వార్తా విభాగం

సంకీర్తనలు

నే నేమి సేయుదును నీవు నాలోపలనుండి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నే నేమి సేయుదును నీవు నాలోపలనుండిశ్రీనాథుడవు నీచేఁత లింతేకాక॥చ1॥తనువేమిసేయును తనువులోపలనున్న-చెనఁటియింద్రియములచేఁతఁలుగాకమనసేమిసేయును మనసులోపలనున్న-నినుపుఁ గోర్కులు చేసే నేరములుగాక॥చ2॥జీవుఁడేమి సేయును జీవునిఁ బొదుగుకున్నభావపుప్రకృతి చేసేపాపముగాకచేవదేరఁ బుట్టు వేమిసేయు ముంచుకొన్నట్టి-దైవపుమాయలోనిధర్మ మింతేకాక॥చ3॥కాలమేమిసేయును గక్కన శ్రీవేంకటేశుఁ –డేలి మన్నించేమన్నన యిదియేకాకయేల యేల దూర నింక నెవ్వరు నేమిసేతురుమేలిమి నినుఁ దలఁచి మెచ్చుటేకాక రాగము: గుండక్రియ రేకు: 0093-01 సంపుటము: 1-459 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

రూకలై మాడలై రువ్వలై తిరిగీని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥రూకలై మాడలై రువ్వలై తిరిగీనిదాకొని వున్నచోటఁ దానుండ దదివో॥చ1॥వొకరి రాజుఁజేసు నొకరి బంటుగఁ జేసువొకరి కన్నెకల వేరొకరికి నమ్మించువొకచోటనున్న ధాన్య మొకచోట వేయించుప్రకటించి కనకమే భ్రమయించీ జగము॥చ2॥కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవుకొందరికి పుణ్యులఁజేసుఁ గొందరి పాపులఁజేసుకొందరికొందరిలోన కొట్లాట వెట్టించుపందెమాడినటువలెఁ బచరించు పసిఁడీ॥చ3॥నిగనిగమనుచుండు నిక్షేపమై యుండుతగిలి శ్రీవేంకటేశు తరుణియై తా నుండుతెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండునగుతా మాపాల నుండి నటియించు బసిఁడీ రాగము: గుండక్రియ రేకు: 0092-06 సంపుటము: 1-458 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పట్టినదెల్లా బ్రహ్మము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పట్టినదెల్లా బ్రహ్మముదట్టపుజడునికి దైవంబేలా॥చ1॥ఘనయాచకునకు కనకమే బ్రహ్మముతనువే బ్రహ్మము తరువలికియెనయఁ గాముకున కింతులే బ్రహ్మముతనలో వెలిఁగేటి తత్వం బేలా॥చ2॥ఆకటివారికి నన్నమే బ్రహ్మములోకమే బ్రహ్మము లోలునికికైకొని కర్మికి కాలమే బ్రహ్మముశ్రీకాంతునిపై జింతది యేలా॥చ3॥భువి సంసారికి పుత్రులె బ్రహ్మమునవ మిందరి కిది నడచేదియివలను శ్రీవేంకటేశు దాసులకుభవ మతనికృపే బ్రహ్మము రాగము: లలిత రేకు: 0092-05 సంపుటము: 1-457 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అక్కరకొదగనియట్టియర్థము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అక్కరకొదగనియట్టియర్థములెక్క లెన్నియైనా నేమి లేకున్న నేమిరే॥చ1॥దండితోఁ దనకుఁ గాని ధరణిశు రాజ్యంబుయెండెనేమి యది పండెనేమిరేబెండుపడఁ గేశవునిఁ బేరుకొననినాలికెవుండెనేమి వుండకుండెనేమిరే॥చ2॥యెదిరిఁ దన్నుఁ గానని యెడపుల గుడ్డికన్నుమొదలఁ దెఱచెనేమి మూసెనేమిరేవెదకి శ్రీపతిసేవ వేడుకఁ జేయనివాఁడుచదివెనేమి చదువు చాలించెనేమిరే॥చ3॥ఆవల నెవ్వరులేని‌ఆడవిలోనివెన్నెలకావిరిఁ గాసెనేమి కాయకున్న నేమిరేశ్రీవేంకటేశ్వరుఁ జేరనిధర్మములెల్లతోవల నుండెనేమి తొలఁగినేమిరే రాగము: ముఖారి రేకు: 0092-04 సంపుటము: 1-456 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నీ వేలికవు మాకు నీదాసులము నేము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నీ వేలికవు మాకు నీదాసులము నేముఆవల నితరుల నే మడుగఁబొయ్యేమాis-aber.net॥చ1॥పసురమై వుండి యిచ్చీఁ బక్కన గామధేనువుయెసఁగి మానై వుండి యిచ్చీఁ గల్పవృక్షమువెస రాయైవుండి యిచ్చీ వేడుకఁ జింతామణిమసలనిశ్రీపతివి మాకు నిచ్చే దరుదా॥చ2॥గాలి యావటించి యిచ్చీఁ గారుమేఘము మింటవీలి జీర్ణమై యిచ్చీ విక్రమార్కునిబొంతకాలినపెంచై వుండి కప్పెర దివ్యాన్నమిచ్చీమైలలేనిశ్రీపతివి మాకు నిచ్చు టరుదా॥చ3॥అండనే కామధేనువ వాశ్రితచింతామణివిపైండినకల్పకమపు భక్తులకెల్లానిండిన శ్రీవేంకటేశ నీవు మమ్ము నేలితివిదండిగా నమ్మితే నీవు దయఁజూచు టరుదా రాగము: లలిత రేకు: 0092-03 సంపుటము: 1-455 Tags: Annamacharya […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అంగనలాల మనచే నాడించుకొనెఁగాని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అంగనలాల మనచే నాడించుకొనెఁగానిసంగతెఱిఁగిన నెరజాణఁ డితఁడే॥చ1॥వొడలులేనివాని కొక్కఁడే తండ్రాయఁగానితడయక పురుషాత్తముఁ డితఁడేబడబాగ్ని జలధికిఁ బాయకల్లుఁడాయఁగానివెడలించె నమృతము విష్ణుఁ డితడే॥చ2॥పులిగూడుదిన్న వానిపొం దొక్కటే సేసేఁగానినలువంక లక్ష్మీనాథుఁ డితఁడేచలికిఁ గోవరివానిసరుస బావాయఁగానిపలుదేవతలకెల్ల ప్రాణబంధుఁ డితఁడే॥చ3॥యెక్కడో గొల్లసతుల కింటిమగఁడాయఁగానితక్కక వెదకే పరతత్వ మితఁడేమిక్కిలి శ్రీవేంకటాద్రిమీఁద మమ్ము నేలెఁగానితక్కక వేదము చెప్పే దైవమీతఁడే రాగము: శంకరాభరణం రేకు: 0092-02 సంపుటము: 1-454 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నవనారసింహ నమో నమో – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నవనారసింహ నమో నమోభవనాశితీర యహోబలనారసింహ॥చ1॥సతతప్రతాపరౌద్రజ్వాలానారసింహవితతవీరసింహవిదారాణాఅతిశయకరుణ యోగానంద నరసింహమతి శాంతపు కానుగుమాని నారసింహ॥చ2॥మరలి బీభత్సపుమట్టెమళ్ల నరసింహనరహరి భార్గోటి నారసింహపరిపూర్ణ శృంగార ప్రహ్లద నరసింహసిరుల నద్భుతపు లక్ష్మీ నారసింహ॥చ3॥వదనభయానకపు వరాహ నరసింహచెదరని వైభవాల శ్రీనరసింహఅదన శ్రీవేంకటేశ అందు నిందు నిరవైతిపదివేలురూపముల బహునారసింహ రాగము: నాట రేకు: 0092-01 సంపుటము: 1-453 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాటపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

