కడప: నగరాన్ని క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దుతామని నగరమేయర్ సురేష్‌బాబు అన్నారు. స్థానిక వైఎస్సార్ ఇండోర్ స్టేడియం ఆవరణలో సోమవారం ఈతకొలను(స్విమ్మింగ్‌ఫూల్) నిర్మాణానికి నగర మేయర్ సురేష్‌బాబు, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు సీఆర్ఐ సుబ్బారెడ్డి, డీఎస్‌డీవో బాషామొహిద్దీన్, ఎన్ఆర్ఐ ట్రస్ట్ ఛైర్మన్ తోట కృష్ణ, కేవీఆర్ నిర్మాణరంగ సంస్థ అధినేత కె.విశ్వనాథరాజు తదితరులు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ ఈతకొలను నిర్మాణానికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. దాతల సహకారంతో ఈ మొత్తాన్ని […]పూర్తి వివరాలు ...
కడప విమానాశ్రయం ఈనెల 14న ప్రారంభం కానుందని ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందిందని ఒక దినపత్రిక ఇవాళ కథనాన్ని ప్రచురించింది. నగరం నుండి విమానాశ్రయానికి దూరాన్ని సూచిస్తూ సూచికలు ఏర్పాటు చేయటం కూడా ఇందుకు నిదర్శమని ఆ పత్రిక పేర్కొంది. ఆ కథనం ప్రకారం ‘విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను చేపట్టాలని విమానాశ్రయ అధికారులను జిల్లా కలెక్టర్ సూచించినట్లు కూడా సమాచారం. జిల్లా కలెక్టరుకు ప్రభుత్వం నుంచి విమానాశ్రయం 14న ప్రారంభించనున్నట్లు మౌఖిక సమాచారం అందినట్లు తెలుస్తోంది. […]పూర్తి వివరాలు ...
వర్గం: కలుపు పాట పాడటానికి అనువైన రాగం: సావేరి స్వరాలు (ఏకతాళం) దాయాదుల కారణంగా కొడుకు వ్యసనాలు మరిగి చివరకు జైలు పాలయినాడు. సర్కారోల్లు ఇంటికొచ్చి కొడుకుకు బేడీలు వేసి తీసుకుపోవటంతో అవమానపడిన ఆ తల్లి బాధతో రగిలిపోయింది. ఆ తల్లి బాధను జానపదులు ఇలా పాటగా పాడినారు.. నగుమాసం నినుమోసి నినుకంటిరో నా కొడకో నాకగుమానం సేస్తివిరో నా బాలనాగయో దాయాదుల దోవలోన పోవద్దంటే ఇనకపోతివిరో ఆరి కూతలు ఇని సెడితివి నా బాలనాగయో సారాయి […]పూర్తి వివరాలు ...
రాజంపేట: కడప జిల్లాలో ప్రభుత్వం 30వేల పింఛన్‌లు తొలగించిందని వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆరోపించారు. రాజంపేటలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్ని మభ్య పెట్టేందుకే ప్రభుత్వం జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చిందని పేర్కొన్నారు. జన్మభూమికి కేటాయించిన నిధులు మంత్రులు, అధికారులు తిరిగేందుకే సరిపోతాయన్నారు. రుణమాఫీ అంటూ రైతులను, డ్వాక్రా మహిళలలను బురిడీ కొట్టించారన్నారు. ఎన్నో ఆశలతో అధికారంలో కూర్చోబెట్టిన జనాన్ని నట్టేట ముంచడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పని […]పూర్తి వివరాలు ...
కడప: భవిష్యత్‌లో కడప జిల్లా కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో ఈత పోటీలు నిర్వహించడానికి వీలుగా అన్ని సదుపాయాలతో కూడిన ఈతకొలనును వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న ట్టు నగర మేయర్ కె. సురేష్‌బాబు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు సీఆర్ఐ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఈతకొలను నిర్మాణ పనులు చేపట్టడానికి సోమవారం ఉదయం ఇండోర్ స్టేడియం ప్రాంగణలో భూమి పూజ చేపట్టనున్నారు. ఇందుకు సంబందించి ఆదివారం మేయర్ సురేష్‌బాబు, సీఆర్‌ఐ […]పూర్తి వివరాలు ...
జన్మభూమి గ్రామసభల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 12, 13వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. ఆదివారం స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామసభల్లో కడప జిల్లాపై వరాలజల్లును కురిపిస్తారని మంత్రి చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, టెక్స్‌టైల్ పార్కు, గాలేరు-నగిరి ప్రాజెక్టు, రైల్వేలైన్ల నిర్మాణం చేపడతామన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో కడప జిల్లా ముఖచిత్రమే మారిపోనుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లను అందిస్తామన్నారు. 27 వేల పెన్షన్లపై […]పూర్తి వివరాలు ...
ఇందరికి నభయంబు లిచ్చుచేయి కందువగు మంచి బంగారు చేయి॥ వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి చిలుకు గుబ్బలికింద చేర్చు చేయి కలికి యగు భూకాంత కౌగిలించినచేయి వలనైన కొనగోళ్ళ వాడిచేయి॥ తనివోక బలిచేత దానమడిగిన చేయి ఒనరంగ భూదానమొసగు చేయి మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చినచేయి ఎనయ నాగేలు ధరియించు చేయి॥ పురసతుల మానములు పొల్లసేసినచేయి తురగంబుబరపెడి దొడ్డచేయి తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి॥పూర్తి వివరాలు ...
వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: హిందుస్తాని తోడి రాగస్వరాలు (ఆదితాళం) అందమైన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పడుచు. అందుకే బావ చీరెలూ, సొమ్ములూ తెచ్చిస్తానని సెప్పినా వద్దంటుంది ఆ మరదలు పిల్ల. ఆ మరదలు పిల్ల మనసులోని మాటను జానపదులు ఇలా పాటలా పాడుకుంటారు… సీరెల్ కావలెనా – రయికల్ కావలెనా నీకేం కావాలనే మైదుకూరు సంతలోనా సీరల్ నా కొద్దురో – రయికల్ నా కొద్దురో […]పూర్తి వివరాలు ...
బొబ్బిళ్ళ నాగిరెడ్డి గడేకల్లులో వెలసిన భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఇతడు శ్రీమంతుల ఇల్లు దోచి బీదలకు పంచి పెట్టేవాడట. పట్టపగలు నట్ట నడివీధిలో ప్రత్యర్ధులు నాగిరెడ్డిని హతమార్చినారుట. ఆ సంఘటనను జానపదులు ఇలా పాటగా పాడినారు… చుట్టూ ముట్టూ పల్లెలకెల్ల శూరుడమ్మ నాగిరెడ్డి డెబ్బై ఏడు పల్లెలకెల్లా దేవుడమ్మా భీమలింగ రామ రామా కోదండరామా భై రామ రామా కోదండరామా పక్కనున్న పల్లెలకెల్ల పాలెగాడు నాగిరెడ్డి దిక్కుదిక్కుల పల్లెలకెల్ల దేవుడమ్మ భీమలింగ ||రామ|| మోపిడీ […]పూర్తి వివరాలు ...