కడప: పెద్దదర్గాలో శుక్రవారం హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా మహమ్మద్ మహమ్మదుల్ అమీన్‌పీర్ సాహెబ్ చిష్ఠివుల్ ఖాద్రీ ఉరుసు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. పెద్ద ఉరుసు ఉత్సవాన్ని తలపిస్తూ భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. ఇందులో భాగంగా దర్గాలోని హజరత్ అమీన్‌పీర్ సాహెబ్ మజార్‌ను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో కన్నుల పండువగా అలంకరించారు. భక్తులు […]పూర్తి వివరాలు ...
ముత్యాల ముగ్గులు రతనాల బొమ్మలు చెమ్మ చెక్క చెమ్మ చెక్క నవరత్న సంక్రాంతి చేరడేసి మొగ్గ శతమానం భవతి ! www.www.kadapa.info వీక్షక దేవుళ్ళకు మా హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు …పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలోని నందలూరు మండలం పాటూరు గ్రామ పొలంలో గురువారం పిల్లి జాతికి చెందిన అరుదయిన పునుగుపిల్లి దొరికింది. గ్రామానికి చెందిన రైతు కోటకొండ సుబ్రహ్మణ్యం తాను సాగుచేసిన కర్భూజ పంటను పందులు, పందికొక్కులు నాశనం చేయకుండా బోను ఏర్పాటు చేశారు. ఆ బోనులో పునుగుపిల్లి చిక్కుకొంది. పాటూరు మాజీ సర్పంచి గాలా సుధాకరరెడ్డి ఈ విషయాన్ని తిరుపతిలోని జంతు ప్రదర్శనశాల అధికారి పార్థసారధి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం సాయంత్రం ఎస్వీ జంతుప్రదర్శనశాలకు చెందిన సెల్వరాజ్, […]పూర్తి వివరాలు ...
కడప విమానాశ్రయంలో జింకల మందలు సంచరిస్తున్నాయని.. వాటిని తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కడప డీఎఫ్‌వో నాగరాజు తెలిపారు. విమానాశ్రయం వద్ద మైదానం పెద్దగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయన్నారు. కృష్ణజింకలు 10 నుంచి 15 వరకు మందలుగా వస్తాయని.. అలాంటి ఈ ప్రాంతంలో అయిదు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఇటీవల ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో కలెక్టరు సమావేశం నిర్వహించారు. జింకలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తగిన ప్రణాళిక రూపొందించాలని తమకు ఆదేశించారన్నారు. ఆదేశం మేరకు ప్రణాళిక […]పూర్తి వివరాలు ...
దాదాపు ఆరు దశాబ్దాలు (1953 నుంచి 2013) దాకా కోస్తాంధ్రవాసుల సాహచర్యంలో ఉన్నాం. అయితే సీమకు మిగిలింది ఏమిటి? ఒరిగింది ఏమిటి? దేశంలోనే అత్యంత దుర్భిక్షంలో ఉండే కరువు ప్రాంతంగా రాయలసీమ మిగిలిపోయింది. దేశంలోనే అత్యంత కరువుబారిన పడిన జిల్లాల్లో అనంతపురానిదే అగ్రస్థానమని 90వ దశకంలోనే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నివేదించిన సంగతి అక్షర సత్యం. మరో పాతికేళ్లలో అనంతపురం పూర్తిస్థాయి ఎడారిగా మారిపోతుందని జలవనరుల నిపుణులు ఏకరువు పెట్టిన మాట వాస్తవం కాదా? కడప, కర్నూలు […]పూర్తి వివరాలు ...
స్వతంత్ర భారత్‌ను 50 సంవత్సరాలు పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నేడు కప్పల తక్కెడగా మారిపోయింది. కేంద్రంలో, రాష్ట్రంలో తానే అధికారంలో ఉన్నా రాష్ట్ర విభజనను ఎలా చేయాలో దిక్కుతోచక చిత్ర-విచిత్ర ప్రకటనలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎక్కిరిస్తున్నది. 10 జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. కేంద్ర కేబినెట్ కూడా దాన్నే అంగీకరించింది; గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్‌ను నియమించింది. జీవోఎం పదే పదే సమావేశాలు జరిపి విభజన బిల్లు తయారీకి గొప్పగా కసరత్తు చేసినట్లు […]పూర్తి వివరాలు ...
నేను 1981 నుండి 1985 వరకూ శ్రీ కాళహస్తిలో పనిచేశాను.ఆ రోజుల్లో సంజీవరాయ శర్మ గారు స్వామి వారి సన్నిధిలో రోజూ సాయంత్రం వయోలిన్ వాయించేవారు.అంధులు.వయోలిన్ మీద కమాన్ కర్ర నాట్యంచేస్తుంటే,ద్వారం వారి వయోలిన్ సంగీతం గుర్తుకు వచ్చేది! నేను పనిచేసే బాంక్ సమీపంలోనే ఒక చిన్న పాడుపడ్డ ఇంటిలో వుండేవారు.”ప్రతి రోజూ బాంక్ కు వచ్చి కాసేపు నాతో ముచ్చటించండి,మీతో సరదాగా మాట్లాడుకోవచ్చు,ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు”అని వారిని వేడుకున్నాను.వారు అలానే,సాయంత్రం నాలుగు గంటల సమయంలో వచ్చేవారు.రాగానే,వారికి […]పూర్తి వివరాలు ...
రత్న సభాపతిని ఆంధ్రప్రదేశ్ సహకార భూమి తనఖా కేంద్ర బాంకుకు అధ్యక్షస్థానంలో చూచిన సన్నిహిత మిత్రుడొక ఉత్తరం వ్రాస్తూ యిలా వ్యాఖ్యానించాడట – “చైనాలో పూర్వం ఒక బంగారు పిట్ట ఉండేది. దాని కంఠస్వరం వర్ణనాతీతంగా ఉండేది. అందువలన చైనావారు ఆ పిట్టను ఒక పంజరంలో అట్టిపెట్టారు” ఈ అభిప్రాయం ఎలావున్నా, కొంచెం పూర్వాపరాలు తెలుసుకోనిదే ఎవర్ని గురించీ అంచనా వేయలేం. ఆ దృష్టితో ఒక్కసారి రత్నసభాపతి గత జీవితచరిత్రను ప్రస్తావించక తప్పదు. బాల్యం బండారు రత్నసభాపతి […]పూర్తి వివరాలు ...
కాంగ్రెసు సంస్కృతి పూర్తిగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న రోజులలో కేంద్రం తన ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రులను పేకముక్కలవలె మార్చేసింది. చెన్నారెడ్డిని తొలగించి అంజయ్యను, ఆయనను పక్కన పెట్టి భవనం వెంకట్రామ్ ను ముఖ్యమంత్రిగా చేశారు. అదంతా ఇందిరాగాంధీ అధిష్ఠాన వర్గం చదరంగంలో భాగమే. 1978లో భవనం వెంకట్రామ్ విద్యామంత్రి అయ్యాడు. చెన్నారెడ్డి ఆయనను తరువాత కౌన్సిల్ సభ్యుడుగా చేశారు. ఆ దశలో డా. తంగిరాల సుభాష్ నాకు భవనం వెంకట్రామ్ ను పరిచయం చేశాడు. భవనం వెంకట్రామ్ సోషలిస్టు […]పూర్తి వివరాలు ...