జీవితంలో ముందు ముందు ఎవరిదారి వాళ్ళదనుకున్నాము. నలుగురం ఎప్పుడైనా, ఎక్కడైనా కలవడం కూడా అంత సాధ్యం కాదేమో అని నిరుత్సాహపడ్డాము. కాన్పూరు ఐ.ఐ.టిలో బి.టెక్ చదివిన నాలుగేళ్లూ ఎంతో ఆత్మీయంగా గడిచాయి. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఒకచోట పనిచేసే అవకాశం వస్తుందని ఎవరూ కలగనలేదు. అబ్దుల్లాది జమ్ము, సేతు మాధవన్‌ది తంజావూరు, దేశపాండేది పూనా, నాదేమో తెనాలి. నలువురం ఒకే దేశంలోని వాళ్ళమే. అయినా ఉద్యోగాల విషయంగా ఎవరు ఎక్కడుంటామో తెలియదు. అయితే, నిజం ఊహకంటే గొప్పది. […]పూర్తి వివరాలు ...
2011 లెక్కల ప్రకారం మన జనాభా: మొత్తం జనాభా : 28,84,524 పురుషులు : 14,54,136 స్త్రీలు : 14,30,388 పట్టణాలలో నివసించే వారి సంఖ్య: 983,736 పల్లెలలో నివసించే వారి సంఖ్య: 19,00,788 జనసాంద్రత (చదరపు కి.మీ.కి): 188 ఆడ – మగ నిష్పత్తి (1000 మంది మగవారికి) : 984 పూర్తి వివరాలు ...
జిల్లాలో చరిత్ర సృష్టించిన మహానుభావులెంతోమంది వున్నా ఫ్యాక్షన్ సినిమాల పుణ్యమా అని కడప పేరు వింటేనే గుండెలు పేలిపోతాయి… కడప కథలు వింటేనే నరాలు ఉత్కంఠతో తెగిపోతాయి. అయితే అదే జిల్లా నుంచి వచ్చిన ఓ వైద్యుడు మాత్రం నరాలను సరి చేస్తూ, నాడీ వ్యవస్థ శస్త్ర చికిత్సా నిపుణుడి (న్యూరో సర్జన్)గా రోగులకు సేవలందిస్తూ చెన్నైలో పలువురి ప్రశంసలందుకుంటున్నారు. ఆయనే డాక్టర్ ఆవుల చక్రవర్తి. * * * మౌలిక సదుపాయాల లేమి వల్లే వైద్యం […]పూర్తి వివరాలు ...
కడప కలెక్టరేట్ బంగ్లా కూడలిలో ప్రతిష్ఠించిన బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏప్రిల్ 27వ తేదిన లోక్సభ స్పీకర్ మీరాకుమార్ కడపకు రానున్నారు.ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో మీరాకుమార్‌ను కలిసిన దళిత నాయకులకు ఆమె అంగీకారం తెలిపారు. 27వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీ నుంచి తిరుపతికి చేరుకుంటారు. అక్కడ భోజనాలను ముగించుకుని కడపకు బయలుదేరుతారు. 3-4 గంటల్లోగా కడపలో జరిగే జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. స్పీకర్‌ను కలిసిన వారిలో బాబూ […]పూర్తి వివరాలు ...
1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు. అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు […]పూర్తి వివరాలు ...
“ఉత్తరాన ఒక వాన ఉరిమి కురవాల దక్షిణాన ఒక వాన దాగి కురవాల పడమరా ఒక వాన పట్టి కురవాల తూర్పున ఒక వాన తుళ్ళి కురవాల…” పాట సాగిపోతూ వుండాది. పాట ప్రవహిస్తా వుండాది. పాట పరవళ్ళు తొక్కుతా వుండాది. పాట పరవశిస్తా ఆడతా వుండాది. తెల్లటి ఆకాశం మీద నల్లటి మోడాలు కమ్ముకుంటా వుండాయి. మోడాలు మోడాలు పెనవేసుకొని అల్లుక పోతా వుండాయి. ఒకదానికొకటి చేతులు పట్టుకొని కదలి వస్తా వుండాయి. కదలి… కదలి.. […]పూర్తి వివరాలు ...
గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు… రాగం: సామంత కీర్తన సంఖ్య: ౩౧౪(314), ౨౭ (27) వ రాగి రేకు పల్లవి: చీరలియ్యగదవోయి చెన్నకేశవా! చూడు చేరడేసి కన్నుల వో చెన్నకేశవా […]పూర్తి వివరాలు ...
విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి. సాహితీ సమరాంగణ చక్రవర్తిగా చరిత్రకెక్కిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ప్రస్తుత కడప ప్రాంతం రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రధాన భూమికను పోషించింది. కడప ప్రాంతంలో లభించిన […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ఇది శుభపరిణామమని జైళ్ల శాఖ రీజియన్ డీఐజీ జయవర్దన్ అన్నారు. మంగళవారం స్థానిక బద్వేలు సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గతంలో జమ్మలమడుగు సబ్‌జైలులో 100మంది ఖైదీలు ఉండేవారని, ప్రస్తుతం 13 మంది ఉన్నారన్నారు. అలాగే ప్రొద్దుటూరు సబ్‌జైలు పరిధిలో గతంలో 80మంది ఖైదీలుండగా, ప్రస్తుతం 30-40మధ్యలో ఉంటున్నారని, దీనికి ప్రధాన కారణం నేరాలు తగ్గుముఖం […]పూర్తి వివరాలు ...