వార్తా విభాగం

కథలు

యంగముని వ్యవసాయం (కథ) – ఎన్. రామచంద్ర

యంగమునివ్యవసాయంకథ మోచేతులు దాటి ఖాకీ చొక్కా, మోకాలు దాటి ఖాకీ నిక్కరు, గడ్డపార భుజాన ఒకవైపు పికాసి, మరోవైపు చెట్లడ్డ, పారతో యంగముని, పంగలకర్ర, మచ్చుగత్తి, ప్లాస్టిక్‌ బిందెతో సావిత్రి, టైర్‌ లేయర్‌తో చేసిన ఆకు చెప్పలు వేసుకుని చీకటి విచ్చీ విచ్చకముందే ఒకవిడత ఉప్పుతో ఊరబెట్టిన అంబలితాగి, మధ్యాహ్నానికి రెండు ఎరగడ్డలు, రెండు పచ్చిమిరపకాయలు, చద్దన్నం మూట, ప్లాస్టిక్‌ బిందెలో పదిలంగా పెట్టుకని బోడిగుట్టకు కోడు కొట్టుకుందుకు బయలుదేరుతారు. పనిలోకి వంగితే ఇద్దరి మధ్య మాటా […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

‘వదినకు ఒకసరి…’ జానపద గీతం

వదినకు ఒకసరి బిందెకు బిగసరి బంగారు జడ కుచ్చుల మా వదిన అహ బంగారు జడ కుచ్చుల మావదిన ।వదినకు । తాటి తోపులో పామును చూసి (2) వడ్డాణమంటది మా వదిన తన నడుముకు కట్టమంటది మా వదిన ।వదినకు । చెరువులొ ఉండే కప్పల్ని చూసి బోండాలంటది మా వదిన తాను భోంచేస్తానంటది మా వదిన ।వదినకు । బండిని తోలే బండోణ్ని చూసి నా మొగుడంటది మా వదిన ఎగిరి బండెక్కి కూర్చుంటది […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఆ ఒక్క సీటూ మనోడిదే!

రాష్ట్రంలో ప్రభుత్వ బోధనా కళాశాలల్లో అన్నింటిలో కలిపి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సీటు ఒకే ఒక్కటి ఉంటుంది. 2013-14 విద్యాసంవత్సరానికి జరిగిన స్విమ్స్ సెట్‌లో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో ఉన్న ఏకైక సీటును జిల్లా వాసి సొంతం చేసుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సూపర్‌స్పెషాలిటీ కోర్సులో డా.దినకర్‌రెడ్డి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సీటు సాధించారు. వైఎస్సార్ (కడప) జిల్లా పులివెందులకు చెందిన డా.దినకర్‌రెడ్డి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, పీజీ(జనరల్ సర్జరీ) చేశారు.పూర్తి వివరాలు ...

వార్తలు

ఈ రోజు నుంచి పంచాయతీ నామినేషన్ల స్వీకరణ

జిల్లా వ్యాప్తంగా 785 పంచాయతీలకు సంబంధించి ఏ పంచాయతీకి ఆ పంచాయతీ కేంద్రంలో రిటర్నింగ్ అధికారులు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. అదేరోజు నుంచి 241 క్లస్టర్ల పరిధిలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మూడు దశల్లో జరిగే ఎన్నికలకు ఈనెల 9వ తేదీ నుంచి 3వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన 13న, నామినేషన్ల తిరస్కరణపై ఆర్డీఓలకు అప్పీళ్లు 15న, అప్పీళ్లకు ఆర్డీఓ పరిష్కారం […]పూర్తి వివరాలు ...

పర్యాటకం

400 ఏండ్ల రాయచోటి పత్తర్‌ మసీదు

రాయచోటి నడిబొడ్డున ఠాణా సెంటర్‌లో ఉన్న అతి ప్రాచీనమైన మసీదు ‘షాహీ జామియా’ మసీదు (పత్తర్‌ మసీదు). దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ మసీదు స్థలాన్ని అప్పటి భూస్వామి ఇనాయత్‌ ఖాన్‌ దానం చేశారట. అప్పట్లో గ్రామ పెద్దల సహకారంతో ఆర్థిక వనరులు సమకూర్చకుని మసీదు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మసీదు నిర్మాణమంతా రాతితో జరిగింది. అందుకే దీనిని పత్తర్‌ మసీద్‌ అని పిలుస్తారు. మసీదు అంటే ప్రార్థనా మందిరం. దీనికి మరొక పేరు […]పూర్తి వివరాలు ...

వార్తలు

సమైక్యాంధ్ర కోసం జిల్లాలో రాజీనామాలు

సమైక్యాంధ్ర కోసం కడప జిల్లాలో రాజీనామాల పర్యవం మొదలైంది. సమైక్యాంధ్ర జేఏసిీ, విద్యార్థి జేఏసిీ నేతలు ఆదివారం నిర్వహించిన సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, బచ్చల పుల్లయ్యలు స్పీకర్ ఫార్మెట్‌లో వేదికపైనే రాజీనామాలు చేశారు. సీమాంధ్రలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎం పీలు సహా మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసేలా విద్యార్థులు ప్రజలు ఒత్తిడి తేవాలని సమైక్యాంధ్ర జేఏసిీ నేతలు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

మాటలు లేకుండా విషయం చెప్పగల ప్రతిభావంతుడు

ఒక పేజీలో చెప్పలేని విషయాన్ని ఒక మాటలోనే కార్టూనిస్టులు చెప్పగలరని, కానీ పొదుపరి అయిన సురేంద్ర మాటలు లేకుండా ‘కాప్షన్ లెస్’ కార్టూన్లతో ఎంతో విషయం చెప్పగల ప్రతిభావంతుడని ఛత్తీస్ ఘడ్ సి.ఎం రమణ్ సింగ్ కొనియాడారు. కార్టూన్ మాస పత్రిక ‘కార్టూన్ వాచ్’ ఆధ్వర్యంలో జూన్ 29 వ తేదీన (శనివారం) రాయపూర్ లోని ‘సర్క్యూట్ హౌస్’లో – ‘కార్టూన్ ఫెస్టివల్-2013’లో భాగంగా జరిగిన జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా […]పూర్తి వివరాలు ...

వార్తలు

9న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్

23వ తేదీన కడప డివిజన్‌లో… 27న రాజంపేట డివిజన్‌లో… 31న జమ్మలమడుగు డివిజన్‌లో… పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జిల్లాలోని 791 పంచాయతీలకు గాను  785 పంచాయతీలకు ఈనెల 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 260 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్‌ఓలు) (స్టేజ్-1 ఆఫీసర్లు), 260 మంది (స్టేజ్-2 ఆఫీసర్లు) సహాయకుల నియామకాలకు కలెక్టర్ కోన శశిధర్ ఆమోదం తెలిపారు. మొదటి విడతలో ఈనెల 23వ తేదీన కడప డివిజన్‌లో 252 […]పూర్తి వివరాలు ...

వార్తలు

పీసెట్‌లో మొదటి, ఆరవ ర్యాంకు మనోల్లకే..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నబీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీసెట్‌ పరీక్ష ఫలితాలలో కడప జిల్లా వాసులు సత్తా చాటారు. బీపీఈడీలో రాష్ట్ర మొదటి ర్యాంకును కడప జిల్లా గోపవరానికి చెందిన దుత్తలూరు ప్రభావతి సాధించారు. యూజీడీపీఈడీ కోర్సులో 6వ ర్యాంకును లక్కిరెడ్డిపల్లి మండలం కుర్నూతలకు చెందిన గ్రంధం భారతి సాధించారని పీసెట్‌ కన్వీనర్‌ పాల్‌కుమార్‌ వెల్లడించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మంగళవారం పీసెట్‌ ఫలితాలను విడుదల చేసింది.పూర్తి వివరాలు ...

error: