కడప జిల్లా నిడిజివ్వి గ్రామంలో జన్మించిన మైసూరారెడ్డి ‘రాయలసీమ ఉద్యమం’లో కీలక పాత్ర పోషించారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. సుమారు 25 ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగిన ఈ వైద్య పట్టభద్రుడు 2004లో తెలుగుదేశంలో చేరారు. ఒక టర్మ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఆ మధ్యన ఎం.వి.మైసూరారెడ్డితో ‘సాక్షి’ ప్రతినిధులు డి.శ్రీనాథ్, పూడూరి రాజిరెడ్డి సంభాషించారు. సారాంశం ఆయనదైన రాయలసీమ మాండలికంలోనే… మొదట్నుంచీ రైతు కుటుంబము. సిర్రాజుపల్లి అనే చిన్న గ్రామం నుంచి […]పూర్తి వివరాలు ...
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, ఈ విషయం రాష్ట్రంలో చిన్న పిల్లాడికి కూడా తెలుసని ఆయన భార్య వైఎస్ భారతి అన్నారు. జగన్‌ను జైల్లో ఉంచడమే సీబీఐ లక్ష్యమని, అందుకే ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేయాలన్న ఆలోచనే సీబీఐకి లేదని ఆమె విమర్శించారు. గురువారం ఆమె ప్రముఖ ఆంగ్ల న్యూస్ చానెల్ ‘ఎన్‌డీటీవీ’తో మాట్లాడుతూ … ‘‘ఈ కేసును సీబీఐ 21 నెలలుగా దర్యాప్తు చేస్తోంది. అక్టోబర్‌లో బెయిల్‌కోసం పిటిషన్ వేసినప్పుడు.. […]పూర్తి వివరాలు ...
రాయచోటి – లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలను సస్యశ్యామలం చేయగలిగే వెలిగల్లు, శ్రీనివాసపురం రిజర్వాయర్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయించి, హంద్రీ-నీవా జలాల తో నింపడమే తన జీవిత ధ్యేయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. హంద్రీ – నీవా జలాలను తరలించడం ద్వారానే దుర్భిక్ష ప్రాంతమైన రాయచోటి నియోజక వర్గంలో శాశ్వతంగా కరవును నివారించవచ్చని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ దశాబ్దాలుగా ఈ […]పూర్తి వివరాలు ...
పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుని 605వ జయంత్యుత్సవాలకు తి.తి.దే బుధవారం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్‌చార్జి డెరైక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఆఫీసర్ టీఏపీ నారాయణ తాళ్లపాకలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 26 వరకు జయంత్యుత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్నమయ్య జన్మస్ధలం అయిన తాళ్లపాకలోని ధ్యానమందిరంలో నాదస్వర సమ్మేళనంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. గ్రామోత్సవం, సప్తగిరి గోష్టిగానం, శ్రీవారి కల్యాణం, […]పూర్తి వివరాలు ...
చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన పలు హామీలను గడగడపకూ తెలిపెందుకు మాజీ ఎమ్మెల్సీ పుత్తా నర్సింహారెడ్డి కమలాపురం నియోజకవర్గ పరిధిలో ‘పలెపల్లెకు పుత్తా’ కార్యక్రమం ఈరోజు ఆరంభించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లోఅక్కడి మండల, గ్రామస్థాయి నాయకులు నిత్యం కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని వాటిలో ప్రతి ఇంటికీ వెళ్లి బాబు వాగ్దానాలపై ప్రచారం చేయనున్నట్లు పుత్తా నర్సింహారెడ్డి తెలిపారు. బాబు గారి హామీల్లో ముఖ్యమైన బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు, బంగారు రుణాలురద్దు, సాగు, తాగునీరు సరఫరా, […]పూర్తి వివరాలు ...
బ్రహ్మణీకి కేటాయించిన స్థలంలోనే సెయిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం వెంటనే ఉక్కు కర్మాగారం నిర్మాణం చేపట్టాలని కోరుతూ త్వరలో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి తెలిపారు. స్థానిక తన స్వగృహంలో రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధుల సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశం అనంతరం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. 2 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బ్రహ్మణీ ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని […]పూర్తి వివరాలు ...
గత కొద్ది సంవత్సరాలుగా సివిల్స్‌లో సత్తా చాటుతుతున్న కడప జిల్లా వాసులు, మరోసారి విజయ పతాక మోగించారు. శుక్రవారం విడుదలైన సివిల్స్ – 2012 ఫలితాలలో జిల్లాకు చెందిన మేఘనాథ్‌రెడ్డి, తేజ లోహిత్ రెడ్డి, సగిలి షణ్‌మోహన్‌లు మెరుగైన ర్యాంకులు సాధించారు. మేఘనాథ్‌రెడ్డి 55వ ర్యాంకును, తేజ లోహిత్ రెడ్డి 101వ ర్యాంకును, సగిలి షణ్‌మోహన్ 132వ ర్యాంకును సాధించారు. తేజలోహిత్‌రెడ్డి కమలాపురంలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కొండారెడ్డి కొడుకు తేజలోహిత్‌రెడ్డి. ఖాజీపేట మండలం సుంకేసుల వీరి సొంతూరు. […]పూర్తి వివరాలు ...
2011 జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మంగళవారం విడుదల చేసింది. 2001తో పోల్చితే జిల్లా జనాభా వృద్ధి రేటు 10.87 శాతంగా నమోదైంది. 2001లో జిల్లా జనాభా 26,01,797 మంది ఉంటే, తాజా జనాభా లెక్కల ప్రకారం 28, 82,469 మంది ఉన్నారు. వీరిలో 14,51,777మంది పురుషులు, 14,30,692 మంది స్త్రీలు ఉన్నారు. అంటే స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి పోల్చితే స్త్రీల కంటే 21085మంది పురుషులు అధికంగా ఉన్నారు. అయితే 2001తో పోల్చితే జనాభా వృద్ధిరేటు […]పూర్తి వివరాలు ...
కడప : జిల్లా కోర్టుకు మే ఒకటో తేదీ-బుధవారం నుంచి వేసవి సెలవులు మంజూరు చేస్తు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కోర్టుతోపాటు అయిదు అదనపు జిల్లా కోర్టులు, అన్ని సినియర్, సివిల్ జిల్లా కోర్టులకు మే ఒకటో తేదీ నుంచి 31 వరకు సెలవులు వర్తిస్తాయి. వేసవి సెలవుల్లో సివిల్ కేసుల విచారణ ఉండదు. జిల్లా వ్యాప్తంగా అత్యవసర సివిల్ కేసులు విచారించేందుకు జిల్లా స్థాయి న్యాయమూర్తి ఒకేషనల్ కోర్టు జడ్జిగా పని […]పూర్తి వివరాలు ...