వార్తా విభాగం

రాజకీయాలు

‘వారిని కోటీశ్వరులను చేసేందుకే’ – కర్నూలు ఎమ్మెల్యేలు

ఎన్నికల్లో సహాయపడిన వారిని కోటీశ్వరులను చేసేందుకే సీఎం చంద్రబాబు విజయవాడను రాజధానిగా ప్రకటించారని కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా శాసనసభ్యులు ఎస్వీ మోహన్‌రెడ్డి , గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మణిగాంధీలు విమర్శించారు.. వచ్చే ఎన్నికల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసుకోవడంలో భాగంగానే రాజధానిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారన్నారు. నలభై ఐదు అంతస్థుల భవనాలు నిర్మించడం ప్రమాదం కావచ్చని వారు హెచ్చరించారు.కర్నూలుకు అన్ని అర్హతలు ఉన్నా చర్చకు కూడా అవకాశం ఇవ్వలేదని మోహన్ రెడ్డి విమర్శించారు. […]పూర్తి వివరాలు ...

కవితలు

వాటమైన కేటుగాడు (కవిత) – సొదుం శ్రీకాంత్

నిధుల్లో వాటా సెప్పల్య నీళ్ళ కాడ కాటా బెట్టల్య ఉద్యోగాల్లో కోటా ముట్టల్య ఎముకలేని నాళికతో గాలిమేడల మాటల్తో నోటికాడ కూడు లూటీ సేసే వాటమైన కేటుగాడు ఈడు ఒరేయ్………. జూట్ కా బేటా నీ తాట ఒల్సి మెట్లుగుట్టుకోడానికి నా రాయలసీమ రాటు దేల్తాంది జిల్లాల వారీ ప్రణాళికలట గల్లీల్ని కూడా ఖిల్లాల్ని సేచ్చాడట కరువు సీమకు కన్నీళ్ళ సెరువులట కోయలకు నెత్తుటి పో’లవరాలట’ పుకార్ల పోట్లంతో షికార్లు సేసి తల్లి వేరునే తెగనరికే టక్కర్ […]పూర్తి వివరాలు ...

పాటలు

కొత్తసీమ (పాట) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

చర్న కోల ఏదిరా-బండిగుజ్జ వెదకరా వడిశెలా చెల్లెమ్మా-మొద్దొ పరక తీయమ్మా //చర్న// వాడెవడో నిజాముగాడు మననమ్మెనంట తెల్లోనికి ఇంకెవడో ఖద్దరోడు ముక్కలుగా నరికెనంట. అరవ నాడులో చేతులు కన్నడ దేశాన తలా మొండెమే మనమిప్పుడు వంచించ బడిన బిడ్డలం //చర్న// రాజుల కాలం కాదిది- రజకీయ నక్కలార ప్రజల మాట ఆలకించి -పోరాడుదాము రండి సరహద్దుల గీతగీచి -మాసంస్కృతినే చంపినారు కుటుంబాన్ని విడగొట్టి- కుర్చిలాట ఆడినారు //చర్న// లేవండీ కదలండీ- చలిచీమల దండులాగ పాముల పన్నాగాలా- పడగనీడ […]పూర్తి వివరాలు ...

కవితలు

సామీ నమస్కారం…. (కవిత)

సామీ నమస్కారం…. మాకు పంగనామాలు పెట్టిన  సామీ నీకు నమస్కారం అమ్మ నోట్లో మన్ను కొట్టి అబద్దాలు ఆరవోసిన  సామీ నీకు నమస్కారం సొమ్ములున్న సోగ్గాళ్ళ కౌగిట బందీవై  మము వెక్కిరించిన  సామీ నీకు నమస్కారం! సభ సాక్షిగా సీమకు  మకిలిని అంటగట్టిన  సామీ నీకు నమస్కారం! రాజధాని పేర రంకు నడిపి  ప్రకాశం పేరును బొంకిన సామీ నీకు నమస్కారం! ఉత్తుత్తి వరాలతో ఊదరగొట్టి పేపర్లతో అదరగొట్టించిన సామీ నీకు నమస్కారం! సొంతింటి పేరు సెప్పి […]పూర్తి వివరాలు ...

కవితలు

సావైనా బతుకైనా (కవిత) – సొదుం శ్రీకాంత్

రాళ్ళసీమ అంటనారు గదా రాసుకున్న హామీలపత్రం కూడా ఉంది గదా అదేదో ఆ సింగపూరన్నా కాలబడి మా ఊరికొచ్చే బేకారుగా తిరిగే మా పిల్ల నాయాల్లకు రెండు జీతం పరకలన్నా దొరుకతాయి అని ఆశపడి రాజధానిని అడుగుదామని పోతే ‘రస్తాలో లేవు పోచ్చాయ్ ……’ రౌడీ నా కొడకా అంటా ఎగిచ్చి తమ్తిరి! ఉరితాళ్ళు మీ ఇంట యాలాడనప్పుడు దుక్కిసాల్లు నిన్ను యంటబడి ఏటాడి మట్టుబెట్టనప్పుడు అవును మరి, కరువు ఎవరికి సేదు? ఒక్క మా రాయలసీమ […]పూర్తి వివరాలు ...

కవితలు

వాడు (హైకూలు) – సడ్లపల్లె చిడంబరరెడ్డి

యంత మది పగలూ రాత్రీ మన్నులో పులుగుల మాదిరీ కష్టం సేస్తే మాత్ర ఏమి?? వాడు–ఎన్నుమీద గువ్వ ఒగ గింజగూడామిగల్నీడు!! *** యంత సేపు మునిగి మునిగి మజ్జిగ గుత్తిమాదిరి పెరుగు సిలికితే మాత్రమేమి?? వాడు కడవమింద సెయ్యి యన్నంతా దేవుకొంటాడు!!పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు వ్యాసాలు

రాయలసీమ సాంస్కృతిక రాయబారి

కన్నడం మాతృభాష అయినా తెలుగు భాష కోసం 70 వసంతాల జీవితకాల అంకిత సేవలందించిన మహానుభావుడు, భాషోద్ధారకుడు, బహుభాషావేత్త, వ్యవస్థీకృత వ్యక్తిత్వ సంపన్నుడు డాక్టర్ జానమద్ది హనుమఛ్ఛాస్త్రి. అనంతపురం జిల్లా, రాయదుర్గంలో 1926 సెప్టెంబర్ 5న జన్మించారు. జానకమ్మ, సుబ్రమణ్యశాస్త్రి తల్లిదండ్రులు. ఆంగ్లంలోను, తెలుగులోను రెండు పీజీలు చేశారు. తొలుత విద్యాశాఖలో అధ్యాపకునిగా, స్కూళ్ళ ఇన్‌స్పెక్టర్‌గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్‌గా, ఆ తర్వాత ఇంగ్లీషు ఆచార్యులుగా 1984 వరకు ప్రభుత్వ సేవలందించారు. గాడిచర్ల స్ఫూర్తే జానమద్ది […]పూర్తి వివరాలు ...

వార్తలు

బంద్ సంపూర్ణం

కడప : వెనుకబడిన రాయలసీమను రతనాల సీమగా మార్చాలంటే.. సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని గురువారం తలపెట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. అన్నిచోట్ల పాఠశాలలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించి మద్దతు ప్రకటించాయి. జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద కూడా ప్రత్యేక బలగాలను మోహరించారు. అంబులెన్స్‌లతో భారీ ర్యాలీ : రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ కడపలో రాయలసీమ రాజధాని […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం రాజకీయాలు

ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

రాష్ట్ర రాజధానిగా విజయవాడను నిర్ణయిస్తూ ఇచ్చిన ప్రకటనలో కడప జిల్లాకు విదిల్చిన ముష్టిలోని మెతుకులేమిటో ఒకసారి చూద్దాం: 1. స్టీల్ ప్లాంట్: ఇది కొత్తగా కడుతున్నదేమీ కాదు. ఏడేళ్ల కిందట ప్రారంభించి, మధ్యలో ఆగిపోయిన నిర్మాణాన్ని ఇప్పుడు కొనసాగించి పూర్తిచేస్తారు, అంతే. ఐతే దీన్ని సాకుగా చూపి, కేంద్ర ప్రభుత్వ విద్య, పరిశోధనా సంస్థలేవీ కడప జిల్లా ఛాయలకు రాకుండా చేశారు. కానీ కేవలం 11 పరిశ్రమలున్న కడప జిల్లాలో(Src:www.apind.gov.in/library/district/kadapa.pdf) పన్నెండో పరిశ్రమ నిర్మిస్తున్నందుకే ఇంకేమీ లేకుండా […]పూర్తి వివరాలు ...

error: