వార్తా విభాగం

ప్రసిద్ధులు సంకీర్తనలు

అన్నమయ్య కథ (రెండో భాగం)

పాము కరవలేదు సరికదా! ఎదురుగ చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది.”ఎందుకు బాబు ఈ అఘాయిత్య?. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు, తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు” అని చింతలమ్మ బాలుని చింత తీర్చి అదృశ్యమైంది. అమ్మ చెప్పినట్లు నారాయాణయ్యకు చెన్నకేశవస్వామి దయవల్ల అన్ని విద్యలూ సిద్ధించాయి. […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ప్రొద్దుటూరులో 6వేలమందితో జాతీయ గీతాలాపన

ప్రొద్దుటూరు: జయహో జనగణమన చతుర్థ వార్షికోత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరు అనిబిసెంట్ పురపాలక ఉన్నత పాఠశాల  ఆవరణంలో ఆదివారం వివిధ విద్యాసంస్థలకు చెందిన ఆరు వేలమంది విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. 1911 డిసెంబరు 27వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని రచించి ఆలపించిన సందర్భంగా అందరిలో ఐక్యతాభావం, జాతీయతా భావం, దేశభక్తిని పెంపొందించేందుకు, మహనీయులను స్మరించుకునేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సుమారు 6 వేల మంది విద్యార్థులు మైదానానికి చేరుకున్నారు. మాజీమున్సిపల్ […]పూర్తి వివరాలు ...

వార్తలు

లెజెండ్‌ సినిమా చేయడం పూర్వజన్మ సుకృతం

ప్రొద్దుటూరు: లెజెండ్‌ సినిమా చేయడం తన పూర్వ జన్మ సుకృతమని హిందూపురం శాసనసభ్యుడు, కథా నాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. చలనచిత్ర సీమలో లెజెండ్‌ సినిమా ఒక లెజెండ్‌గా మిగిలిపోతుందన్నారు. లెజెండ్‌ చలనచిత్రం  275 రోజులు ప్రొద్దుటూరులోని అర్చనా థియేటర్‌లో ప్రదర్శింపబడిన నేపధ్యంలో విజయోత్సవ సభను ఆదివారం స్థానిక  రాయల్‌ కౌంటీ రిసార్ట్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌తో కలిసి వచ్చిన బాలకృష్ణ మాట్లాడుతూ నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చిత్రానికి అన్ని సదుపాయాలు కల్పించారన్నారు. […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

నాలుగోసారి పార్టీ మారనున్న కందుల సోదరులు

కడప: ప్రస్తుతం వైకాపాలో ఉన్న కందుల సోదరులు భాజపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వీరు భాజపా నేతలతో జరుపుతున్న చర్చలు కొలిక్కి వచ్చినట్లు మీడియాలో కధనాలు వెలువడ్డాయి. కందుల రాజమోహన్‌రెడ్డి ఆ పార్టీ ముఖ్యనేతతో భేటీ అయ్యి, చేరిక తేదీని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. జనవరి 9వ తేదీన విజయవాడకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారు. ఆయన సమక్షంలో చేరేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ అది కుదరకపోతే 18వ తేదీన కడప నగరంలో […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు సంకీర్తనలు

అన్నమయ్య కథ (మొదటి భాగం)

అదిగో తెలుగు తల్లి తన కన్నబిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ పాడుతూంది. “చందమామ రావో జాబిల్లి రావో,మంచి కుందనంపు పైడికోర వెన్నపాలు తేవో” ఈ చందమామ పాట వ్రాసిందెవరో తెలుసా! తాళ్లపాక అన్నమాచార్యులు/అన్నమయ్య – వేంకటేశ్వరస్వామికి గొప్ప భక్తుడు; మహా కవి. మన తెలుగులో తొలి వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడంటే పాటలు స్వయంగా వ్రాసి పాడేవాడని అర్ధం. వేంకటేశ్వరుడు, అన్నమయ్య మేలుకొలుపు పాట పాడుతూంటే విని నిద్రలేచేవాడు. మళ్ళీ ఆయన జోలపాట పాడందే నిద్రపోడు. స్వామికే గాదు అమ్మవారికి కూడ […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

ముఖ్యమంత్రి సుముఖంగా లేరు

రాయలసీమ అభివృద్ధిపై వివక్ష రాష్ర్టానికి, జిల్లాకు ఒరిగిందేమీ లేదు టీడీపీకి ఎక్కువ స్థానాలు రాలేదన్న అక్కసుతోనే ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదు ఎర్రచం’ధనం’ సీమ కోసం ఖర్చు చేయాల కడప: రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివక్ష చూపుతున్నారని శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఈ రోజు (శుక్రవారం) స్థానిక కాంగ్రెస్‌ పార్టీ (జిల్లా) కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లాలో స్టీలు ప్లాంటు ఏర్పాటు […]పూర్తి వివరాలు ...

వార్తలు

గండికోటలో మళ్ళా చిరుత పులి పంజా విసిరింది

గండికోట: గండికోటలో మళ్ళా చిరుత పులి పంజా విసిరింది. కోట పరిసరాల్లో తిరుగుతూ గత కొద్దినెలలుగా ఎటువంటి దాడులూ చేయకుండా నిశ్శబ్దంగా ఉండిన చిరుతపులి(లు) శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి ఎనిమిది గొర్రెలను చంపింది. చిరుత సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకుముందు కూడా చిరుత ఇలాగే గొర్రెల మీద దాడి (జత చేసిన చిత్రం అప్పటిదే) చేసింది. దాంతో గత సెప్టెంబరు నెలలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఒకటిన్న సంవత్సరం […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఆదివారం ప్రొద్దుటూరుకు బాలయ్య

కడప: లెజెండ్ చిత్ర విజయోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు నందమూరి బాలకృష్ణ ఆదివారం (28న)  ప్రొద్దుటూరుకు రానున్నారు.  ఈ మేరకు గురువారం స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పి.కృష్ణమూర్తి, ఎస్.గోవర్ధన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. లెజెండ్ చిత్ర విజయోత్సవ వేడుకలకు  వేడుకలకు నందమూరి బాలకృష్ణ అభిమానులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు.పూర్తి వివరాలు ...

రాజకీయాలు

దేవినేని ఉమకు వైఎస్ జగన్ ఫోన్

కడప : వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు గురువారం ఫోన్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్  నుంచి గండికోట వరకు పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. గండికోట ముంపు ప్రాంతాల సమస్య తీర్చాలని, పులివెందుల బ్రాంచి కెనాల్కు తాగు, సాగు నీటిని వెంటనే విడుదల చేయాలన్నారు. గురువారం పులివెందులలోని ఇంట్లో నుంచి వైఎస్ జగన్‌రెడ్డి సాగునీటి శాఖ మంత్రి […]పూర్తి వివరాలు ...

error: