తెదేపా ప్రలోభాల పర్వం
జిల్లాలో స్థానిక ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులను తమ దారిలోకి తెచ్చుకునేందుకు అధికార తెదేపా ప్రలోభాలకు తెరతీసింది. వైకాపా కైవసం చేసుకున్న ఎర్రగుంట్ల పురపాలికను దక్కిన్చుకునేందుకు, అలాగే జిల్లా పరిషత్ పీఠాన్ని సైతం దక్కించుకోవడం కోసం తెదేపా నేతలు గెలుపొందిన స్థానిక ప్రతినిదులపైన సామదాన దండోపాయాలను ప్రయోగిస్తున్నారు.
20 మంది వార్డు సభ్యులున్న ఎర్రగుంట్ల పురపాలికలో 18 స్తానానలను వైకాపా అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. రెండు స్థానాలను తెదేపా అభ్యర్థులు దక్కించుకున్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎర్రగుంట్ల మండలానికి చెందిన తెదేపా రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ వైకాపాకు చెందిన ఏడుగురు సభ్యులను తీసుకెళ్ళి హైదరాబాదులో బాబు సమక్షంలో తెదేపాలో చేర్పించారు.
ఇలాంటి ప్రయత్నాలు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినపుడు అరిచి గగ్గోలు పెట్టిన ఓ పత్రిక ఇప్పుడు ‘ అయిదేళ్లపాటు అధికారంలో ఉండే పార్టీలోకి వస్తే మేలు జరుగుతుందని, ప్రతిపక్షంలో సాధించేదేముందనే ఉద్ధేశంతో పలువురు వడివడిగా అడుగులు వేస్తున్నారు.’ అని శుక్రవారం పేర్కొంది.
ప్రజాస్వామ్యం – దాని స్ఫూర్తి ఇత్యాది అంశాలపై ప్రజలను, చదివే వాళ్ళను చైతన్యం చేసేందుకు కంకణం కట్టుకున్న సదరు పత్రికకు ఇది తెదేపా ప్రలోభంగా కాక ప్రజాస్వామ్య పరిరక్షణగా కనిపిస్తుండడం కూడా విశేషమే!