రెండుమూలికలు రేయిఁబగలు నున్నవి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥రెండుమూలికలు రేయిఁబగలు నున్నవిఅండదేహమం దొకటి అతుమలో నొకటి॥చ1॥యిదివో రసబద్ధము యింద్రియములు మేనిలోపదిలముగా నిలిపి బంధించుటఅదివో వేధాముఖ, మంతరంగపుమనసుచెదరకుండాఁ జొనిపి శ్రీహరిఁదలఁచుట॥చ2॥తారవిద్య గంటిమి తగిలి నాసాగ్రమందుమేరతో ద్రిష్టినిలిపి మేలుఁబొందుటచేరువ సువర్ణవిద్య, చిత్తములోఁ బ్రణవముధీరత నాదము సేసిఁ దేవునిఁ బొగడుట॥చ3॥పుటజయమాయ నిట్టె పుణ్యపాపము లందులోకుటిలపుఁగోరికల కొన దుంచుటయిటులనే శ్రీవేంకటేశుఁ డిందిరయునుఅటు ప్రక్రృతిపురుషులనుటొరవచ్చుట రాగము: గౌళ రేకు: 0091-06 సంపుటము: 1-452 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

వెలుపలెల్ల తనలోనుగాక తను విడువదువెడమాయా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥వెలుపలెల్ల తనలోనుగాక తను విడువదువెడమాయానలువున యోగీంద్రులెల్ల మునునడచినమార్గంబు॥చ1॥జీవము నిర్జీవముగాక సిద్ధించదు పరమువావులెల్ల నొకవావిగాక మఱీ వదలదు ప్రపంచముభావంబెల్ల నభావముగాక పాయదు కర్మంబుదైవజ్ఞులు మును నడచి రిదియపో తప్పనిమార్గంబు॥చ2॥మాటలెల్లఁ గడమాటలుగాక మాయదు మలినంబుకూటంబులు కాలకూటంబుగాక కొనకెక్కదు భవముచాటుఁదృష్ణ లగచాటునఁబడక చాలదు సౌఖ్యంబుతేటగా మును పెద్ద లివియపో తేర్చినమార్గంబు॥చ3॥గుణములెల్ల నిర్గుణముగాక తలకూడదు శాంతంబుఅనువున కనువై అంతయుఁ దాగాక ఆనందము లేదుప్రణుతింపఁగ శ్రీవేంకటరమణుని బహుళమహిమెల్లాగణనకెక్కఁగా పురాతనులు మును కడకట్టినమతము రాగము: లలిత రేకు: 0091-05 సంపుటము: 1-451 Tags: Annamacharya Keerthanalu, […]పూర్తి వివరాలు ...

error: