వార్తా విభాగం

సంకీర్తనలు

ఉన్నవిచారములేల వోవో సంసారులాల – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఉన్నవిచారములేల వోవో సంసారులాలయిన్నిటి కితఁడే రక్ష యిదే మీకు మనరో॥చ1॥తక్కక బ్రహ్మలఁగన్న తండ్రిఁ గొలిచి మీరుయెక్కువ సంతతిగల్గి యీడేరరోఅక్కున లక్ష్మీనారాయణులఁ దలఁచి మీరుచొక్కి మీమీదంపతులు సుఖమున నుండరో॥చ2॥భవరోగవైద్యుని పాదములు సేవించిభువి రోగములఁ బాసి పొదలరోతవిలి పదిదిక్కులు తానైన వానిఁగవిసి పొగడి దిక్కు గలిగి బ్రదుకరో॥చ3॥తల్లిదండ్రీ నీతఁడే తగఁ జుట్ట మీతఁడేయెల్లగాఁ బుట్టించి పెంచేయేలి కీతఁడేచల్లగా శ్రీవేంకటేశు శరణంటి మిదె మేముకొల్లగా మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో రాగము: సాళంగం రేకు: 0090-01 సంపుటము: 1-441 Tags: Annamacharya […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పెరుగఁబెరుగఁ బెద్దలుగాఁగా పెనువెఱ్ఱి వట్టుబుద్ధెఱిఁగితే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పెరుగఁబెరుగఁ బెద్దలుగాఁగా పెనువెఱ్ఱి వట్టుబుద్ధెఱిఁగితేమరులు మఱచితేనే యిన్నిటి గెలిచే మర్మము సుండీ జ్ఞానులకు॥చ1॥జననమందినయప్పుడు దేహి సన్యాసికంటే నిరాభారితనరఁ గౌపీన కటిసూత్రముల తగులములేనిది గంబరితనుఁదా నెఱఁగడుయెదిరినెఱఁగఁడు తత్వధ్యానాలయనిర్మలచిత్తుఁడుపెనఁగేకోరిక యించుకంత లేదు పేరులేనివాడు వీడువోయమ్మా॥చ2॥నిద్దురవొయ్యేటి యప్పుడుదేహి నిత్యవిరక్తునివంటిఘనుఁడుబుద్ధి సంసారముపై నించుకా లేదు భోగమేమీ నొల్లఁడువొద్దనే యేపనులకుఁ జేయఁబోఁడు వున్నలంపటాల కేమియుఁ జొరఁడుకొద్దిలేనియాస యెందువోయనొకో కోపమేమి లేదు వీఁడివో యమ్మా॥చ3॥హరి శరణన్న యప్పుడు దేహి అమరులకంటే కడునధికుఁడుపరమునిహము నఱచేతిదే ప్రయాస మించుక లేదుదురితము లేదు దుఃఖములు లేవు తోడనే వైకుంఠ మెదురుగా […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇరవగువారికి యిహపర మిదియే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇరవగువారికి యిహపర మిదియేహరిసేవే సర్వాత్మలకు॥చ1॥దురితమోచనము దుఃఖపరిహరముహరినామమెపో ఆత్మలకుపరమపదంబును భవనిరుహరణముపరమాత్ముచింతే ప్రపన్నులకు॥చ2॥సారము ధనములు సంతోషకరములుశౌరికథలు సంసారులకుకోరినకోర్కియు కొంగుబంగరువుసారె విష్ణుదాస్యము లోకులకు॥చ3॥యిచ్చయగుసుఖము యిరవగుపట్టముఅచ్చుతుకృప మోక్షార్థులకుఅచ్చపు శ్రీవేంకటాధిపు శరణమురచ్చల మాపాలిరాజ్యపు సుగతి రాగము: లలిత రేకు: 0089-05 సంపుటము: 1-439 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలితపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆపద్బంధుఁడు హరి మాకుఁ గలఁడు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఆపద్బంధుఁడు హరి మాకుఁ గలఁడుదూపలి తలఁచినా దోషహరము॥చ1॥గరుడనినెక్కినఘనరేవంతుఁడుగరుడ కేతనముగలరథుఁడుగరుడఁడే తనకును గరియగుబాణముగరిమె నీతఁడేపో ఘనగారుడము॥చ2॥పాముపరపుపై బండినసిద్ధుడుపాముపాశముల పరిహరముపామున నమృతముఁ పడఁదచ్చినతఁడువేమరు నీతఁడే విషహరము॥చ3॥కమలాక్షుఁ డీతఁడు కమలనాభుఁడునుకమలాదేవికిఁ గైవశముఅమరిన శ్రీవేంకటాధిపు డితఁడేమమతల మాకిదే మంత్రౌషధము రాగము: సామంతం రేకు: 0089-04 సంపుటము: 1-438 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అంతరంగమెల్లా శ్రీహరి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితేవింతవింతవిధముల వీడునా బంధములు॥చ1॥మనుజుఁడై ఫలమేది మఱి జ్ఞానియౌదాఁకతనువెత్తి ఫలమేది దయగలుగుదాఁకధనికుఁడై ఫలమేది ధర్మము సేయుదాఁకాపనిమాలి ముదిసితే పాసెనా భవము॥చ2॥చదివియు ఫలమేది శాంతముగలుగుదాఁకాపెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాఁకనుమదిగల్గి ఫలమేది మాధవుఁ దలఁచుదాఁకాయెదుట తారాజై తే నేలెనా పరము॥చ3॥పావనుఁడై ఫలమేది భక్తిగలిగినదాఁకాజీవించేటిఫలమేది చింతదీరుదాఁకనువేవేల ఫలమేది శ్రీవేంకటేశుఁ గన్నదాఁకాభావించి తా దేవుఁడై తేఁ బ్రత్యక్షమవునా రాగము: శుద్ధవసంతం రేకు: 0089-03 సంపుటము: 1-437 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నిక్కించీ గర్ణములు మానిసిమెకము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నిక్కించీ గర్ణములు మానిసిమెకమునిక్కపుఁ గరుణతో మానిసిమెకము॥చ1॥కొండ తనకు గద్దెగా గోరి కూచుండిన దదేనిండురాజసమున మానిసిమెకముగండుమీరి దానవునికండలు చెక్కుచు నూర్పునిండించీ నాకసము మానిసిమెకము॥చ2॥కరములు వేయింటాఁ గైకొని యాయుధములునిరతి జళిపించీ మానిసిమెకముసురలను నసురల జూచిచూచి మెచ్చిమెచ్చినెరపీని నవ్వులు మానిసిమెకము॥చ3॥యెక్కించి తొడమీఁద నిందిరతో మేలమాడీనిక్కపుగాఁగిటను మానిసిమెకముఅక్కడ శ్రీవేంకటాద్రి నహోబలమునందునెక్కొని మమ్మేలెను మానిసిమెకము రాగము: నాట రేకు: 0089-02 సంపుటము: 1-436 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

