వార్తా విభాగం

వార్తలు

‘మాకొక శ్వేతపత్రం కావలె’ – డాక్టర్ గేయానంద్

శ్వేతపత్రాల తయారీలో తలమునకలుగా ఉన్న తెదేపా ప్రభుత్వం రాయలసీమ కోసం ఏమి చేయాలనుకుంటున్నదో ఒక శ్వేతపత్రం ప్రకటించాలని శాసనమండలి సభ్యుడు డాక్టర్ గేయానంద్ డిమాండ్ చేశారు. సీమలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం కనీసం వచ్చే అయిదేళ్లలో రూ.30వేల కోట్లు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్ గేయానంద్ ఉద్ఘాటించారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ కంటే మెరుగైన ప్యాకేజీ ఈ ప్రాంతానికి అవసరమన్నారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని కేంద్రం ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలో సీమలోని […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

రంజాన్ సందడి మొదలైంది!

కడప: ఆదివారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో జిల్లాలో ముస్లింలందరూ సంతోషంతో రంజాన్ సన్నాహాలు ప్రారంభించారు. చంద్రోదయం అయిందని అందరికీ తెల్పుతూ మసీదుల వద్ద నిర్వాహకులూ, భక్తులూ, ముస్లిం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు టపాసులు పేల్చారు. మసీదుల్లో  ఇప్పటికే నిర్వాహకులు ఉపవాస దీక్షలు చేపట్టనున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.  సోమవారం నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి. ప్రతి ఒక్కరూ అల్లాహ్ ఆదేశానుసారం రోజా (ఉపవాసం) ఉంటూ ఆయన చూపిన మార్గంలో పయనించడానికి శక్తి […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

రోడ్డెక్కిన వైకాపా శాసనసభ్యులు

జమ్మలమడుగు: తెదేపా ప్రభుత్వం చౌకదుకాణాల డీలర్లపై తప్పుడు కేసులు బనాయించిందని, ఎలాంటి విచారణ లేకుండానే ఏకపక్షంగా తొలగించిదంటూ జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం వైకాపా శాసనసభ్యులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ముద్దనూరు రోడ్డుపై రెండు గంటల పాటు భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రజలకు, వైకాపా కార్యకర్తలకు అన్యాయం జరిగితే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తామని శాసనసభ్య్లులు ఆదినారాయణరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జయరాముడు, అంజద్‌బాషా, ఎమ్మెల్సీ […]పూర్తి వివరాలు ...

వార్తలు

కమనీయం… కోనేటిరాయుని కళ్యాణం

వీరబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవర ణలో ఆదివారం అంగరంగ శ్రీనివాసుని కల్యాణం కన్నుల పండువగా జరిగింది. తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు, వేదపండితుల వేదమంత్రోచ్చారణల మధ్య కోనేటిరాయుని కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తుల గోవిందనామస్మరణలతో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం పులకించింది. కల్యాణానికి ముఖ్యఅతిధులు గా ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, జాయింట్ కలెక్టర్ రామారావులు హాజరయ్యారు. కార్యక్రమంలో తిరుమల, తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

వీరబల్లిలో ఈపొద్దు ఏడుకొండలరాయుడికి పెళ్లి

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని తితిదే ఆధ్వర్యంలో ఆదివారం వీరబల్లిలో వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు వీరబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం వేదిక కానుంది. ఇందుకు సంబంధించి తిరుమల, తిరుపతి దేవస్థాన కల్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, అనంతరం అన్నప్రసాదాలు, అమ్మవారి కుంకుమ, పసుపు పంపిణీ చేయనున్నట్లు తితిదే ఎస్ఈ రామచంద్రారెడ్డి, కల్యాణ ప్రాజెక్టు ఎస్ఓ రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీనివాస […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

జమ్మలమడుగు ఎమ్మెల్యేని అరెస్టు చేశారు

కౌన్సిలర్లను దూషించిన కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డిని శనివారం సాయంత్రం ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్ లో లొంగిపోయినట్లు సీఐ కేశవరెడ్డి తెలిపారు. అనంతరం పూచీకత్తుపై స్టేషన్‌లోనే బెయిల్ ఇచ్చి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో కౌన్సిలర్లను దూషిస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఐపీసీ సెక్షన్ 153, 504, 506ల క్రింద ఎర్రగుంట్ల పోలీసులు ఎమ్మెల్యే, మరో అయిదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

రాయలసీమ బిడ్డలారా.. ఇకనైనా మేల్కోండి

ఏనాడు చేసుకున్న సుకతమో ఫలించి, ఊహాతీతమైన చారిత్రక మలుపుతో, ఇన్నేళ్లుగా మనల్ని ముంచిన విశాలాంధ్ర విచ్ఛిన్నమయింది. శ్రీబాగ్ ఒడంబడిక మూలం గా నాడు రాయలసీమ వాసులకు కోస్తాంధ్ర నాయకులు ఒట్టేసి రాయించిన హమీలకు ప్రాణమిచ్చే భౌగోళిక స్వరూపం తిరిగి తెలుగునాడుకు ఏర్పడింది. తొలి బస్సు మిస్సయ్యాం. మిగిలిపోయిన రెండో బస్సునైనా అందుకోకుంటే సర్కార్ జిల్లాల ఉక్కుపాదం కింద మన జీవితం నలిగిపోవడం ఖాయం. వాళ్ళ సహవాసం ఇదివరకే చవిచూసినవాళ్ళం. తాగునీటి కోసం, సాగునీటి కోసం, బడుగు జీవితాల […]పూర్తి వివరాలు ...

చరిత్ర

కడప జిల్లా శాసనాలు 1

తెలుగు శాసనాలను గురించి మాట్లాడేటప్పుడు తెలుగు భాషకు తొలి అక్షరార్చన కడప జిల్లాలో జరిగిందనే విషయాన్ని తప్పనిసరిగా స్మరించుకోవలసి ఉంటుంది. ఇప్పటివరకు లభించిన తెలుగు శాసనాల్లో రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శాసనం మొట్టమొదటిది. ఈ రాజుదే ఇంకొక శాసనం ఎర్రగుడిపాడులో కూడా లభించింది. శాస్త్రాన్ని బట్టి ఈ శాసనాలు క్రీ.శ.575 ప్రాంతానికి చెందినవిగా నిర్ణయించబడ్డాయి. ప్రాచీన తెలుగు శాసనాల్లో ఎక్కువభాగం రేనాటి చోళులవే కావడం వల్ల ప్రాచీనాంధ్ర భాషా స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ శాసనాలే […]పూర్తి వివరాలు ...

వార్తలు

రాజధాని కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

రాజధానిని సీమలో ఏర్పాటుచేయడమనేది డిమాండు కాదని, తమ హక్కు అని రాయలసీమ విద్యార్థి వేదిక నినదించింది. రాజధాని విషయం కోస్తా నాయకులు, వారికి వంత పాడుతున్న సీమ ఏలికల కుట్రలను ప్రతిఘటిస్తామని విద్యార్థులు నినదించారు. సీమ మరోసారి నష్టపోకుండా రాజధానిని ఇక్కడే ఏర్పాటుచేయాలని, లేదంటే విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రతిఘటన తప్పదని విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని ఐటీఐ కూడలి నుంచి కోటిరెడ్డి కూడలి వరకూ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎస్ఎఫ్ కన్వీనరు భాస్కర్, […]పూర్తి వివరాలు ...

error: