నరులారా నేడువో నారసింహ జయంతి | సురలకు ఆనందమై శుభము లొసగెను || సందించి వైశాఖ శుద్ధ చతుర్దశీ శనివారం మందు సంధ్యాకాలమున ఔభళేశుడు | పొందుగా కంభములో పొడమి కడప మీద కందువ గోళ్ళ చించె కనక కశిపుని || నరమృగరూపము నానాహస్తముల అరిది శంఖచక్రాది ఆయుధాలతో గరిమ ప్రహ్లాదుని కాచి రక్షించి నిలిచె గురుతర బ్రహ్మాండ గుహలోనను || కాంచనపు గద్దెమీద గక్కున కొలువైయుండి మించుగ ఇందిర తొడమీద బెట్టుక | అంచె శ్రీవేంకటగిరి […]పూర్తి వివరాలు ...
పుస్తకాల సంచీ బీరువా కింద దాచేసి, సరాసరి వంటింట్లోకి వెళ్ళబోయి, అంతగా పరుగెత్తుకొచ్చినందుకు అత్తయ్య కోప్పడుతుందేమోనన్న విషయం గుర్తొచ్చి గుమ్మంలోనే ఆగిపోయి లోపలికి తొంగి చూశాడు శివు. రంగమ్మ రొట్టెలు చేస్తూంది. చాలా సేపట్నుంచీ పొయ్యిముందు కూర్చుని పనిచేయడం వల్ల ఆమె ముఖమంతా చెమటతో తడిసివుంది. నొసటి కుంకుమ కరిగి ముక్కుమీదుగా కారి చార ఏర్పడింది. ముఖంమీది చెమట బిందువులు పొయ్యి వెలుగులో కెంపల్లా మెరుస్తున్నాయి.పూర్తి వివరాలు ...
ఉప ఎన్నికల ఫలితాలపై ‘ఆ ముగ్గురికే పట్టం’ పేరుతొ కడప జిల్లా టాబ్లాయిడ్లో ఒక కధనాన్ని ప్రచురించిన ఈనాడు దినపత్రిక అందులో ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించింది. ఈనాడు కధనం ప్రకారం రాయచోటి, రాజంపేట, రైల్వేకొడూరులలో తెదేపా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్తులు ఓటుకు ఐదు వందలనుంది వెయ్యి రూపాయల వరకు పంపిణీ చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్తులు రెండు వందల రూపాయల చొప్పున పంపిణీ చేశారు. కాంగ్రెస్, తెదేపా అభ్యర్తులు బాగా నగదు పంపిణీ చేసినప్పటికీ ఓటర్లు […]పూర్తి వివరాలు ...
రాయచోతిలో అత్యధిక మెజారిటీ సాధించిన పార్టీగా వైకాపా రికార్డు సృష్టించింది. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి… టీడీపీ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యంపై 56,891 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. రాయచోటిలో కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. రాయచోటిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో సహా మొత్తం పోలైన ఓట్లు 1,59,201. అభ్యర్థికి ధరవతు రావాలంటే ఇందులో ఆరింట ఒక వంతు ఓట్లు అంటే 26,533 ఓట్లు దక్కాలి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి 25,344 […]పూర్తి వివరాలు ...
YSRCP – won 15 TDP – 00 Congress – won 02 Seats (Narsaapuram, Ramachandrapuram) TRS – won 01 పూర్తి వివరాలు ...
అధికార యంత్రాంగం మొత్తం వైకాపాకు అనుకూలంగా పనిచేశారని కడప జిల్లా కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు అనిల్ కుమార్ కు ఫిర్యాదు చేయడం విశేషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున డి.సి.సి అధ్యక్షుడు మాకం అశోక కుమార్ దీనికి సంబంధించి కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించడం ఆసక్తికరంగా ఉంది. జిల్లాలో మంగళవారం జరిగిన రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల ఉపఎన్నికల పోలింగ్‌లో పలువురు అధికారులు, ఉద్యోగులు ఏకపక్షంగా వ్యవహరించారని, ఆ మూడు నియోజకవర్గాల్లో అధికార […]పూర్తి వివరాలు ...
స్వల్ప సంఘటనలు మినహా వైఎస్సార్ జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంల ఏర్పాటులో తలమునకలయ్యారు. ఉదయం 8 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 10 గంటల సమయం తర్వాత ఊపందుకుంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్ల ఉత్సాహం కొనసాగింది. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. 2009 అసెంబ్లీ ఎన్నికల కంటే అధిక సంఖ్యలో ఓటర్లు ఈసారి […]పూర్తి వివరాలు ...
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలోని అభివృద్ధి పథకాలను సొంత జిల్లాకు తరలించుకుపోతున్నారు. ఈ విషయమై కడప జిల్లా కాంగ్రెస్ నేతలు మౌనం వహిస్తుండడం విశేషం. తరతరాలుగా వెనుకబాటుకు గురైన జిల్లాకు మంజూరైన ప్రాజెక్టులను చిత్తూరుకు తీసుకెళ్ళే బదులు ముఖ్యమంత్రి అక్కడికి కొత్త ప్రాజెక్టులను తీసుకువస్తే బాగుండేది. ఈ చర్యల వల్ల అంతిమంగా రాయలసీమ నష్టపోతుందన్నది నిర్వివాదాంశం. ఇదే విషయమై సాక్షి దినపత్రిక ఇవాళ ఒక కధనాన్ని ప్రచురించింది.పూర్తి వివరాలు ...
ఎట్టకేలకు సిబిఐ ఊహాగానాలకు తెరదించింది. కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ అరెస్టు చేసింది.ఈ మేరకు వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల సిబిఐ సమాచారం అందించింది. రేపు జగన్ కోర్టుకు హాజరు కావాల్సిన నేపధ్యంలో విచారణ పేరుతొ సిబిఐ జగన్ను అదుపులోకి తీసుకుంది. నా అరెస్టుకు రంగం సిద్ధమైన్దంటూ జగన్ చేస్తున్న ఆరోపణలను నిజమయ్యాయి. జగన్ అరెస్టు సమాచారాన్ని ముందస్తుగా అందుకున్న ప్రభుత్వమూ, పోలీసు శాఖ నిముషాల వ్యవధిలో భారీగా పోలీసు బలగాలను మోహరించింది.పూర్తి వివరాలు ...