నాకు సిపిఐ పార్టీ అంటే ఎప్పటినుంచో అభిమానం ఉంది కానీ ఈ మద్యన ఆ అభిమానాన్ని చంపుకోవాల్సి వస్తుంది… రాయలసీమ సిపిఐ నాయకులు రాయలసీమకు రాజధాని ,నీళ్ళు కావాలని అంటారు కానీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాయలసీమకు చెందినవాడే – కానీ ఆయన మాత్రం… రాజధాని గుంటూరు-విజయవాడ మద్య ఉండాలంటాడు ..!. కృష్ణా డెల్టాకునీళ్ళు కావాలంటాడు…! పోలవరాన్ని నిర్మించాలంటాడు…! కాకినాడ -వైజాగ్ కారిడార్ నిర్మించాలంటాడు! కానీ ఈయనకు రాయలసీమ లో కరువుకు నీళ్ళులేక అల్లాడుతున్న ప్రజల దుస్థితి పట్టదు పశువులకు […]పూర్తి వివరాలు ...
ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అధ్యక్షుడు అందరూ రాయలసీమ వాసులేనని, కానీ ఇక్కడి ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి ఆరోపించారు. జిల్లాకు వచ్చిన ఆయన ఆదివారం రాత్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన రాయలసీమలోనే రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సారవంతమైన మాగానిలో భూములను కొనుగోలు చేసి రాజధానిని నిర్మించడం వల్ల పచ్చని పంటపొలాలను పోగొట్టుకుంటామన్నారు. రాయలసీమలో గడ్డికూడా మొలవని భూములున్నాయని చెప్పారు. ఒక నాడు మద్రాసు […]పూర్తి వివరాలు ...
నగరంలోని సీపీ బ్రౌన్ లైబ్రరీలో జులై 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ‘కడప జిల్లా భవిష్యత్? ‘ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు నిర్వహించనున్నామని జనవిజ్ఞానవేదిక (జవివే) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక సీపీ బ్రౌన్ లైబ్రరీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, డాక్టర్ గేయానంద్‌లు సదస్సుకు ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు. ఉపన్యాసకులుగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ గోపాల్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ […]పూర్తి వివరాలు ...
ఆంద్రుల స్మృతి పథంలో చెరగని ముద్ర వేసిన ముగ్గురు ఈస్టిండియా కంపెనీ అధికారులలో థామస్ మన్రో ఒకరు. ఈయన 1761 మే 27వ తేదీన ఇంగ్లండ్‌లోని గ్లాస్‌కోలో జన్మించారు. ఇతని తండ్రి అలెగ్జాండర్ మన్రో ఒక వర్తకుడు. థామస్ మన్రో గ్లాస్‌కో విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఈస్టిండియా కంపెనీలో మిలిటరీ ఉద్యోగం కొరకు తన పంతొమ్మిదో ఏట అనగా 1780 జనవరిలో 15న మద్రాసుకు వచ్చాడు. అదే సమయంలో హైదరాలీ, టిప్పుసుల్తాన్‌లతో జరిగిన రెండు, మూడు […]పూర్తి వివరాలు ...
రాయలసీమ అనే పేరు చెప్పడానికి నాయకులు భయపడుతున్న పరిస్థితి దాపురించడం హేయంగా ఉందని కేతువిశ్వనాథరెడ్డి అన్నారు. గురువారం స్థానిక సీపీబ్రౌన్ భాషాపరిశోధనకేంద్రంలో జరిగిన మాచిరెడ్డి వెంకటస్వామి స్మారకోపన్యాసాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తాగునీరు, సాగునీరు, విద్యాప్రయోజనాలు కలిగించే ప్రాజెక్టు రూపకల్పన, నగరాభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ వంటి మాటలు నాయకుల నోటి రాకపోవడం బాధకరంగా ఉందన్నారు. రాయలసీమ పౌరసమాజం చైతన్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. సీమ సమాజవికాసం కోసం స్థబ్దుగా ఉన్న పౌరులను చైతన్యం వైపు […]పూర్తి వివరాలు ...
ఆంధ్ర రాష్ట్రంలో అతి ప్రాచీన చరిత్ర కలిగిన జిల్లాలలో కడప ఒకటి. సీడెడ్ జిల్లాలుగా పిలువబడే రాయలసీమ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. రాక్షస తంగడి యుద్ధం తరువాత గోల్కొండ నవాబుల ఆధీనంలోకి పోయింది. తరువాత హైదరాలీ, టిప్పుసుల్తాన్ ఆధీనంలోకి వచ్చింది. 1792లో టిప్పు ఓడిపోయి శ్రీరంగపట్టణము సంధి వలన ఈ రాయలసీమ నైజాంకు వెళ్లింది. హైదరాబాదు నవాబుతో ఈస్టిండియా కంపెనీ వారు సైన్య సహకార పద్ధతి ద్వారా అక్టోబర్ 20, 1800 సంవత్సరములో సీడెడ్ […]పూర్తి వివరాలు ...
సీమ సినుకయ్యింది ముసురు మొబ్బయ్యింది దారి ఏరయ్యింది ఊరు పోరయ్యింది సినుకు సినుకే రాలి సుక్క సుక్కే చేరి ఊరి వంకై పారి ఒక్కొక్కటే కూరి పెన్నేరుగా మారి పోరు పోరంట ఉంది పోరు పెడతా ఉంది సీమ సినుకయ్యింది ముసురు మొబ్బయ్యింది దారి ఏరయ్యింది ఊరు పోరయ్యింది మెడలు వంచాలంది మడవ తిప్పాలంది మడమ తిప్పకు అంది తడవ మనదే అంది కడవ పగలాలంది అడుగు మడుగయ్యింది గొడవ దడి చేరింది సీమ సినుకయ్యింది ముసురు […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాకు కలెక్టర్ గా నియమితులైన కే.వీ. రమణ గారిని ఒక పాత్రికేయ మిత్రుడు అడిగిన ప్రశ్న చూడండి. ప్ర: రాయలసీమలో తొలిసారిగా పనిచేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనగలరా? స: మొదటి నుంచి కోస్తా, తెలంగాణ జిల్లాల్లో నా సర్వీసు అంతా కొనసాగింది. 2000 సంవత్సరంలో సత్యసాయిబాబా 75వ జన్మదిన వేడుకల సమయంలో రెండున్నర నెలలపాటుఅనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓఎస్డీగా పనిచేశాను. అది మినహా రాయలసీమలో ఎక్కడా పని చేయలేదు. అధికారులు, ప్రజలతోపాటు, పార్టీలతో సంబంధం లేకుండా […]పూర్తి వివరాలు ...
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని కడప జిల్లా కొత్త కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. సోమవారం జాయింట్ కలెక్టర్ రామారావు నుంచి ఆయన కడప జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2003 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్ రమణకు జాయింట్ […]పూర్తి వివరాలు ...