నే నేమి సేయుదును నీవు నాలోపలనుండి – అన్నమయ్య సంకీర్తన

నే నేమి సేయుదును నీవు నాలోపలనుండి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
నే నేమి సేయుదును నీవు నాలోపలనుండి
శ్రీనాథుడవు నీచేఁత లింతేకాక
॥చ1॥
తనువేమిసేయును తనువులోపలనున్న-
చెనఁటియింద్రియములచేఁతఁలుగాక
మనసేమిసేయును మనసులోపలనున్న-
నినుపుఁ గోర్కులు చేసే నేరములుగాక
॥చ2॥
జీవుఁడేమి సేయును జీవునిఁ బొదుగుకున్న
భావపుప్రకృతి చేసేపాపముగాక
చేవదేరఁ బుట్టు వేమిసేయు ముంచుకొన్నట్టి-
దైవపుమాయలోనిధర్మ మింతేకాక
॥చ3॥
కాలమేమిసేయును గక్కన శ్రీవేంకటేశుఁ –
డేలి మన్నించేమన్నన యిదియేకాక
యేల యేల దూర నింక నెవ్వరు నేమిసేతురు
మేలిమి నినుఁ దలఁచి మెచ్చుటేకాక
రాగము: గుండక్రియ
రేకు: 0093-01
సంపుటము: 1-459

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియ

చదవండి :  అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: