ఇందరికి నభయంబు లిచ్చుచేయి – అన్నమయ్య సంకీర్తన

ఇందరికి నభయంబు లిచ్చుచేయి
కందువగు మంచి బంగారు చేయి॥

వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి
చిలుకు గుబ్బలికింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగిలించినచేయి
వలనైన కొనగోళ్ళ వాడిచేయి॥

శ్రీనివాసుని హస్తం
శ్రీనివాసుని హస్తం

తనివోక బలిచేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదానమొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చినచేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి॥

పురసతుల మానములు పొల్లసేసినచేయి
తురగంబుబరపెడి దొడ్డచేయి
తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి॥

చదవండి :  తిరువీధుల మెరసీ దేవదేవుడు - అన్నమాచార్య సంకీర్తన

ఇదీ చదవండి!

కంటిమి నీ సుద్దులెల్ల

కంటిమి నీ సుద్దులెల్ల గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. కడపరాయని సుద్దులను, వలపులను తలచుకొని ఆ సతి ఇట్లా  పరవశిస్తోంది… వర్గం: …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: