వార్తా విభాగం

జానపద గీతాలు

రాసెట్టి రామయ్యను (ఆదోని) గురించిన జానపదగీతం

వర్గం : కోలాటం  పాట బళ్ళారి జిల్లరా … బళ్ళారి జిల్లరా ఆదోని తాలూకురా రాసెట్టి వీరన్న కొడుకే రాయల వాడే రామయ్య రామా రామా కోదండరామా భై రామా రామా కోదండరామా రాసెట్టి వీరన్నకయితే ఎంతమంది కొడుకుల్లు ఒగరి పేరు రామయ్య ఒగరి పేరు సుబ్బయ్య అందరికంటే చిన్నావాడు అందగాడూ విశ్వనాధు పన్నెండామడ గడ్డలోన పేరుగల్ల రామయ్య ||రామా|| రామయ్య నేస్తులైన ఎంతమంది ఉన్నారు కొంగనపల్లి కిష్టరావు కోసిగానుమప్ప రా ||రామా|| బుద్ధిశాలి రామయ్య బూమ్మింద […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

గండికోట పరిసరాల్లో తిరుగుతోంది పులి కాదు … హైనానే!

కడప జిల్లాలోని చారిత్రక ప్రదేశమైన గండికోట పరిసరాల్లో సంచరిస్తూ, గొర్రెలనూ,మేకలనూ చంపివెస్తున్న క్రూరజంతువు పులికాదని, అది హైనా అనే జంతువని అటవీ అధికారులు స్పష్టం చేశారు. గండికోట పరిసరాలనూ, పెన్నా లోయనూ పరిశీలించిన అధికారు ఈ మేరకు ఈ ప్రకటన చేశారు. జంతువు పాదముద్రలను గుర్తించిన అధికారులు ఆ పాదముద్రలు హైనా అనే జంతువు పాదముద్రలుగా పేర్కొన్నారు. హైనాను  పట్టుకుని జంతు ప్రదర్శన శాలకు తరలించే ప్రయత్నాలను అధికారులు ప్రారంభించారు. హైనా కు సంబంధించిన వివరాలు 28-08-2010 […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

వాన జాడ లేదు – సేద్యానికి దిక్కు లేదు

18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు చేసుకోలేక రైతులు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్‌ పంటకు అను వైన జూన్‌, జులై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు నెలల్లో 393.5 మిల్లి మీటర్ల వర్షపాతం జి ల్లాలో నమోదు కావాల్సి ఉండగా 180.6 మిల్లి మీటర్లు మాత్రమే నమోదైంది. వాస్తవికంగా 54 […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

రేపు వైకాపా జిల్లా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం

కడప: వైకాపా జిల్లా అధ్యక్షుడిగా ఆకేపాటి అమరనాథరెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్, మైదుకూరు శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. నగరంలోని వైఎస్ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అమరనాథరెడ్డిని నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఆకేపాటి పార్టీని అన్ని రకాలుగా పటిష్టం చేయగలరన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

14న కడపకు రాఘవులు

సీమ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి అన్నారు. ‘రాష్ట్ర విభజన, జిల్లా అభివృద్ధి’ అన్న అంశంపై ఈనెల 14న కడపలో నిర్వహించతలపెట్టిన సెమినార్‌కు సంబంధించిన గోడపత్రాలను ఆయన విడుదలచేశారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గురువారం ఆర్జీయూ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా సీమ అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. ప్రత్యేకించి జిల్లాలో కరవు, నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్నట్టు చెప్పారు. సమస్య పరిష్కారానికి కృష్ణా జలాల […]పూర్తి వివరాలు ...

వార్తలు

కడప గడపలో సీమ ఆకలి ‘కేక’ అదిరింది

ఉద్యమాలు నాయకుల నుంచి కాదు… ప్రజల్లో నుంచి వస్తాయి అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కొత్తతరం నాయకులతోనే రాయలసీమకు న్యాయం రాజధాని ప్రకటనతో ముఖ్యమంత్రి సీమ వాసులను కించపర్చారు “శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలతో పాటు హోం శాఖల నివేదికలు కూడా రాజధానిగా విజయవాడ అనుకూలం కాదని తేల్చి చెప్పాయి.. సోషల్ అసెస్‌మెంట్ కమిటీ వారు రాజధానికి విజయవాడ అనుకూలం కాదని తేల్చిచెప్పారు.. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని రాష్ట్ర రాజధాని సాధన […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

భద్రత తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన వై.ఎస్.కుటుంబం

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్ కుమార్ లు తమ భద్రత కోసం కోర్టుకు వెళ్లవలసి వచ్చింది. తమకు ఉన్న ప్రాణ హానిని పరిగణనలోకి తీసుకోకుండా తమకు ఉన్న సెక్యూరిటీని ప్రభుత్వం ఉపసంహరించిందని వారు ముగ్గురు హైకోర్టు ను ఆశ్రయించారు. తాను ఇప్పటికే ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాసినా స్పందించలేదని, తనకు ఉన్న 2 ప్లస్ 2 భద్రతను పునరుద్దరించాలని విజయమ్మ కోరారు. గత ఎన్నికల వరకు విజయమ్మ […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

దానపరుడూ యంగళరెడ్డి …! – జానపద గీతం

వర్గం:  భిక్షకుల పాట అనువైన  రాగం : సావేరి స్వరాలు (ఏక తాళం ) ఉత్తరాది ఉయ్యాలవాడలో ఉన్నది ధర్మం సూడరయా నేటికి బుడ్డా యంగలరెడ్డి ధర్మ పెబువని పాడరయా దానపరుడూ యంగళరెడ్డి ధర్మదేవత బిడ్డడయా పచ్చి కర్వులో పాసెమూ పోసేను బెమ్మదేవుడే ఆయనయా   ||ఉత్తరాది|| యెచ్చుగానూ పుణ్యాత్ముడు రెడ్దని యంగళరెడ్డిని ఎంచరయా యంగళరెడ్డి దానపరుడని శానామంది పొగిడిరయా   ||ఉత్తరాది|| గుడ్డోల్లకు కుంటోళ్లకు గురుతుగా బండ్లే సేయించేనయా దొడ్డా బుద్ది కలిగిన పెద్ద దొరకు దండామని తెలిపిరయా  […]పూర్తి వివరాలు ...

పాటలు

ఏందిర ఈ సీంబతుకు (పాట) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

చింతల చీకట్లో–రైతన్నల కన్నీళ్లు వలసల వాకిట్లో–కూలన్నల పడిగాపులు కొలువుల పిలుపుకై–చదువరులా ఎదురుచూపు ఏందిర ఈ సీంబతుకు–ఎన్నాళ్లీ దేబిరింపు //చింతల// సీమ బీడు సాకుజూపు–నీటి వాట తెస్తారు వాన రాలేదనిఏడ్చి– రాయితీలు రాబట్తరు రాజకీయ రాబందులె–పంచేసు కొంటారు పల్లె జనాల నోట –దుమ్ము కొట్టుతుంటారు //చింతల// నీరు మీరు అంటారు–కన్నీరై కారుతారు కాళ్లబేరానికొచ్చి–ఓట్లనడుక్కు తింటారు కుర్చీలు ఎక్కగానె–కొండచిలువలైపోయి దిగమింగే కార్యాన్ని– దీక్ష తోన చేస్తారు //చింతల// వానలుకురిసే చోటుకు–వరదలు పొంగేనేలకు ప్రాజక్టుల నీళ్లన్నీ–సంతర్పణ చేస్తారు ఎడారి బీడు సీమకేమొ– […]పూర్తి వివరాలు ...

error: