వార్తా విభాగం

అభిప్రాయం

ఆత్మద్రోహం కాదా?

గతంలో చేసుకున్న ఒప్పందాలు, అమలుచేయాలనుకున్న పథకాలు సాకారం కాలేదు కాబట్టి నేడు రాయలసీమకు కృష్ణాజలాల్లో హక్కే లేదంటూ రిటైర్డు చీఫ్ ఇంజనీర్ విద్యాసాగర్‌రావు ‘సాక్షి’లో రాశారు. నేడు రాయలసీమలో అమలు జరుగుతున్న తెలుగు గంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, గండికోట ప్రాజెక్టు కేటాయింపులు, అనంతపురం జిల్లాకు నీటి మళ్లింపు- వీటన్నింటి మీద సీమవాసులకు ఉన్న హక్కు కాదనలేనిది. 1956లో ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ముందు, పైపథకాలన్నీ అమలు కాలేదు కాబట్టి, నేడు ఆ పథకాలకు నీటి […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘కొత్త దుప్పటి’కి పురస్కారం

విశాలాంధ్ర ప్రచురించిన ‘కొత్త దుప్పటి’ కథల సంకలనం (సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి కథలు)  పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారానికి (2011) ఎంపికైంది. హైదరాబాదులోని ఎన్టీఆర్‌ కళామందిరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరావు చేతుల మీదుగా రచయిత సన్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కారాల ప్రదానోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు పొట్టిశ్రీరాములు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు వార్తలు

సాయిప్రతాప్ రాజీనామా!

తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ రాజంపేట ఎంపీ సాయిప్రతాప్‌ కాంగ్రెస్‌ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్‌ను నమ్ముకుని ఎనలేని సేవలందించినా, సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కేబినెట్‌లో టీ.నోట్‌ను పెట్టడంపై సాయిప్రతాప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీమాంధ్ర ప్రజలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ను వీడడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీసీసీ అధ్యక్షుడికి కూడా పంపానన్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు […]పూర్తి వివరాలు ...

పర్యాటకం

తలకోనకు మూడురెట్లున్న గుంజన జలపాతం

నూరు ఏనుగు తొండాలతో కుమ్మరించినట్టు జలధార పైనుంచి భూమిలోకి దిగగోట్టినట్లు పడుతుంటుంది. అక్కడున్న ఒళ్ళు గగుర్పొడిచే గుండం, అర్ధముఖాకృతి నుంచి చిప్పిల్లే నీటి తుంపరలు పారవశ్యం కలిగిస్తున్నట్లుంది. ఓ పావురాల గుంపు పదేపదే అక్కడ చక్కర్లు కొడుతోంది. పాకుడు పట్టిన రాళ్ళ మధ్య పొడుచుకు వచ్చిన ఫెర్న్ మొక్కలు పాము పడగలల్లే... పూర్తి వివరాలు ...

వార్తలు

అది మూర్ఖత్వం

రాష్ట్ర విభజన వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో అనేక వివాదాలు ఏర్పడతాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఏకైక పరిష్కారమని శనివారం స్థానిక జెడ్పీ మీటింగ్ హాల్‌లో ఏపీయూడబ్ల్యూజే నాయకుడు రామసుబ్బారెడ్డి అధ్యక్షతన ‘‘రాష్ట్ర విభజన- జల వివాదాలు’’ అనే అంశంపై ఏపీయూడబ్ల్యూజే ఏర్పాటు చేసిన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. రాయల తెలంగాణతో …. “రాయలసీమలోని తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, తెలంగాణలో ని నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమ ప్రాజెక్టులకు నికర జలాలు లభించవు. ఇప్పటికే […]పూర్తి వివరాలు ...

వార్తలు

రాజగోపాల్‌రెడ్డి పెద్దకర్మకు ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం జిల్లాలోని లక్కిరెడ్డిపల్లెకు రానున్నారు. మాజీ మంత్రి ఆర్,రాజగోపాల్‌రెడ్డి పెద్దకర్మ ఆదివారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. కలెక్టర్ కోన శశిధర్,జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హా హెలిప్యాడ్ స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. చిత్తూరు జిల్లాలో స్వగ్రామమైన కలికిరికి శనివారం ముఖ్యమంత్రి చేరుకుంటారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హెలీకాప్టర్‌లో లక్కిరెడ్డిపల్లెకు చేరుకుని ఆర్‌ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారని మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గంటపాటు లక్కిరెడ్డిపల్లెలోనే గడిపి 12 గంటలకు హైదరాబాదుకు వెళతారన్నారు.పూర్తి వివరాలు ...

వార్తలు

‘గండికోట’కు పురస్కారం

కడప.ఇన్ఫో మరియు తెలుగు సమాజం మైదుకూరులు సంయుక్తంగా ప్రచురించిన ‘గండికోట’ పుస్తకానికి గాను పర్యాటక శాఖ అందించే ‘ఉత్తమ పర్యాటక రచన’ పురస్కారం లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27 రాత్రి హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంత కుమార్, చేనేత, జౌళి శాఖా మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా పుస్తక రచయిత, కడప.ఇన్ఫో గౌరవ సంపాదకులు తవ్వా ఓబుల్ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు.పూర్తి వివరాలు ...

రాజకీయాలు

జగన్‌కు షరతులతో కూడిన బెయిల్

క్విడ్ ప్రో కో  కేసులో అరెస్టయి, 16 నెలలుగా జైలులో ఉన్న కడప పార్లెంటు సభ్యుడు, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం… సోమవారం జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ‘కేసులోని అన్ని అంశాలపై దర్యాప్తు ముగిసింది’ అని సీబీఐ దాఖలు చేసిన మెమో మేరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. బెయిల్ పిటిషన్‌పై వాదోపవాదాలు, పలు కంపెనీల ద్వారా జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు ప్రసిద్ధులు

కలిమిశెట్టి మునెయ్య – జానపద కళాకారుడు

ఆంధ్రప్రదేశ్‌లో జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపద గేయాలు వేనవేలు. ఔత్సాహిక కళాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో జన్మించారు మునెయ్య. సరిగ్గా ఇది (2013) ఆయన 70వ జయంతి సంవత్సరం. అబ్బ శ్రీ కలిమిశెట్టి చౌడప్ప శిష్యరికంలో యక్షగానం, కోలాటం, పండరి భజన, […]పూర్తి వివరాలు ...

error: