వార్తా విభాగం

ప్రత్యేక వార్తలు

ఖాదరాబాద్ లో ‘ప్రేమిస్తే ఇంతే’ సినిమా చిత్రీకరణ

ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఖాదరాబాద్ గ్రామంలో బుధవారం ‘ప్రేమిస్తే ఇంతే’.. సినిమా షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్‌ను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాకు ఖాదరాబాద్‌కు చెందిన రమేష్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. ప్రేమిస్తే ఇంతే… సినిమాలో నేటి యువత ఆకర్షణకు, ప్రలోభాలకులోనై ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో నటీనటులందరూ కొత్తవారేనన్నారు. రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ […]పూర్తి వివరాలు ...

గుసగుస రాజకీయాలు

తెదేపా ఆహ్వానాన్ని పట్టించుకోవట్లేదా?

డీ ఎల్ కి తెలుగు దేశం నేతలు గాలమేసే ప్రయత్నాలు చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే తెదేపా డీఎల్‌కు రాయబారం పంపి మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పట్ల అంతగా వ్యతిరేకత చూపని డీఎల్‌కు జిల్లాలో కీలక బాధ్యత అప్పగిస్తామని ఆ పార్టీ నేతలు భరోసా ఇస్తున్నారు. అయితే ఈ ఆహ్వానం పట్ల డీఎల్‌ నుంచి ఇంతవరకు సానుకూల స్పందన రాకపోవడంతో వేచి చూసే ధోరణిలో టీడీపీ నేతలు ఉన్నారు. రాబోయే ఎన్నికలలో తెదేపా […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

ఏ విచారణ వేసుకుంటావో వేసుకో?

మాజీ  మంత్రి డి.ఎల్ బుధవారం దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేటలలో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ తనకు వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ శాసనసభ్యులపైన విరిచుకు పడ్డారు. మట్కా నిర్వాహకుడైన వీరశివారెడ్డి సీఎం చెంచాగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మట్కాబీటర్‌కు ఎలా టికెట్ ఇస్తారని వైఎస్‌ను ఓ యువ డీఎస్పీ అడిగారన్నారు. దీనిపై వీరశివాను వైఎస్ ప్రశ్నించగా తాను కాకుండా కుటుంబసభ్యులతో మట్కా ఆడిస్తున్నాన్న నీచసంస్కృతి వీరశివారెడ్డిదన్నారు. డబ్బు సంపాదించేందుకు ఏ […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

మంత్రి పదవిపై ఆశలేదంట!

‘నాకు మంత్రి పదవిపై ఆశ లేదు. నేను మంత్రి పదవిని కోరుకోవడంలేదు. మంత్రి పదవి రానంత మాత్రాన నిరాశపడను. అధికారం కోసం ఆరాటపడను.’ అని కమలాపురం ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి అన్నారు. కమలాపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ధ్యేయం నెరవేరిందని, మంత్రి పదవిని కోరుకోవడం లేదని చెప్పారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని అందరితో కలిసి […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

ఇలా చేస్తుందనుకోలేదు…

బర్తరఫ్‌పై డిఎల్‌ ఆవేదనను వ్యక్తం చేస్తూ అధిష్ఠానం ఇలా చేస్తుందని అనుకోలేదన్నారు. ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డితో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని డిఎల్‌.రవీంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న డిఎల్‌ టీవీ ఛానళ్లతో టెలిఫోన్‌లో మాట్లాడుతూ ముఖ్యమంత్రితో తనకు విధానపరమైన విభేదాలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో విధానపరమైన విభేదాలుం డడటం సహజమన్నారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాను ఆరాటపడ్డానని వ్యాఖ్యానించారు. గతంలో తాను రాజీనామా చేశానని తన రాజీనామాను ఇంకా ఆమోదించాల్సి ఉందని డిఎల్‌ అన్నారు. అచ్చిరాని వైద్య […]పూర్తి వివరాలు ...

వార్తలు

మంత్రి డిఎల్‌.రవీంద్రారెడ్డిపై వేటు

మంత్రి డిఎల్‌.రవీంద్రారెడ్డిపై ముఖ్య మంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి బర్తరఫ్‌ వేటు వేశారు. ఇప్పటి వరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మంత్రిగా డిఎల్‌ బాధ్యతలు నిర్వర్తించారు. డిఎల్‌ను బర్తరఫ్‌ చేస్తూ శనివారం గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌కు ముఖ్యమంత్రి సిఫార్సు చేయగా, ఆ వెనువెంటనే గవర్నర్‌ ఆమోదముద్ర వేయడం జరిగి పోయాయి. కిరణ్‌ కుమార్‌ రెడ్డితో విభేదాల కారణంగానే డిఎల్‌ని మంత్రి వర్గం నుంచి తప్పించినట్లు సమాచారం. డిఎల్‌ మంత్రిగా ఉంటూనే పదే పదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని, సోనియా […]పూర్తి వివరాలు ...

వ్యాసాలు

జయరాం కథలు..వాడని మల్లెలు!

‘థాకరే బతకడం కోసం రాశాడు, డికెన్స్ రాయాలి కాబట్టి రాశాడు’ అన్నాడు జార్జి శాంప్సన్. సొదుం జయరాం కూడా అంతే. ‘పుణ్యకాలం మించిపోయింది’ అన్న కథలో నాయకుడు గోపాలకృష్ణ కథా రచయితే. అతడి గురించి రాసిన మాటలు జయరాంకూ వర్తిస్తాయి. దీపావళి కథల పోటీకి రాయమని గోపాలకృష్ణ భార్య పోరు పెడుతుంది. బహుమతి మొత్తం ఆశ పుట్టించడంతో ఆమె భర్తను ప్రేరేపిస్తుంది. కానీ గోపాలకృష్ణ ‘డబ్బు కోసమని ఏనాడూ కథలు రాయలేదు. రాయాలని అనిపించినపుడు రాశాడు. సామాజిక […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

సీమ పై విషం కక్కిన తెలంగాణా మేధావి – 1

తెలంగాణకు చెందిన ఆర్ విద్యా సాగర్ రావు కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ గా పని చేసి పదవీ విరమణ పొందారు. వారు మంచి మేధావి, వక్త కూడా. వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడంలోనూ సిద్ధహస్తులు. వారు ఈ మధ్య సినిమాలలో నటిస్తున్నారు కూడా. తెరాసకు సలహాదారుగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. రావు గారు ‘నమస్తే తెలంగాణా’ దిన పత్రికలో నీళ్ళు నిజాలు అని ఒక శీర్షిక నిర్వహిస్తున్నారు. ఈ శీర్షికలో వారు రాసిన వ్యాసాలలో సీమపై […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు వ్యవసాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ – కొన్ని నిజాలు

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ అనేది ఏమిటి? నీలం సంజీవరెడ్డి సాగర్‌ (శ్రీశైలం ప్రాజెక్టు) నుండి రాయలసీమకు సరఫరా చేసే నీటిని జలాశయం నుండి కాలువలోకి తీసుకునే నీటి నియంత్రణా వ్యవస్థే, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ (Pothireddypadu Head Regulator). నీటి సరఫరాను నియంత్రించే వీలు కలిగిన నాలుగు తూములు ఇక్కడ ఉన్నాయి. ఆ పేరు ఎలా వచ్చింది ? పోతిరెడ్డిపాడు అనే గ్రామం వద్ద దీనిని నిర్మించారు కనుక దీనికి ఆ పేరు వచ్చింది. గుంటూరు రహదారి నుండి 4 […]పూర్తి వివరాలు ...

error: