Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మిక సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించినాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించినాడు. కడప గడపలో నడయాడిన ఆ భాగవతోత్తముడు దేవుని కడప […]పూర్తి వివరాలు ...
కడప : ప్రొద్దుటూరు పట్టణంలో నవంబరు 2వ వారంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (Science fair) నిర్వహించనున్నట్లు డీఈవో కె.అంజయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాదు ఎస్‌సీఈఆర్‌టీ డైరక్టర్ నవంబరు 2వ వారంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించాలని ఆదేశించారన్నారు. కావున ప్రధానోపాధ్యాయులందరూ వారి పాఠశాలల నుంచి ఒక ఉపాధ్యాయుడిని, ఇద్దరు విద్యార్థులను, ఒక ఎగ్జిబిట్‌తో పంపాలని కోరారు.పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: జిల్లా అభివృద్ధికి, తాగునీటి ఎద్దడి నివారణకు కావాల్సిన నిధులను మంజూరు చేయాలని జిల్లాలోని ముగ్గురు మంత్రులమయిన సీ.రామచంద్రయ్య, అహ్మదుల్లా, తాను ఎన్నో సార్లు కలిసి విన్నవించినా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించడంలేదని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు. తమిళనాడు గవర్నర్ రోశయ్యను కలిసేందుకు శుక్రవారం ప్రొద్దుటూరుకు వచ్చిన డీఎల్ ఈ మ్లేరకు విలేకరులతో మాట్లాడారు.పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారికి చేయించిన వజ్రకిరీట సంప్రోక్షణ కార్యక్రమంలో శుక్తరవారం తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. 10.50 గంటలకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రొద్దుటూరు చేరుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఇతర ప్రముఖులు ఆయనకు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు.పూర్తి వివరాలు ...
అక్టోబరు 26 నుంచి 28 వరకూ జిల్లాలో పర్యాటక ఉత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ‘గండికోట హెరిటేజ్’ ఉత్సవాల పేరిట గండికోటతోపాటు రాజంపేట, కడప నగరంలో కూడా మొత్తం మూడు రోజులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. పారంభ కార్యక్రమ వేడుకలకు ‘గండికోట’ వేదిక కానుంది. ఈ ఉత్సవాల నిర్వాహక ప్రత్యేక అధికారి జీఎన్ రావు ప్రారంభ వేడుకల్లో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, వృషభరాజాలు వగైరాలతో రాయల నాటి వైభవం గుర్తుకొచ్చేలా నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. పూర్తి వివరాలు ...
[divider](తవ్వా విజయ భాస్కర రెడ్డి, ఐ. ప్రవీణ్ కుమార్) తెలుగు సినీ పరిశ్రమలో అప్పటికీ , ఇప్పటికీ నటీనటుల అనుబంధాల్లో అనేక మార్పులు వచ్చాయని సీనియర్ నటి టిజి కమలాదేవి పేర్కొన్నారు. మారిన సినీ వాతావరణంలో తాను ఇమడలేకపోయానని, అందుకే క్రీడలపైనా, నాటకాల పైనా ఏకాగ్రత చూపానని ఆమె చెప్పారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘నా బాల్యం’ శీర్షిక కోసం కమలాదేవిని చెన్నైలోని ఆమె నివాసంలో కలిసినపుడు ఆమె తన బాల్య స్మృతులను ఇలా పంచుకున్నారు….పూర్తి వివరాలు ...
జీవో 233 రద్దుకు డిమాండ్ నంద్యాల : కర్నూలు – కడప సాగునీటి కెనాల్ (కేసీ) దుస్థితిపై ఆయకట్టు రైతులు గళమెత్తారు. గురువారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్య, కర్నూలు జిల్లా వరి ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కేసీ కెనాల్ సాగునీటి భవితవ్యంపై రైతు సదస్సు నిర్వహించారు. రైతుసంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి కర్నూలు, కడప జిల్లాలకు చెందిన వివిధ రైతు సంఘాల నాయకులు, రైతులు […]పూర్తి వివరాలు ...
కడప: వైఎస్సార్ కడప జిల్లాలో బృహత్ శిలాయుగం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. జిల్లాలోని సుండుపల్లె మండలం రాయవరం పంచాయతీ పరిధిలోని దేవాండ్లపల్లికి ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరంలో బృహత్ శిలాయుగం నాటి సమాధులు బయటపడ్డాయి. ఇవి క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాటివని భావిస్తున్నారు. దాదాపు 20 బృహత్ శిలాయుగం సమాధులను దేవాండ్లపల్లి వద్ద యోగివేమన విశ్వవిద్యాలయం అధ్యాపక బృందం గుర్తించింది. యోగివేమన విశ్వవిద్యాలయానికి చెందిన చరిత్ర, పురావస్తు, భూగర్భశాస్త్ర శాఖల ప్రొఫెసర్లు చాలా కాలంగా బృహత్ శిలాయుగం […]పూర్తి వివరాలు ...
అలనాడు కడప జిల్లాలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆంగ్ల ప్రామాణిక కొలతల స్థానంలో స్థానికమైన ప్రత్యేకమైన కొలతలు వినియోగించేవారు. ఆర్ధిక సరళీకరణలు/ప్రపంచీకరణ మొదలయ్యే (1991 ) వరకు కూడా జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈ స్థానిక కొలతలు వినియోగంలో ఉండేవి. ప్రసార, ప్రచార మాధ్యమాల ఉధృతి కారణంగా మాండలిక సొబగులలో భాగమైన ఈ పదాలు (కొలతలు) కనుమరుగయ్యాయి. ఇప్పటికీ అక్కడక్కడా ముసలి వారు ఈ పదాలను ఉచ్చరించటం కన్పిస్తుంది. స్థానికత, కడప మాండలికం ఉట్టిపడే ఆ కొలతల […]పూర్తి వివరాలు ...