Tags :yerraguntla

    ప్రత్యేక వార్తలు

    ఎర్రగుంట్లలో రజనీకాంత్ సినిమా షూటింగ్

    కడప : తమిళ నటుడు రజనీకాంత్‌ (Rajanikanth) హీరోగా నటిస్తున్న వెట్టియన్ (vettaiyan) సినిమా షూటింగ్ కడప జిల్లాలో గత నాలుగు రోజులుగా జరుగుతోంది. ఈ షూటింగ్ లో పాల్గొనేందుకు హీరోలు రజనీకాంత్,ఫాహద్ ఫాసిల్, రానా దగ్గుబాటిలతో పాటుగా పలువురు నటులు కడప జిల్లాకు వచ్చారు. ఎర్రగుంట్ల సమీపంలో (నిడుజువ్వి) ఉన్న రాళ్ళ గనుల్లో సినిమా చిత్రీకరణ జరిగింది. సినిమా చివరి షెడ్యూల్లో  భాగంగా రజనీకాంత్ పైన  కొన్ని ఫైటింగ్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. రజినీకాంత్‌ను చూసేందుకు […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ఎర్రగుంట్ల కౌన్సిలర్లపై అనర్హత వేటు

    ఎర్రగుంట్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులుగా కౌన్సిలర్ స్థానాలకు పోటీచేసి గెలిచిన తర్వాత తెదేపాకు ఫిరాయించిన ఎనిమిది మంది కౌన్సిలర్లపై అనర్హత వేటు పడింది. ఈ విషయాన్ని కమిషనర్ ప్రభాకర్‌రావు శనివారం విలేకర్లకు వెల్లడించారు. అనర్హులుగా ప్రకటించిన వారిలో ఎస్.పురుషోత్తం(ఒకటోవార్డు), వి.సరస్వతి(మూడో వార్డు), ఎ.గంగాభవాని (అయిదోవార్డు), జి.నారాయణరెడ్డి(ఆరోవార్డు), ఎస్.ఆసియాబేగం(పదోవార్డు), జె.మహిత(పన్నెండోవార్డు), ఎస్.మస్తాన్‌వలి(పదమూడోవార్డు), వి.లక్ష్మి(పద్నాలుగో వార్డు) కౌన్సిలర్లు ఉన్నారని ఆయన వివరించారు. నగర పంచాయతీకి జులై నెల 3న జరిగిన మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్మన్ ఎన్నికల సమయంలో […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    పాలకవర్గాలు ఏర్పడినాయి!

    కడప నగరపాలికతోపాటు, ఆరు పురపాలికల్లో పాలకవర్గాలు గురువారం కొలువు దీరాయి. జమ్మలమడుగులో మాత్రం ఓ కౌన్సిలర్ కనిపించకుండా పోవడంతో తెదేపా నేతలు వీరంగం చేశారు. దీంతో అక్కడ పాలకవర్గం ఎన్నికను ఈరోజుకు వాయిదా వేశారు. బద్వేలులో ఛైర్మన్‌గా తెదేపా కౌన్సిలర్ పార్థసారధిని ఎన్నుకోగా, వైస్ ఛైర్మన్ అభ్యర్థిపై స్పష్టత రాకపోవడంతో ఆ ఎన్నిక వాయిదా వేశారు. కడప నగరపాలికలోని మేయర్, డిప్యూటీ మేయర్, ఏడు పురపాలికల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు గురువారం ఎన్నిక నిర్వహించారు. అన్ని చోట్లా […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    పురపాలికల ఏలికలెవరో తేలేది నేడే!

     ఈరోజు కడప కార్పొషన్‌తోపాటు బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, రాయచోటి పురపాలికల పాలకవర్గం కొలువుదీరనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. కార్పొరేటర్లు/ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం కడపలో మేయర్, డిప్యూటీ మేయర్, ఆయా పురపాలక సంఘాలలో చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎంపికకు ఎన్నికలు జరుగన్నాయి. కలెక్టర్ కోన శశిధర్ కడప కార్పొరేషన్ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. కొత్త పాలకవర్గాల ఎన్నికకు కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని  మున్సిపాలిటీలు ముస్తాబయ్యాయి. ఎన్నికకు కేవలం […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    తెదేపా ప్రలోభాల పర్వం

    జిల్లాలో స్థానిక ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులను తమ దారిలోకి తెచ్చుకునేందుకు అధికార తెదేపా ప్రలోభాలకు తెరతీసింది. వైకాపా కైవసం చేసుకున్న ఎర్రగుంట్ల పురపాలికను దక్కిన్చుకునేందుకు, అలాగే జిల్లా పరిషత్ పీఠాన్ని సైతం దక్కించుకోవడం కోసం తెదేపా నేతలు గెలుపొందిన స్థానిక ప్రతినిదులపైన సామదాన దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. 20 మంది వార్డు సభ్యులున్న ఎర్రగుంట్ల పురపాలికలో 18 స్తానానలను వైకాపా అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. రెండు స్థానాలను తెదేపా అభ్యర్థులు దక్కించుకున్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎర్రగుంట్ల మండలానికి […]పూర్తి వివరాలు ...

    చరిత్ర

    గాంధీజీ కడప జిల్లా పర్యటన (1929)

    1929 (౧౯౧౯౨౯) మే 17 వ తారీఖున గాంధీజీ కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, మారెడ్డిపల్లి, ముద్దనూరు, చిలమకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల గ్రామాల మీదుగా రాత్రి 11 గంటలకు ప్రొద్దుటూరుకు చేరినారు. మహాత్మా గాంధి అమ్మవారిశాలను సందర్శించి శ్రీ వాసవీ మాతను సేవించారు. ఈ అన్ని చోట్లా గాంధీజీని అత్యంత ఉత్సాహముతో ఆదరించి సన్మానించారు. ముద్దనూరులో…  గాంధీజీ రాత్రి 9 గంటలకు ముద్దనూరు చేరినారు. ముద్దనూరులో గాంధీజీ దర్శనార్థం , అక్కడకు 12 మైళ్ళ దూరములో ఉన్న జమ్మలమడుగు […]పూర్తి వివరాలు ...