కడప: స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ దగ్గర గల హజరత్ ఖ్వాజా సయ్యద్‌షామొహర్ అలీ (మొరి సయ్యద్‌సాహెబ్ వలి) 417వ ఉరుసు ఉత్సవాలు ఈనెల 20, 21వ తేదీల్లో వైభవంగా జరగనున్నాయి. ఆస్థానే మురాదియా దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా ఆధ్వర్యంలో 20వ తేదీ శనివారం గంథం ఉత్సవాలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం ముగరిబ్ నమాజ్ తరువాత పీఠాధిపతి ఇంటి నుంచి ఫకీర్ల మేళతాళాలతో దర్గా చేరుకొని గంథాన్ని సమర్పించనున్నారు. 21వ తేదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఖవ్వాలి […]పూర్తి వివరాలు ...
రైల్వేకోడూరు : రాయలసీమకు ప్రత్యేక హోదా కల్పించాలని, ప్రత్యేకప్యాకేజి కేటాయించాల ని, లక్షమందికి ఉపాధికల్పించే ఉక్కుపరిశ్రమ ను కడపలో నిర్మించాలని రాష్ట్ర సీసీఐ కార్యవర్గసభ్యులు రామానాయుడు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక పిఎస్‌ఆర్ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడుతూ సెయిల్ ఆధ్వర్యం లో ఉక్కుపరిశ్రమను స్థాపించాలన్నారు. తెలుగుగంగకు 29టిఎంసిలు, హంద్రీనీవాకు 40 టిఎంసిలు, గాలేరు-నగిరికి 38టిఎంసిలు, వెలి గొండ ప్రాజెక్టులకు 43.5 టిఎంసిల నికరజలాలను కేటాయించాలన్నారు. తగినన్ని నిధులు మంజూరుచేసి ఆయా […]పూర్తి వివరాలు ...
ఎస్సై(సివిల్) ఉద్యోగాలకు ఎంపికైన రాయలసీమ జోన్ అభ్యర్థులు ఈనెల 19న కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని కె.ఎస్.వ్యాస్ ఆడిటోరియంలో హాజరుకావాలని కర్నూలు రేంజ్ డీఐజీ మురళీక్రిష్ణ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 21 నుంచి హైదరాబాద్‌లోని ఏపీ పోలీసు అకాడమీలో శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ మెస్ అప్పా, హైదరాబాద్ పేరిట తీసిన రూ.12వేలు డీడీ, వంద రూపాయల ఖాళీ బాండ్ పేపరు, 8 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకుని […]పూర్తి వివరాలు ...
యోగివేమన విశ్వవిద్యాలయంలోని పరీక్షల నియంత్రణా విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. లక్ష్మీప్రసాద్‌ను ఫోన్‌లో దూషించిన తెదేపా నేత గోవర్ధన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని యోవేవి అధ్యాపకులు పట్టుపట్టారు. బుధవారం ఉపకులపతి ఛాంబర్‌కు అధ్యాపక సిబ్బంది యావత్తు కదలి వచ్చి తమతోటి సహాయ ఆచార్యునికి బాసటగా నిలిచారు. దుర్భాషలాడిన టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నరుకుతా.. అంటూ ఫోన్‌లో దుర్భాషలాడినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనబాట తప్పదని హెచ్చరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని […]పూర్తి వివరాలు ...
కడప: బసవతారకం మెమోరియల్ లా కళాశాల అధిపతిగా ఉన్న అధికార తెదేపా నేత గోవర్ధన్ రెడ్డి సహనం కోల్పోయి యోవేవి అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కంట్రోలర్‌ను మంగళవారం తిట్టినట్లు ఇవాళ ఒక పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది. అదే కళాశాలలో ఉన్న (లా కళాశాల) పరీక్షా కేంద్రాన్ని అధికారులు ఈ సారి యోవేవి ప్రాంగణంలోనే నిర్వహిస్తున్నారు. దాంతో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పోవడంతో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం రాబోవు […]పూర్తి వివరాలు ...
100 మందికి ప్రత్యక్ష ఉపాధి కేంద్ర ప్రభుత్వం ‘పవర్ ఫర్ ఆల్’ పథకంలో భాగంగా గాలివీడు వద్ద 500 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ‘సహజవనరులు మరియు పునరుత్పాదక’ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైదరాబాదులో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భారత ప్రభుత్వం 50 శాతం, ఏపి జెన్‌కో 41 శాతం, నెడ్‌క్యాప్ 9 శాతం పెట్టుబడులు పెడతాయి. […]పూర్తి వివరాలు ...
కమలాపురం: కడప జిల్లా పై ప్రభత్వ వివక్షకు నిరసనగా మరియు జిల్లా సమగ్రాభివృద్ధిని కోరుతూ.. ఈ నెల 22, 23, 24 తేదీల్లో అన్ని మండల కార్యాలయాల ఎదుట సీపీఐ, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని, ప్రజలు కూడా పాల్గొని ఆయా కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. వనరుల ఆధారంగా సమగ్రంగా అభివృద్ధి చేయకపోతే.. జిల్లా శాశ్వత ఏడారిగా మారే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు కేటాయించకుండానే జిల్లాను […]పూర్తి వివరాలు ...
దొరవారి నరసింహ్వరెడ్డి! నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహ్వ రెడ్డి! || దొర || రేనాటి సీమలోనా రెడ్డోళ్ళ కులములోనా దొరవారీ వమిశానా ధీరుడే నరసింహ్వ రెడ్డి || దొర || కొయిల్ కుంట్లా గుట్టలెంటా కుందేరూ వొడ్డూలెంటా గుర్రమెక్కీ నీవు వస్తే కుంపిణీకీ గుండె దిగులూ || దొర || కాలికీ సంకెండ్లు వేసీ చేతీకీ బేడీలు వేసీ పారాతో పట్టి తెచ్చీ బందికానులొ పెట్టిరీ || దొర || కండ్లకూ గంతాలు గట్టీ నోటినిండా […]పూర్తి వివరాలు ...
వారిద్దరూ సీమ ద్రోహులే బంగరు భూములకు సాగునీరూ లేదు కడప జిల్లా అభివృద్దిపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది పర్యాటక రంగంలోనూ జిల్లాపైనవివక్ష ప్రభుత్వ తీరుపై ఉద్యమించాలి కడప: రాయలసీమకు తరతరాలుగా అన్యాయం జరుగుతోందని, ఈ ప్రాంతం నాయకులు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ ముఖ్యమంత్రి పదవులను వెలగపెడుతున్నారే కానీ ఇక్కడి అభివృద్ధిని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ హాలులో సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐల సంయుక్త […]పూర్తి వివరాలు ...