వార్తా విభాగం

సంకీర్తనలు

మొదలుండఁ గొనలకు మోచి నీళ్ళువోయనేల – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥మొదలుండఁ గొనలకు మోచి నీళ్ళువోయనేలయెదలో నీవుండగా నితరములేలా॥చ1॥నిగమమార్గముననే నడచేనంటేనిగమములెల్లను నీమహిమేజగములోకులఁ జూచి జరగెదనంటేజగములు నీమాయజనకములు॥చ2॥మనసెల్ల నడ్డపెట్టి మట్టున నుండేనంటేమనసుకోరికలు నీమతకాలుతనువు నింద్రియములు తగ గెలిచేనంటేతనువు నింద్రియములు దైవమ నీమహిమ॥చ3॥యింతలోనిపనికిఁగా యిందు నందుఁ జొరనేలచెంత నిండుచెరువుండ చెలమలేలాపంతాన శ్రీవేంకటేశ పట్టి నీకే శరణంటిసంతకూటాలధర్మపుసంగతి నాకేలా రాగము: భైరవి రేకు: 0094-02 సంపుటము: 1-466 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భైరవిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

బోధకు లెవ్వరు లేక భోగినైతిని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥బోధకు లెవ్వరు లేక భోగినైతినిశ్రీధరుఁడే మాకు దిక్కు చింతింప నిఁకను॥చ1॥పట్టి దిగంబరినై పాలే యాహరముచేసితొట్టినపంచేంద్రియములతోవ విడిచిపుట్టితి సన్యాసినై బుద్దెఱిఁగీనెఱగకఅట్టె నడుమ సంసారినైతి నేనూ॥చ2॥గచ్చుల నన్నీ మఱచి గాలే ఆవటించుకొనిఅచ్చపుఁబరమయేకాంతసమాధినిచ్చలు నిద్రాభ్యాసనిర్మలయోగినైతికచ్చుపెట్టి మేలుకొని ఘనకర్మినైతి॥చ3॥భావము పారవిడిచి బ్రహ్మండమెల్ల నిండివేవేలు గోరికల వేడుకతోడజీవన్ముక్తుఁడనైతి శ్రీవేంకటేశ్వరుఁ జేరిధావతు లిన్నియు మాని తన్మయుఁడనైతి రాగము: కన్నడగౌళ రేకు: 0094-01 సంపుటము: 1-465 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇందిరానాథుఁ డిన్నిటి కీతఁ డింతే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇందిరానాథుఁ డిన్నిటి కీతఁ డింతేబందెలకర్మములాల పట్టుకురో మమ్మును॥చ1॥యెఱిగిసేసినవెల్లా నీతనిమహిమలేయెఱగక చేసినది యీతనిమాయేతెఱఁగొప్ప రెంటికిని తెడ్డువంటివాఁడ నింతేపఱచుఁగర్మములాల పట్టకురో మమ్మును॥చ2॥కాయములోపలివాఁడు ఘనుఁ డొక్కఁ డితఁడేకాయ మీతనిప్రకృతికల్పిత మింతేతోయరాక రెంటికిని తోడునీడైతి నింతేబాయటికర్మములాల పట్టకురో మమ్మును॥చ3॥యేలినవాఁడు శ్రీవేంకటేశుఁ డితఁ డొక్కఁడింతేయేలికసానై పెంచేది యీతనిసతేసోలి నే వీరిఁ గొలిచేతసూత్రపుబొమ్మ నింతేపాలుపుగర్మములాల పట్టకురో మమ్మును రాగము: బౌళి రేకు: 0093-06 సంపుటము: 1-464 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

సర్వజ్ఞత్వము వెదకగనొల్లను సందేహింపగనొల్లను – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥సర్వజ్ఞత్వము వెదకగనొల్లను సందేహింపగనొల్లనుసర్వజ్ఞుండును నాచార్యుండే సర్వశేషమే నాజీవనము॥చ1॥యెఱఁగఁగనొల్లము విజ్ఞానపుగతి యెఱుకలు నే మిటుసోదించియెఱిఁగి యితరులను బోధించెదమను యీపెద్దరికము నొల్లముయెఱిఁగేటివాడును యాచార్యుండే యెఱుకయుసర్వేశ్వరుఁడేయెఱుకయు మఱపును మానివుండుటే యిదియేపో మావిజ్ఞానము॥చ2॥చదువఁగనొల్లము సకలశాస్త్రములు సారెకుసారెకు సోదించిచదివి పరులతో యుక్తివాదములు జగడము గెలువగనొల్లముచదివేటివాఁడును నాచార్యుండే చదువును నాయంతర్యామేచదువుకుఁ జదువమికియు దొలఁగుటే నానాసాత్వికభావమే నాతెలివి॥చ3॥అన్నిటికిని నే నధికారిననెడియహంకారము నొల్లనుకన్నులజూచుచు నందరితో నేఁ గాదని తొలఁగానొల్లనుమన్నన శ్రీవేంకటేశ్వరుకరుణను మాయాచార్యుఁడే అధికారివున్నరీతినే అస్తినాస్తులకు నూరకుండుటే నాతలఁపు రాగము: దేవగాంధారి రేకు: 0093-05 సంపుటము: 1-463 Tags: Annamacharya […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

