నేను - తను
భార్యాభర్తల తైలవర్ణ చిత్రం

అమ్మమ్మో ..నా లడీసు మొగుడూ – జానపదగీతం

వర్గం : జట్టిజాం పాట

అనువైన రాగం: నాదనామక్రియ స్వరాలు (తిశ్రగతి)

ఏమిసేతురా బగమతి గురుడా
మొగుడు ముసలివాడు
బెమ్మరాతర రాసిన వానికి
తగులును నా ఉసురు

అందరి మొగుళ్ళు సెరువుకు పోయి
శాపల్ తెచ్చాంటే
అమ్మమ్మో.. నా లడీసు మొగుడూ
కాలవకు పోయి కప్పలు తెచ్చిండే ||ఏమి సేతురా||

అందరి మొగుళ్ళు బీదరు పోయి
బిందెలు తెచ్చాంటే
నా లడీసు మొగుడూ
బీదరు పోయి బిత్తర పోయొచ్చిండే ||ఏమి సేతురా||

చదవండి :  సై..రా నరసింహారెడ్డి - జానపదగీతం

అందరి మొగుళ్ళు పంచల్ కట్కోని
పెంచల్ పోతాంటే
అమ్మమ్మో.. నా లడీసు మొగుడూ
వల్లె కట్కోని వతికిల పడ్తాడే ||ఏమి సేతురా||

అందరి మొగుళ్ళు సంతకుపోయి
సరుకుల్ తెచ్చాంటే
అమ్మమ్మో.. నా లడీసు మొగుడూ
సంతకుపోయి గుంతలో పన్న్యాడే ||ఏమి సేతురా||

అందరి మొగుళ్ళు కూడ బెట్టుకోని
మేడలు కడతాంటే
అమ్మమ్మో.. నా లడీసు మొగుడూ
ఉండే గుడిసెను ఊడబీకుతాడే ||ఏమి సేతురా||

ఏమిసేతురా బగమతి గురుడా
మొగుడు ముసలివాడు
బెమ్మరాతర రాసిన వానికి
తగులును నా ఉసురు

చదవండి :  బండీరా..పొగబండీరా... జానపదగీతం

ఇదీ చదవండి!

సుక్కబొట్టు పెట్టనీడు

సుక్కబొట్టు పెట్టనీడు… జానపదగీతం

అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు. విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు అతని సూటిపోటి మాటలు భరించలేకపోయింది.  సుక్కబొట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: