కడప జిల్లా వాసులకు ఎఫ్ఎం రేడియో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆకాశవాణి కడప కేంద్రం ఇంజినీరింగ్ విభాగం డైరెక్టర్ రమణరావు సోమవారం రేడియో సేవలను అధికారికంగా ప్రారంభించారు. 103.6 మెగాహెడ్జ్‌పై కార్యక్రమాలను వినవచ్చు. 1 కిలోవాట్ సామర్థ్యంగల ఈ సేవలు 15కి.మీ. పరిధిలో శ్రోతలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీని సామర్థ్యం భవిష్యత్తులో పెంచేందుకు అవకాశం ఉందన్నారు. ఉదయం 5:55గంటల నుంచి సాయంత్రం 3:00 గంటల వరకు నిరంతరాయంగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఇటీవల సాంకేతికంగా ట్రయల్ […]పూర్తి వివరాలు ...
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య మండిపడ్డారు. సోమవారం కడపలో విలేఖర్లతో మాట్లాడిన ఆయన జిల్లాలో రాజకీయంగా బలం లేదనే కారణంతో ఈ ప్రాంతంపై వివక్ష చూపుతున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదన్న నెపంతో వారిపై కక్ష కట్టడం సబబు కాదని ఆయన అన్నారు. సీఎం పథకాలు మంత్రులకే అర్ధం కావడం లేదని ఆయన విమర్శించారు. మంత్రులకే అర్ధంకాని పథకాలను ప్రజల వద్దకు ఎలా చేరుతాయని రామచంద్రయ్య […]పూర్తి వివరాలు ...
వర్గం : జట్టిజాం పాట అనువైన రాగం: నాదనామక్రియ స్వరాలు (తిశ్రగతి) ఏమిసేతురా బగమతి గురుడా మొగుడు ముసలివాడు బెమ్మరాతర రాసిన వానికి తగులును నా ఉసురు అందరి మొగుళ్ళు సెరువుకు పోయి శాపల్ తెచ్చాంటే అమ్మమ్మో.. నా లడీసు మొగుడూ కాలవకు పోయి కప్పలు తెచ్చిండే ||ఏమి సేతురా|| అందరి మొగుళ్ళు బీదరు పోయి బిందెలు తెచ్చాంటే నా లడీసు మొగుడూ బీదరు పోయి బిత్తర పోయొచ్చిండే ||ఏమి సేతురా|| అందరి మొగుళ్ళు పంచల్ కట్కోని […]పూర్తి వివరాలు ...
రాయలసీమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి సీమకు నష్టం జరగకుండా చూడాలని మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి అన్నారు. కడప నగరంలోని ఆర్‌జేయూపీ కార్యాలయంలో ఆదివారం రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్‌యూ) రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు దీక్షల ఫలితంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని.. అనంతరం విశాలాంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్‌ను రాజధానిగా చేశారన్నారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం […]పూర్తి వివరాలు ...
కరువు గడ్డ కాదిది కాబోయే పోరు బిడ్డ నెత్తుటి గుడ్డ కాదిది కాబోయే ఉద్యమ అడ్డా మౌనాంగీకారం కాదు రా….. బద్దలవబోయే సీమ నిశ్శబ్ద ఘీంకారం ఎర్ర చందనం నీ సొత్తు కాదిక అది నా సీమ అస్తిత్వం అది మొరటుతనం కాబోదిక మాది నిప్పంటి సీమ కరుకుతనం కూరలో కరేపాకు కాదిక పోరులో కుర్రాళ్ళ జజ్జనక బీడుకట్టు కాదిక గోసెగ్గట్టిన ముళ్ళగట్టె నవ్యాంధ్ర కాదిక నాది నవసీమ గొంతుక జై రాయలసీమ జై జై రాయలసీమ […]పూర్తి వివరాలు ...
అరుణోదయ (ACF) వారి సహకారంతో రాయలసీమ నిర్మాణ సమితి , రాయలసీమ కళాకారుల సమితిలు కలిసి రూపొందించిన దృశ్యరూప రాయలసీమ ఉద్యమ గీతమిది. ఈ రోజు youtube ద్వారా విడుదలైన ఈ పాట ఆకట్టుకొంటోంది… మీరూ ఒకసారి వీక్షించండి!! పూర్తి వివరాలు ...
ఆడ చిరుత దొరికింది మగచిరుత కోసం మరో బోను ఏర్పాటు పులిని చంపితే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25లక్షల జరిమానా గండికోట: కోట పరిసరాల్లో తిరుగుతూ గత కొద్దినెలలుగా జీవాలపై దాడి చేస్తోన్న క్రూరజంతువులు చిరుతపులులే అని తేలిపోయింది. గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుతపులి ఒకటి చిక్కింది. దీన్ని ఒకటిన్నర సంవత్సరం వయస్సున్న ఆడ చిరుతగా గుర్తించారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు తిరుపతి, సిద్ధవటం, ముద్దనూరు ప్రాంతాల […]పూర్తి వివరాలు ...
కడప: కడప జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివక్ష చూపుతున్నాడని రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన రాయచోటిలోని వైకాపా పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ…. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించి కోస్తా- ఆంధ్రలో ఏర్పాటు చేయడం దారుణమన్నారు. కడప జిల్లాకు రావాల్సిన డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాన్ని ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకు కేటాయించుకోవడం అన్యాయమన్నారు. దీనిపై తెదేపా జిల్లా నేతలు కూడా నోరు మొదపలేదన్నారు. కడపలో విమానాశ్రయం పూర్తయినా ఇంత వరకు ప్రారంభించలేదన్నారు. […]పూర్తి వివరాలు ...
1876-78 సంవత్సరాలలో వచ్చిన కరువును ‘దాతు కరువు’ లేదా ‘డొక్కల కరువు’ లేదా ‘పెద్ద కరువు’ లేదా ‘ముష్టి కరువు’ గా వ్యవహరిస్తారు. తెలుగు సంవత్సరమైన ‘దాత’ లో వచ్చినందున ఈ కరువును ‘దాతు కరువు’ అని వ్యవరించేవారు. కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా కడుపు మాడ్చుకునేవాళ్ళు. దాంతో సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి ఎముకలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు(ఎముకల గూళ్ళు) మాత్రమే కనపడటం వలన […]పూర్తి వివరాలు ...