మహి నింతటివారువో మనవారు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥మహి నింతటివారువో మనవారుబహుమహిమలవారు ప్రపన్నులు॥చ1॥జయమంది జననపుజరామరణముల-భయములేనివారు ప్రపన్నులుక్రియలెల్ల నుడిగి మూఁగినకర్మపుటడవిబయలుచేసినవారు ప్రపన్నులు॥చ2॥ధీరులై మాయంధకారంబు నెదిరించిపారఁదోలినవారు ప్రపన్నులుసారమయ్యినసంసారసాగరముపారముగన్నవారు ప్రపన్నులు॥చ3॥అండ నిన్నిటాయఁ దనిసి యాసలెల్లాఁ దెగఁగోసిపండినమనసువారు ప్రపన్నులుదండిగా శ్రీవేంకటేశుదాసులై పరముతోవబండిబాట చేసినారు ప్రపన్నులు రాగము: రామక్రియ రేకు: 0093-04 సంపుటము: 1-462 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

వెడమంత్ర మిఁకనేల వేరువెల్లంకులు నేల – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥వెడమంత్ర మిఁకనేల వేరువెల్లంకులు నేలపుడమిధరుఁడు మాఁకు భువనౌషధము॥చ1॥హరి యచ్యుతాయంటే నణఁగుఁ బాపములునరసింహ యనియంటే నాఁటినదుఁఖములు మానుపురుషోత్తమాయంటేఁ బుండ్లు బూచులు మానుపరమౌషధ మీతఁడే పాటింప మాకు॥చ2॥వాసుదేవ యనియంటే వదలు బంధములెల్లావాసికి గృష్ణాయంటే వంతలరోగాలు మానుశ్రీసతీశ యనియంటే చింతలిన్నియును మానుగాసిదీర నితడేపో ఘనదివ్యౌషధము॥చ3॥గోవిందా యనియంటేఁ గూడును సంపదలుయీవల మాధవయంటే నిహముఁ బరముఁ జేరుదేవ నారాయణయంటే దేహము సుఖియై యుండుశ్రీవేంకటేశుఁడే మాకు సిద్ధౌషధము రాగము: ముఖారి రేకు: 0093-03 సంపుటము: 1-461 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పొడవైన శేషగిరి బోయనాయఁడు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పొడవైన శేషగిరి బోయనాయఁడువిడువ కిందరిఁ గాచు వెడబోయ నాయఁడు॥చ1॥పొలసి మీసాల పెద్దబోయ నాయఁడుమలిగి వీఁపునఁ గట్టేమంకుబోయ నాయఁడుపొలమురాజై తిరిగేబోయ నాయఁడువెలయ మోటుననుండేవేఁటబోయ నాయఁడు॥చ2॥పొట్టిపొట్టియడుగులబోయ నాయఁడు యెందుబుట్టుపగసాధించేబోయ నాయఁడుబొట్టులమెకమునేసేబోయ నాయఁడుపట్టపునెమలిచుంగబలుబోయ నాయఁడు॥చ3॥పొంచి శిగ్గెగ్గెఱగనిబోయ నాయఁడుమించి రాలమీఁదదాఁటేమెండుబోయ నాయఁడుఅంచెల శ్రీవేంకటేశుడనేబోయ నాయఁడుపంచఁ గాలవేలములబలుబోయ నాయఁడు రాగము: బౌళి రేకు: 0093-02 సంపుటము: 1-460 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నే నేమి సేయుదును నీవు నాలోపలనుండి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నే నేమి సేయుదును నీవు నాలోపలనుండిశ్రీనాథుడవు నీచేఁత లింతేకాక॥చ1॥తనువేమిసేయును తనువులోపలనున్న-చెనఁటియింద్రియములచేఁతఁలుగాకమనసేమిసేయును మనసులోపలనున్న-నినుపుఁ గోర్కులు చేసే నేరములుగాక॥చ2॥జీవుఁడేమి సేయును జీవునిఁ బొదుగుకున్నభావపుప్రకృతి చేసేపాపముగాకచేవదేరఁ బుట్టు వేమిసేయు ముంచుకొన్నట్టి-దైవపుమాయలోనిధర్మ మింతేకాక॥చ3॥కాలమేమిసేయును గక్కన శ్రీవేంకటేశుఁ –డేలి మన్నించేమన్నన యిదియేకాకయేల యేల దూర నింక నెవ్వరు నేమిసేతురుమేలిమి నినుఁ దలఁచి మెచ్చుటేకాక రాగము: గుండక్రియ రేకు: 0093-01 సంపుటము: 1-459 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

రూకలై మాడలై రువ్వలై తిరిగీని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥రూకలై మాడలై రువ్వలై తిరిగీనిదాకొని వున్నచోటఁ దానుండ దదివో॥చ1॥వొకరి రాజుఁజేసు నొకరి బంటుగఁ జేసువొకరి కన్నెకల వేరొకరికి నమ్మించువొకచోటనున్న ధాన్య మొకచోట వేయించుప్రకటించి కనకమే భ్రమయించీ జగము॥చ2॥కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవుకొందరికి పుణ్యులఁజేసుఁ గొందరి పాపులఁజేసుకొందరికొందరిలోన కొట్లాట వెట్టించుపందెమాడినటువలెఁ బచరించు పసిఁడీ॥చ3॥నిగనిగమనుచుండు నిక్షేపమై యుండుతగిలి శ్రీవేంకటేశు తరుణియై తా నుండుతెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండునగుతా మాపాల నుండి నటియించు బసిఁడీ రాగము: గుండక్రియ రేకు: 0092-06 సంపుటము: 1-458 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, […]పూర్తి వివరాలు ...

error: