కడప: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురువారం కడపకు వచ్చాడు. దర్శించుకున్నారు. నగరంలోని అమీన్‌పీర్ దర్గా (పెద్ద దర్గా)లో జరిగిన ఖ్వాజా సయ్యద్ అమీనుల్లా మహ్మద్ మొహమ్మదుల్ చిష్టిపుల్ ఖాదిరి ఉరుసు ఉత్సవాల్లో చివరిదైన తహలీల్ ఫాతేహా కార్యక్రమంలో రహమాన్ పాల్గొన్నారు. అనంతరం పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో చదివింపుల కార్యక్రమం ఉదయం 6 గంటలకు నిర్వహించారు. తహలీల్ ఫాతేహా చదివింపుల కార్యక్రమంతో ఉరుసు ఉత్సవాలు గురువారంతో ముగిశాయి.పూర్తి వివరాలు ...
కడప: శ్రీదేవి భూదేవిలతో దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం గురువారం వైభవంగా జరిగింది. స్వామి జన్మనక్షత్రం శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారి కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణల నడుమ కడపరాయని కల్యాణం కన్నుల పండువగా సాగింది. అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారి కల్యాణం చూసి తరించినారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.పూర్తి వివరాలు ...
మేడిదిన్నెకు కరణంగా ఉండిన ప్రధమలు చంచురాజు అనే ఆయన ఈ కైఫీయత్ ను రాయించినాడు. చిన్న పసుపుల గ్రామానికి దగ్గర్లో పూర్వం ఎత్తైన స్థలం (దిన్నెలేదా గడ్డ)లో ఒక పెద్ద మేడి (అవుదుంబర) చెట్టు ఉండేదట. కొన్నాళ్ళకు ఆ మేడిచెట్టు ఉన్నటువంటి దిన్నె మీద ఒక ఊరు ఏర్పడిన తరువాత ఆ ప్రాంతము మేడిదిన్నెగా వాడుకలోనికి వచ్చినది. పూర్వము నుంచీ ఈ ప్రాంతం ఉదయగిరి రాజ్యంలో భాగమైన గండికోట సీమలో భాగంగా ఉండేదిట. ఇలా ఉండగా కృష్ణదేవరాయలు […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి దేవళంలో బుధవారం ఉదయం అన్నమయ్య సంకీర్తనల టీవీ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆలయ రంగమంటపంలో కొలువరో మొక్కురో.. అనే అన్నమయ్య సంకీర్తనను ఆలపించే దృశ్యాన్ని దర్శకుడు ప్రతాప్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిపై తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనలను దృశ్య రూపంలో చిత్రీకరిస్తున్నామన్నారు. షూటింగ్ పూర్తయ్యాక ఈ టెలీ ఫిలింను శ్రీవారి పాదాల చెంత వుంచి టీటీడీకి అందజేస్తామన్నారు. అంతకుముందు యూనిట్ సభ్యులు స్వామిని […]పూర్తి వివరాలు ...
రాష్ట్రంలో కరువు పరిస్థితులపై చర్చ నేపధ్యంలో రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి జిల్లా స్థితిగతుల్ని వివరించారు. అనంతపురం జిల్లాలో కరువును దృష్టిలో ఉంచుకుని మెట్ట భూములు పదెకరాలు ఉన్నా పెన్షన్‌కు అర్హులుగా ప్రకటించారన్నారు. అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్న వైఎస్సార్ జిల్లాకు కూడా ఆ అవకాశం కల్పించాలన్నారు. వైఎస్‌ఆర్ జిల్లాలో సగటు వర్షపాతం 50 శాతంకు మించి నమోదు కాలేదని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెన్షన్ల మంజూరులో అనంతపురం జిల్లా మాదిరిగా వెసులుబాటు […]పూర్తి వివరాలు ...
కడప: ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి శైలి విలక్షణమని విమర్శల్లో రాచమల్లు తరువాత రాచపాళెం అని జిల్లా సాహితీవేత్తలు కొనియాడారు. మన నవలలు, మన కధానికల పుస్తకానికి గాను చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా జిల్లా జనవిజ్ఞానవేదిక సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో అభినందన సభను నిర్వహించారు. ఇందులో భాగంగా జవివే కార్యదర్శి రఘునాధరెడ్డి, సాహితీ స్రవంతి అధ్యక్షుడు మస్తాన్‌వలి, సాహితీ వేత్తలు శశిశ్రీ, ఎంఎం వినోది ని తదితరులు రాచపాళెం సాహితీ […]పూర్తి వివరాలు ...
కడప: ఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఈ రోజు (బుధవారం, డిసెంబరు 23) సాయంత్రం స్థానిక సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో జనవిజ్ఞానవేదిక – సాహితీస్రవంతిల ఆధ్వర్యంలో అభినందన సభ జరగనుంది. ఈ సభలో రచయిత శశిశ్రీ, యోవేవి తెలుగు విభాగపు సమన్వయకర్త ఆచార్య వినోదిని ఉపన్యసిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి జరిగే ఈ సభకు సాహితీ అభిమానులందరూ రావాలని జన విజ్ఞాన వేదిక […]పూర్తి వివరాలు ...
సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం భాద్యులు ఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి దంపతులను కడప జిల్లా అభ్యుదయ రచయితల సంఘం మంగళవారం సత్కరించింది. రాచపాలెం రాసిన ‘మన నవలలు – మన కథానికలు’ పుస్తకానికానికి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన నేపధ్యం అరసం స్థానిక సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో అభినందన సభను జరిపింది. ఈ సందర్భంగా అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యలు శ్రీమతి పి సంజీవమ్మ మాట్లాడుతూ రాచపాలెం సాహితీ […]పూర్తి వివరాలు ...
భాకరాపేట: రుణమాఫీ కాలేదని సిద్దవటం మండలంలోని భాకరాపేట భారతీయస్టేట్‌బ్యాంకు గేట్లు మూసివేసి సోమవారం ఉదయం రైతులు ఆందోళన చేశారు. ఇక్కడి బ్యాంకు శాఖలో దాదాపు 2728 మంది రైతులు పంట రుణాలు తీసుకోగా ఒక్కరికి కూడా మాఫీ కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు నుండి రుణాలు తీసుకున్న బొగ్గిడివారిపల్లె, పెద్దపల్లె, మేఘనాపురం పంచాయతీల పరిధిలో ఉన్న దాదాపు వంద మంది రైతులు బ్యాంకు వద్దకు చేరి నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికార సిబ్బందిని […]పూర్తి వివరాలు ...