దానపరుడూ యంగళరెడ్డి …! – జానపద గీతం

వర్గం:  భిక్షకుల పాట

అనువైన  రాగం : సావేరి స్వరాలు (ఏక తాళం )

ఉత్తరాది ఉయ్యాలవాడలో
ఉన్నది ధర్మం సూడరయా
నేటికి బుడ్డా యంగలరెడ్డి
ధర్మ పెబువని పాడరయా

దానపరుడూ యంగళరెడ్డి
ధర్మదేవత బిడ్డడయా
పచ్చి కర్వులో పాసెమూ పోసేను
బెమ్మదేవుడే ఆయనయా   ||ఉత్తరాది||

యెచ్చుగానూ పుణ్యాత్ముడు రెడ్దని
యంగళరెడ్డిని ఎంచరయా
యంగళరెడ్డి దానపరుడని
శానామంది పొగిడిరయా   ||ఉత్తరాది||

గుడ్డోల్లకు కుంటోళ్లకు
గురుతుగా బండ్లే సేయించేనయా
దొడ్డా బుద్ది కలిగిన పెద్ద
దొరకు దండామని తెలిపిరయా  ||ఉత్తరాది||

చదవండి :  సీరల్ కావలెనా - జానపద గీతం

సాదులకు సన్నాసులకంతా
సంతర్పణలు సేసేనయా
లేదనకుండా బీదలకిచ్చే
దానకర్ణుడని పొగిడిరయా ||ఉత్తరాది||

యంగళరెడ్డి ధర్మకీర్తులు
డిల్లీ కోటకు పాకేనయా
అచ్చిరికి పోయిన రానెమ్మా
డిల్లీకి పిలిపించెనయా   ||ఉత్తరాది||

రాణమ్మ తన పక్కన తకుతులో
రెడ్డినీ కూసునబెట్టేనయా
రంగుగాను బంగారూ పతకము
సందితికి అమరించెనయా
యంగళరెడ్డి సాటీ యవరని
ఎక్కడని అందరూ పొగిడిరయా  ||ఉత్తరాది||

ఇదీ చదవండి!

ఇసుర్రాయి

పచ్చొడ్లు నే దంచి…పాలెసరు బెట్టీ – జానపదగీతం

వర్గం: ఇసుర్రాయి పాట పచ్చొడ్లు నే దంచి పాలెసరు బెట్టీ పాలేటి గడ్డనా మూడు నిమ్మల్లూ మూగ్గూ నిమ్మల కింద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: