీ కలిమిశెట్టి చౌడప్ప శిష్యరికంలో యక్షగానం, కోలాటం, పండరి భజన, […]పూర్తి వివరాలు ...
భారతదేశపు దూర దక్షిణ ప్రాంతానికి కర్నాటకమని పేరు. ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధాలు కర్నాటక యుద్ధాలుగా పేరు పొందాయి. భారతదేశంలో ఆంగ్ల, ఫ్రెంచి రాజకీయ భవితవ్యమును ఈ కర్నాటక యుద్ధాలే నిర్ణయించినాయి. ఈ యుద్ధాలే ఆంగ్ల సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినట్లు చరిత్ర చెబుతోంది. క్రీ.శ.1748-56 సంవత్సరాల మధ్య జరిగిన రెండవ కర్నాటక యుద్ధంలో కడప నవాబు మౌసింఖాన్ (మూచామియా), కర్నూలు నవాబు హిమ్మత్ బహదూర్ ఖాన్ లు పాల్గొని అనేక రాజకీయ హత్యలకు కారణమైనారు. దక్కన్ […]పూర్తి వివరాలు ...
హెడ్డింగ్ చూసి ఆశ్చర్య పోతున్నారా? ఇది నిజం. మీరు అవునన్నా కాదన్నా రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం జైలులో ఉన్న జగన్ కు ప్రచారం చేసి పెట్టి తద్వారా వైకాపాకు మరిన్ని ఓట్లు పడేలా కృషి చేయాలని కాకలు తీరిన చంద్రబాబు గారి నేతృత్వంలోని తెదేపా కీలక నిర్ణయం తీసుకుంది. మాకు తెలుసు తెదేపా అభిమానులు, కార్యకర్తలు ఈ విషయం విని విస్మయానికి గురవుతారని. కానీ నిజం నిష్టూరంగానే ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం సంక్షోభంలో ఉంది. […]పూర్తి వివరాలు ...
అది క్రీ.శ 1895 ప్రాంతం – శ్రీ వనారస సోదరులు రాయచోటి తాలూకా సురభి గ్రామంలో నివాసం ఏర్పరుచుకొని ప్రప్రధమంగా ‘కీచకవధ’ నాటకం ప్రదర్శించారు. ఆ సమయంలో చంద్రగిరి నుండి వలస వచ్చిన శ్రీ సుబ్బదాసు గారు ఈ వనారస సోదరుల తోడ్పాటుతో సురభి గ్రామంలో ‘శ్రీ శారదా మనోవినోదినీ సంగీత నాటక సభ’ స్థాపించారు. అప్పటి నుండి క్రమశిక్షణతో ‘హరిశ్చంద్ర’, ‘శకుంతల’ నాటకాలు తయారుచేసి ఇటు రాయలసీమ. అటు సర్కారు జిల్లాలలో విశేషంగా ప్రదర్శనలిస్తూ నాటక […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాకు చెందిన మాజీమంత్రి రాజగోపాల్ రెడ్డి గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందారు. తిరుపతిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.తొలుత కాంగ్రెస్ హయాంలో 1967లో తొలిసారి శాసనసభకు ఎన్నికైన ఆయన ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. రాజగోపాల్ రెడ్డి కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి మొత్తం అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు రమేష్ రెడ్డి కూడా ఒకసారి శాసనసభకు ఎన్నికయ్యారు.రాజగోపాల్ రెడ్డి అప్పట్లో ఎన్.టి.ఆర్.క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసినా తదుపరి ఆయనతో విబేదించి కాంగ్రెస్ లో […]పూర్తి వివరాలు ...
‘నీటి యుద్ధాలు’ నిజమేనా? (సెప్టెంబర్ 9, ఆంధ్రజ్యోతి) ఆర్. విద్యాసాగర్ రావు ప్రశ్నించారు. ఆయన తన వ్యాసాన్ని ఒక సాగునీటి నిపుణునిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా రాశారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఆ వ్యాసంలోని రెండవ పేరాలో ఆయన వాడిన పదజాలమే. ఇది విద్యాసాగర్‌రావు పక్షపాత ధోరణికి ప్రత్యక్ష నిదర్శనం – సీమాంధ్ర ప్రాంతం మదరాసు రాష్ట్రంలో అని, అదే విధంగా తెలంగాణ ప్రాంతం హైదరాబాదు రాష్ట్రంలో అనకుండా గూఢార్థం వచ్చే విధంగా ‘తెలంగాణ’ హైదరాబాద్ […]పూర్తి వివరాలు ...