జిల్లాలోని నారంరాజుపల్లె జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతి ప్రవేశానికి ఈ ఏడాది ఫిబ్రవరి 10వతేదీన సీబీఎస్‌ఈ (ఢిల్లీ) నిర్వహించిన ప్రవేశ పరీక్షాఫలితాలను శనివారం ప్రకటించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు విడిగా రిజిస్టరు పోస్టుద్వారా సమాచారం ఇచ్చామని ప్రిన్సిపాల్ కె.వి సుబ్బారెడ్డి తెలిపారు.ఆరో తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించిన వారి నెంబర్లు: రూరల్ ఓపెన్ కేటగిరి 00014, 00016, 00050, 00952, 01017, 01235, 01236, 01539, 01801, 01856, 02048, 02610, 02614, 02621, 03241, 03340, […]పూర్తి వివరాలు ...
ప్రతి విద్యార్థి మాతృభాషమీద పట్టు సాధించాలని జాతీయస్థాయి భారతీయ భాషాభివృద్ధి మండలి సభ్యుడు, ప్రముఖ రచయిత కేతు విశ్వనాథరెడ్డి పిలుపునిచ్చారు. నందలూరు కథానిలయం ఏటా ప్రదానం చేసే కేతువిశ్వనాధరెడ్డి పురస్కారాన్ని తుమ్మెటి రఘోత్తమరెడ్డికి అందజేశారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డిని కేతు విశ్వనాథరెడ్డి పురస్కారంతో రాజంపేట లయన్స్‌క్లబ్ అధ్యక్షులు అబ్దుల్లా, కార్మిక సంఘ మాజీ నాయకుడు నువ్వుల చిన్నయ్యలు సత్కరించారు. శ్రీప్రతిభా ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేతు విశ్వనాధరెడ్డి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మాతృభాష మీద పట్టు సాధించాలంటే […]పూర్తి వివరాలు ...
భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేసే జాతీయ మండలి సభ్యునిగా తెలుగు భాషకు సంబంధించి ప్రముఖ రచయిత కేతు విశ్వనాథరెడ్డి నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, భారతీయ భాషల అభివృద్ధికి కౌన్సిల్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్(సీసీఐఎల్) కృషి చేస్తోంది. దీనికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1996) గ్రహీత. […]పూర్తి వివరాలు ...
2013 సంవత్సరానికి గాను ‘కార్టూన్ వాచ్’ జీవిత సాఫల్య పురస్కారానికి కార్టూనిస్టు సురేంద్ర ఎంపికయ్యారు. ఈ నెల 29వ తేదీన ‘కార్టూన్ ఫెస్టివల్’లో భాగంగా రాయ్ పూర్ లోజరిగే కార్యక్రమంలో సురేంద్రకు పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. చత్తీస్ఘడ్ ముఖ్యమత్రి రమణ్ సింగ్, ఆ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి బ్రుజ్మోహన్ అగర్వాల్ లు పురస్కార ప్రదానోత్సవానికి హాజరవుతారు. ‘కార్టూన్ వాచ్’ దేశంలోని ఏకైక కార్టూన్ మాస పత్రిక. గతంలో ఆర.కె.లక్ష్మణ్, అజిత్ నైనన్, సుధీర్ తైలాంగ్ ‘కార్టూన్ […]పూర్తి వివరాలు ...
ఈ నెల 26వ తేదీ నుండి జరగాల్సిన యోగి వేమన విశ్వ విద్యాలయ డిగ్రీ ఇన్ స్టంట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇందుకు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటన విడుల చేశారు. జూన్ ఒకటవ తేదీ నుండి ఆయా కళాశాలల పరిధిలో ఇన్ స్టంట్ జరగనున్నాయి.పూర్తి వివరాలు ...
బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు. వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది. వీరు జంటకవులు. విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు. దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు. ఆ గ్రంథం అముద్రితం. వావిళ్ల వారి శ్రీమదాంధ్ర భాగవత ముద్రణలోని శేషాద్రి రమణ కవుల ‘భాగవత ప్రశంస’ నుండి ఆ ప్రశంసా పద్యాన్ని ఎత్తి చూపుతున్నాను. ఆ పద్యమిది. చ|| నెఱిగుఱిగల్గు నన్నయమనీషిని దిక్కన శంభుదాసునిన్ బరువడి […]పూర్తి వివరాలు ...
తెల్లబాడు నుండి కలసపాటి దావంబడి నడ్సుకుంటా వచ్చాడు నారయ్య. ఆ మనిషి కండ్లు మసక మసగ్గా కనపడ్తాండయి. సొగం దూరం వచ్చాక ఎడం పక్క ఆ మనిషికి కావాల్సింది కనిపిచ్చింది. మెల్లగ నడ్సుకుంటా జిల్లేడు శెట్టుకాడికి పొయినాడు. శెట్టు బాగా ఏపుగా పెరిగింది. ఒక్కొక్క ఆకు అరశెయ్యంత ఉంది. తెల్లగా శెట్టు నిగనిగలాడతా ఉంది. ఒక ఆకు తుంచినాడు. పాలు జలజల కారినాయి. ఆకు నుండి కారతాన్నె జిల్లేడు పాలను రెండు కండ్లలో పోసుకొని కాసేపు కండ్లు […]పూర్తి వివరాలు ...
మా కడప జొన్నన్నం, రాగిసంగటీ, అలసంద వడలూ… కారెం దోసె 56 సంవత్సరాల జీవితంలో సుమారు వెయ్యి పైచిలుకు చిత్రాలలో వివిధ రకాలైన పాత్రలలో నటించిన వై విజయ (యెనిగండ్ల విజయ) తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. నృత్యకళాకారిణి కూడా అయిన విజయ ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చినసత్యం వద్ద నృత్యం నేర్చుకున్నారు. నటించడమంటే ఏంటో తెలియని చిన్న వయస్సులోనే దర్శకులు చెప్పినట్టు చేసి తొలి షాట్‌ను ఓకే చేసిన విజయ అటు నృత్యంలోను, ఇటు నటనలోనూ రాణించారు. […]పూర్తి వివరాలు ...
యోగివేమన విశ్వవిద్యాలయం డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈనెల 26 నుంచి ఇన్‌స్టంట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె. కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో మొదటి రెండు సంవత్సరాల్లో అన్ని పేపర్లు ఉత్తీర్ణులై ఉండి తృతీయ సంవత్సరంలో ఉత్తీర్ణులు కాలేకపోయిన అభ్యర్థులు ఈ పరీక్షలు రాయడానికి అర్హులని తెలిపారు. పరీక్ష రాయగోరే అభ్యర్థులు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.యోగివేమనయూనివర్సిటీ.ఏసీ.ఇన్, డబ్ల్యూ. డబ్ల్యూ.డబ్ల్యూ. స్కూల్స్9.కాం, మనబడి. […]పూర్తి వివరాలు ...