వార్తా విభాగం

వార్తలు

ఔను..వీళ్ళు కూడా అంతే!

కడప జిల్లా అంటే అదేదో వినకూడని పేరైనట్లు ప్రభుత్వ పెద్దలు చిన్నచూపు చూస్తుంటే తాజాగా రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ తానేమీ తక్కువ తినలేదని నిరూపించింది.రాయలసీమలోని మూడు జిల్లాలను పరిశీలించిన సదరు కమిటీ సభ్యులు ఒక్క కడప జిల్లాను మాత్రం విస్మరించారు. ఎంచేత? ప్రభుత్వ పెద్దలూ, కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్యులూ అంతా కమిటీతో సంబంధం లేకుండా తమ సామాజికవర్గం, ధనికుల ప్రాబల్యం అధికంగా ఉండే గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటించేశారు. […]పూర్తి వివరాలు ...

వార్తలు

కదంతొక్కిన విద్యార్థులు

సీమలో రాజధాని ఏర్పాటు చేయకుంటే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని విద్యార్థులు హెచ్చరించారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం రాయలసీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి సంఘం కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ రాజధాని రాయలసీమ హక్కు అనే విషయాన్ని మన పాలకులు మరచిపోతున్నారన్నారు. సీమలో రాజధాని ఏర్పాటు కోసం కృషి చేయని రాజకీయ నాయకులను తరిమికొట్టాలన్నారు. […]పూర్తి వివరాలు ...

కవితలు

తేల్సుకుందాం రార్రని తెగేసి సెప్పక!

ఒరే అబ్బీ..ఒరే సిన్నోడా పొగబండీ..ల్యాకపాయ ఒరే సంటోడా..ఒరే సన్నొడా ఎర్ర బస్సూ కరువైపాయ అబ్బ పాలెమాలినా.. జేజికి బాగ లేకపొయినా గుంతల దోవలే దిక్కైపాయ తాతల కాలం నుంచీ పొగబండ్లని ఇనడమేకానీ ఎక్కిన పాపాన పోల్యా ఉత్తర దిక్కు రైలు యెల్తాంటే సిత్తరంగా ముక్కున ఎగసూడ్డమే కానీ కాలు మింద కాలేసుకోని కూచ్చోని రోంత దూరమన్నా పోయింది ల్యాకపాయ మా సిన్నాయన ఒకసారి కనకదుర్గమ్మ తిన్నాలకు పోయుండ్య పొగబండ్లతోనే పైన మోడాలు ఆడ్తాండయంట ఊరూరికీ పొగబండ్లలోనే జనాలంతా […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

మా రాయలసీమ ముద్దు బిడ్డడు

మా రాయలసీమ ముద్దు బిడ్డడు, మా భగీరధుడు, మా రాయలసీమ లో పుట్టి మా సీమ కరవుని తలచి, విచారించి మొత్తం తెలుగు నేల అంతా కరువు ఉండకూడదని కంకణం కట్టుకొని భగీరధ ప్రయత్నం చేసిన వాడు….మా సీమ నిండా సంతోషాలు సిరులు కురవాలని మనసార ప్రయత్నం చేసిన వాడు….మా రాజశేఖరుడు….మా గుండెల్లో సదా స్ఫూర్తి నింపుతూ మమ్ములను నడిపించే చుక్కాని……ఆచంద్ర తారార్కం కీర్తింపబడువాడు నేడు వైఎస్ జయంతి!… కడప జిల్లా ప్రజల తరపున ఆ మహనీయుడికిది […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

కడప జిల్లాపరిషత్ ఏకగ్రీవం

కడప జిల్లా పరిషత్‌ పీఠం ఏకగ్రీవమైంది. జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని తెదేపా నేతలుచేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకార అనంతరం ఓటింగ్‌ కన్నా ముందే సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో వైకాపా సభ్యులు జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ఎర్రగుంట్ల జడ్పీటీసీ సభ్యుడు గూడూరు రవి, వైస్‌చైర్మన్‌గా ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కలెక్టర్‌ కోన శశిధర్‌ అధ్యక్షతన జడ్పీ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

జానీ వచ్చాడోచ్…

ఎవరి పేరు చెప్పి జమ్మలమడుగు  పట్టణంలో తెదేపా వాళ్ళు పోలీసులతో తలపడ్డారో… ఎవరి పేరు చెబితే పోలీసులు, అధికారులు ఉలిక్కిపడతారో…. ఎవరి గురించి  జమ్మలమడుగు మునిసిపల్ ఎన్నిక వాయిదా పడిందో… అతడే ఈ జానీ! – రెండు వేల మంది తెదేపా కార్యకర్తలు, పదుల సంఖ్యలో నాయకులను, వందలాదిమంది పోలీసులను రెండు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా జమ్మలమడుగు వీధులలో తన కోసం ఎదురుచేసేలా చేసిన ఘనాపాటి. జమ్మలమడుగు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక రోజున గోవా వెళ్ళిన […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

‘రాక్షస పాలన కొనసాగుతోంది’ – సిఎం రమేష్

జమ్మలమడుగు సంఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు సరిగాలేదని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. స్థానిక పురపాలిక ఛైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా గురు, శుక్రవారం జరిగిన లాఠీఛార్జి, బాష్పవాయు ప్రయోగంలో గాయపడిన తెదేపా నాయకులు, కార్యకర్తలను పరామర్శించడానికి శనివారం జమ్మలమడుగుకు వచ్చిన రమేష్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పురపాలిక ఎన్నిక న్యాయబద్ధంగా జరపాలంటూ నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిని పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చారన్నారు. పోలీసు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఈరోజు సీమ సాహితీవేత్తల సమాలోచన

రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమ భవితవ్యంపై కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఈ రోజు (ఆదివారం – 6వ తేదీన) నిర్వహించే సీమ స్థాయి కవుల, రచయితల , పాత్రికేయుల సమావేశానికి అందరూ తరలిరావాలని కుందూ సాహితి సంస్థ కన్వీనర్ లెక్కల వెంకటరెడ్డి తెలిపారు. స్థానిక సిపిబ్రౌన్ గ్రంధాలయంలో ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ సమావేశానికి కడప.ఇన్ఫో గౌరవ్సంపాదకులు, రచయిత తవ్వా ఓబులరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర విభజనానంతర పరిణామాలు రాయలసీమకు వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్నాయని […]పూర్తి వివరాలు ...

చరిత్ర

కడప జిల్లా శాసనాలు 2

స్మారక శిలలు, వీరగల్లులు … శాసన భేదాల్లో స్మారక శిలలు, వీరగల్లులను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం ఉంది. యుద్ధంలో మరణించిన వీరులకు, దైవానుగ్రహం కోసం ఆత్మబలి చేసుకున్న భక్తులకు స్మారక శిలలను ప్రతిష్ఠించే ఆచారం ఉండేది. బృహచ్ఛిలాయుగం నాటి సమాధులు, చారిత్రక యుగం నాటి ఛాయాస్తంభాలు, బౌద్ధస్తూపాలు కూడా స్మారక చిహ్నాలేనని చరిత్రకారుల అభిప్రాయం. రాజులు, రాణులు, మత గురువులు మరణించినప్పుడు వారి స్మృత్యర్థం ఛాయాస్తంభాలను నిలిపేవాళ్లు మరణించినవారి ఛాయ ఈ స్తంభంలో ఉంటుందని ఆనాటి […]పూర్తి వివరాలు ...

error: