బండీరా

బండీరా..పొగబండీరా… జానపదగీతం

వర్గం: కోలాటం పాట

పాడటానికి అనువైన రాగం: హనుమత్తోడి స్వరాలు (తిశ్రం)

బండీరా..పొగబండీరా
దొరలేక్కే రైలూబండీరా
దొరసానులెక్కే బండీరా
అది జాతోడెక్కే బండీరా ||బండీరా||

బండీ సూస్తే ఇనుమూరా
దాని కూతెంతో నయమూరా
రాణీ లెక్కేది బండీరా
రాజూ లెక్కేది బండీరా ||బండీరా||

పయనమంటె రైలుబండీ
బయలుదేరుతాదన్నా
బుగ బుగ సేలల్లో
బుగ్గటించెను రైలు బండీ ||బండీరా||

యీడా కూతా లేసేనురా
ఆడా కూతా లేసేనురా
నీలాగిరి సెరువుకాడా
నిలిసీ కూతా వేసేనూరా ||బండీరా||

చదవండి :  బేట్రాయి సామి దేవుడా! - జానపద గీతం

ముందూ పెట్టెకు నిప్పూలూ
అహ ఎనకాపెట్టెకు బొగ్గూలు
ముందర తలకాయ్ తోనే…ఏ..ఏ
మున్నూటామడ సేరేనూరా ||బండీరా||

బండీ కాలిందెక్కడా
అహ..మైసూర్ పట్నం లోపల
బండీ సేసిందెక్కడా
అహ.. సెన్నపట్నం లోపల
సెన్నపట్నం నుండాడె
సిన్న కంసలోడురా
ఇంతలింతల బండీ సేసి
యీదులీదూలు అంపెను సూడూ ||బండీరా||

పాటను సేకరించినవారు: కలిమిశెట్టి మునెయ్య, దొమ్మరనంద్యాల, జమ్మలమడుగు తాలూకా, కడప జిల్లా

ఇదీ చదవండి!

శివశివ మూరితివి

శివశివ మూరితివి గణనాతా – భజన పాట

కోలాట కోపుల్లో తాలుపుగట్టి మొదటిది. ‘శివశివ మూరితివి’ అనే ఈ పాట తాలుపుగట్టి కోపుల్లో కడప జిల్లాలో జానపదులు పాడుకునే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: