రాజధాని వాడికి రాళ్ళ గంప మనకు సాగు నీళ్ళు వాడికి కడగండ్లు మనకు స్మార్ట్ సిటీలు వాడికి చితి మంటలు మనకు వాటర్ బోర్డ్ వాడికి పాపర్ బ్రతుకులు మనకు ఎయిమ్స్ వాడికి ఎముకల గూల్లు మనకు అన్నపూర్ణ వాడికి ఆకలి చావులు మనకు పోలవరం వాడికి కరువు శాపం మనకు యూనివర్సిటీలు వాడికి యురేనియం సావులు మనకు కాసుల పంట వాడికి మాసిన సదువు మనకు కనక వర్షం వాడికి కూనీ సంస్కృతి మనకు ఉండేదంతా […]పూర్తి వివరాలు ...
కడప విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి ఈనాడు దినపత్రిక ఇవాల్టి కడప టాబ్లాయిడ్లో ఒక కధనాన్ని ప్రచురించింది. ఆ కధనం ప్రకారం … జులై 2న కడప విమానాశ్రయంలో విమానాలు దిగనున్నాయి. ఢిల్లీ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. విమానాశ్రయ సంబంధిత ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రారంభ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఇదివరకు కూడా ఈనాడు, సాక్షి దినపత్రికలు ఇదే మాదిరి కధనాలను చాలా సార్లు ప్రచురించాయి. గత సంవత్సరం […]పూర్తి వివరాలు ...
వైకాపా అధినేత జగన్ ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లతో గురువారం నగరంలోని వైఎస్ గెస్ట్ హౌస్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి కార్పొరేటర్‌ను పరిచయం చేసుకున్నారు. సమావేశానికి వచ్చిన కార్యకర్తలను పలకరిస్తూ వారికి ధైర్యం చెపుతూ కన్పించారు. వచ్చిన వారందరితో బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసి, ఫొటోలు దిగారు. ప్రతి కార్యకర్త చెప్పే మాటలను వింటూ ఎంపీ అవినాష్ ఉన్నాడు… ఎమ్మెల్యేలు అంజాద్‌బాష, రవిరెడ్డి, సురేష్‌బాబులు ఉన్నారంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం […]పూర్తి వివరాలు ...
కడప: రాష్ట్ర రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ రాజధాని సాధన సమితి కార్యకర్తలు బుధవారం ఆర్టీసీ బస్టాండు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు ఎం.నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సీపీఎం మినహా అన్ని పార్టీలు సమ్మతి తెలిపాయన్నారు. 1956కు ముందున్న మాదిరి తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించారని.. దీంతో ముఖ్యంగా రాయలసీమ వాసులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినపుడు 1956కు ముందున్న విధంగా ఆంధ్రప్రదేశ్ […]పూర్తి వివరాలు ...
వైకపా అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నుంచి నాలుగు రోజులపాటు జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కడప, బద్వేలు ప్రాంతాల్లో జరగనున్న కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారన్నారు. శుక్ర, శని, ఆదివారాలు కూడా జిల్లాలోనే ఉంటారని పేర్కొన్నారు.పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో సినిమా షూటింగ్ ల సందడి పెరుగుతోంది. ఇప్పటికే పలు తమిళ, కన్నడ చిత్రాలు గండికోట పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోగా తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గుర్రప్పనికొట్టాలలో (మైలవరం మండలంలోని లింగాపురం పంచాయతీ) తమిళ సినిమా ‘కత్తి’ చిత్రీకరణ జరుగుతుండడంతో సందడి నెలకొంది. తమిళంలో అగ్రకధానాయకుడు విజయ్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం హీరో విజయ్‌పై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రీకరణ కోసం పలు సెట్టింగులు వేశారు. కరవుతో అల్లాడుతున్న […]పూర్తి వివరాలు ...
రాయలసీమలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలనే నినాదంతో పోరాటాన్ని ఉద్ధృతం చేసి, అన్నివర్గాల మద్దతుతో ముందడుగు వేస్తామని డాక్టరు పద్మలత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీరోడ్డులోని బాలాజీ వైద్యాలయంలో మంగళవారం రాయలసీమ రాజధాని సాధన కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పద్మలత మాట్లాడుతూ.. ఉద్యమ్యాన్ని ముందుకు నడిపించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, వ్యాపార, ప్రజా సంఘాల మద్దతు తీసుకుని ముందడుగు వేస్తామని వివరించారు. గతంలో కర్నూలులో రాష్ట్ర రాజధాని ఉండేది […]పూర్తి వివరాలు ...
కమలాపురం శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం 15 మంది అభ్యర్థులు తుదిపోరులో నిలుచున్నారు. ఇక్కడ వైకాపా తరపున బరిలోకి దిగిన పోచంపల్లి రవీంద్రనాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్ధి, తెదేపా – భాజపా ల ఉమ్మడి అభ్యర్థీ అయిన పుత్తా నరసింహారెడ్డి పై సుమారు ఐదు వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. తుదిపోరులో తలపడిన అభ్యర్థులకు దక్కిన […]పూర్తి వివరాలు ...
“ఆ మిణుగురు దారి పొడవునా వెలుతురు పువ్వుల్ని రాల్చుకుంటూ వెళ్ళిపోయింది. పదండి, ఏరుకుంటూ ముందుకెళదాం..” కామ్రేడ్ ఎం.జె కోసం ఒక కవి మిత్రుడి కలం నుండి మెరిసిన అక్షర నివాళి. ఇవి ఆయన జీవితానికి అద్దం పట్టే పదాలు. ఎంజెగా రాయలసీమలో సుపరిచితులైన ములపాకు జంగంరెడ్డి సుబ్బరామిరెడ్డి తన జీవితమంతా వ్యవస్థతో గొడవ పడుతూ ఈ ఆగస్టు 2న (తన 62వ ఏట) శాశ్వత విశ్రాంతికిలోకి వెళ్ళిపోయాడు. చేతిలో సంచి, మాసిన గడ్డం, అడ్డపంచె, భుజంపై ఎర్ర […]పూర్తి వివరాలు ...