దేహ యీతగవు దీర్చవయ్యా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥దేహ యీతగవు దీర్చవయ్యావేవేలకు నిది విన్నవమయ్యా॥చ1॥తనువున బొడమినతతి నింద్రియములుపొనిగి యెక్కడికిఁ బోవునయాపెనఁగి తల్లికడ బిడ్డలు భువిలోయెనగొని యెక్కడి కేఁగుదురయ్యా॥చ2॥పొదుగుచు మనమున బొడమినయాసలుఅదన నెక్కడికి నరుగునయావొదుగుచు జలములనుండు మత్స్యములుపదపడి యేగతి బాసీనయ్యా॥చ3॥లలి నొకటొకటికి లంకెలు నివేఅలరుచు నేమని యందునయాబలు శ్రీవేంకటపతి నాయాత్మనుఁగలిగితి వెక్కడి కలుషములయ్యా రాగము: మలహరి రేకు: 0089-01 సంపుటము: 1-435 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మలహరిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇందిరాధిపుని సేవ యేమరకుండుటగాక – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇందిరాధిపుని సేవ యేమరకుండుటగాకబొందితోడిజీవులకు బుద్దు లేఁటిబుద్దులు॥చ1॥రేయెల్లా మింగిమింగి రేపే వెళ్లనుమియుబాయట నిద్రాదేవి పలుమారునుచాయలకు నిచ్చనిచ్చా జచ్చిచచ్చి పొడమేటి-మాయజీవులకునెల్లా మని కేఁటిమనికి॥చ2॥కనురెప్ప మూసితేనే కడు సిష్టే చీఁకటౌనుకనురెప్ప దెరచితే క్రమ్మర బుట్టుఘనమై నిమిషమందే కలిమి లేమియుఁ దోఁచెయెనయుజీవుల కింక యెఱు కేఁటియెఱుక॥చ3॥వొప్పగుఁ బ్రాణము లవి వూరుపుగాలివెంటయెప్పుడు లోనివెలికి నెడతాఁకునుఅప్పఁడు శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డందరికితప్పక యాతఁడే కాచు తలఁపేఁటి తలఁపు రాగము: సామంతం రేకు: 0088-06 సంపుటము: 1-434 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

హరి నీయనుమతో అది నాకర్మమో – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥హరి నీయనుమతో అది నాకర్మమోపరమే యిహమై భ్రమయించీని॥చ1॥కలుగుదు శాంతము కటకట బుద్ధికిచలమున నింతాఁ జదివిననునిలువదు చిత్తము నీపై చింతకుపలుసంపదలను బరగినను॥చ2॥తగులదు వైరాగ్యధన మాత్మకునువొగి నుపవాసము లుండిననుఅగపడదు ముక్తి అసలనాసలజగమింతా సంచరించినను॥చ3॥విడువదు జన్మము వివేకముననేజడిసి స్వతంత్రము జరపిననుయెడయక శ్రీవేంకటేశ్వర నీవేబడిఁగాచితి విదె బ్రదికితి నేను రాగము: లలిత రేకు: 0088-05 సంపుటము: 1-433 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలితపూర్తి వివరాలు ...

error: