ఆహోబిల మఠ సంస్తాపనాచార్యులైన శ్రీమాన్ శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరినాడు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య. అన్నమయ్య దర్శించుకున్న రాయలసీమ జిల్లాలలోని ఆలయాల జాబితా : కడప జిల్లా: దేవుని కడప లక్ష్మీవెంకటేశ్వరాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం గండికోట చెన్నకేశవాలయం గండికోట రామాలయం ప్రొద్దుటూరు చెన్నకేశవాలయం పొట్లదుర్తి చెన్నకేశవాలయం వెయ్యినూతులకోన నృసింహాలయం సంబటూరు చెన్నకేశవాలయం పెద్దచెప్పలి చెన్నకేశవాలయం మాచనూరు చెన్నకేశవాలయం పాలగిరి చెన్నకేశవాలయం కోన చెన్నకేశవాలయం […]పూర్తి వివరాలు ...
Tags :annamayya
భగవదంకితబుద్ధులను ఏ దుష్టశక్తులూ నిలుపలేవు. భగవంతుని చేరడానికి పేర్కొన్న నవవిధ భక్తి మార్గాలలో వైరాన్ని ఆశ్రయించిన వారు శిశుపాల హిరణ్యకసిపాదులు. వైకుంఠవాసుడు ఆ దుష్టశక్తులను సంహరించి తన సాధుసంరక్షకత్వాన్ని చాటినాడు. అన్నమయ్య తన సంకీర్తన తపస్సును భంగపరిచే దుష్ట రాజకీయ శక్తులను నిర్మూలించమని వేంకటగిరి నృశింహుని ఇలా వేడుకుంటున్నాడు…. Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… నరసింహ రామకృష్ణ నమో శ్రీవేంకటేశ సరుగ నా(నా) […]పూర్తి వివరాలు ...
తాళ్లపాక: తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడూ అయిన తాళ్ళపాక అన్నమాచార్యుల 512వ వర్థంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలి తాళ్లపాకలో తితిదే ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు బహుళ ద్వాదశి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సప్తగిరుల గోష్టిగానం కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. చివరిగా అన్నమయ్య చిత్రపటాన్ని తాళ్లపాక మాడవీధుల్లో వూరేగించారు. తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం తాళ్లపాక ధ్యానమందిర […]పూర్తి వివరాలు ...
అన్నమయ్య ఆలయ ప్రవేశం: అన్నమయ్య ఆదివరాహస్వామిని సేవించుకొని వేంకటేశ్వరస్వామి కోవెలకు వెళ్లాడు. పెద్ద గోాపురాన్ని ఆశ్చర్యంగా చూశాడు. అక్కడ పెద్ద చింతచెట్టు ఉండేది. దానికి మ్రొక్కాడు. కోరిన కోర్కెలు తీర్చే గరుడగంభానికి సాగిలపడ్డాడు . పెద్ద పెద్ద సంపెంగ మానులతో నిండి ఉన్న చంపక ప్రదక్షిణం చుట్టాడు. విమాన వేంకటేశ్వరుని దర్శించాడు. రామానుజులవారిని సేవించుకున్నాడు. యోగనరసింహస్వామికి నమస్కరించాడు. జనార్దనుని మూర్తికి మ్రొక్కాడు. వంట ఇంటిలో వెలసి ఉన్న అలమేలుమంగమ్మను అర్చించాడు. యాగశాలను దర్శించాడు. కళ్యాణ మంటపాన్ని తిలకించాడు. […]పూర్తి వివరాలు ...
అలమేలు మంగమ్మ – అనుగ్రహం అన్నమయ్య అలసటను, ఆకలిని ఎవరు గమనించినా ఎవరు గమనిమ్పకపోయినా అలమేలు మంగమ్మ గమనించి కరుణించింది. మంగమ్మ పెద్ద ముత్తైదువులా అన్నమయ్యను సమీపించింది. తన ఒడిలో చేర్చుకుని శరీరం నిమురుతూ “లే! బాబూ, లేచి ఇలా చూడు” అన్నది. అన్నమయ్యకు తన తల్లి లక్కమాంబ పిలుస్తున్నట్లనిపించింది. “అమ్మా!” అని లేచాడు. కానీ కళ్ళు కనిపించడం లేదు. అమృతం లాంటి అమ్మ స్పర్శ; తేనెలూరే తల్లి పలుకులు. అన్నమయ్యకు దిక్కు తెలియడం లేదు. దీనంగా […]పూర్తి వివరాలు ...
ఇంటి పని ఎవరు చూస్తారు? నారయణసూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్నచిన్న కలతలు తప్పవు. వాళ్ళ కోపతాపాలు అర్థం లేనివి, ఇంతలో తగవులాడతారు. అంతలో కలిసిపోతారు. ఒకనాడు అందరూ కలిసికట్టుగా అన్నమయ్య మీద విరుచుకుపడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. “ఎప్పుడూ ఆ దండె భుజాన తగిలించుకుని పిచ్చి పాటలు పాడుకోవడమేనా? ఇంట్లో పనీ పాట ఎవరు చూస్తారు?” అని ఇంటివాళ్ళు దెప్పిపొడిచారు. “గాలి పాటలు కట్టిపెట్టి , అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చి పడేయ్” ఏ […]పూర్తి వివరాలు ...
పాము కరవలేదు సరికదా! ఎదురుగ చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది.”ఎందుకు బాబు ఈ అఘాయిత్య?. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు, తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు” అని చింతలమ్మ బాలుని చింత తీర్చి అదృశ్యమైంది. అమ్మ చెప్పినట్లు నారాయాణయ్యకు చెన్నకేశవస్వామి దయవల్ల అన్ని విద్యలూ సిద్ధించాయి. […]పూర్తి వివరాలు ...
అదిగో తెలుగు తల్లి తన కన్నబిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ పాడుతూంది. “చందమామ రావో జాబిల్లి రావో,మంచి కుందనంపు పైడికోర వెన్నపాలు తేవో” ఈ చందమామ పాట వ్రాసిందెవరో తెలుసా! తాళ్లపాక అన్నమాచార్యులు/అన్నమయ్య – వేంకటేశ్వరస్వామికి గొప్ప భక్తుడు; మహా కవి. మన తెలుగులో తొలి వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడంటే పాటలు స్వయంగా వ్రాసి పాడేవాడని అర్ధం. వేంకటేశ్వరుడు, అన్నమయ్య మేలుకొలుపు పాట పాడుతూంటే విని నిద్రలేచేవాడు. మళ్ళీ ఆయన జోలపాట పాడందే నిద్రపోడు. స్వామికే గాదు అమ్మవారికి కూడ […]పూర్తి వివరాలు ...
ఇందరికి నభయంబు లిచ్చుచేయి కందువగు మంచి బంగారు చేయి॥ వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి చిలుకు గుబ్బలికింద చేర్చు చేయి కలికి యగు భూకాంత కౌగిలించినచేయి వలనైన కొనగోళ్ళ వాడిచేయి॥ తనివోక బలిచేత దానమడిగిన చేయి ఒనరంగ భూదానమొసగు చేయి మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చినచేయి ఎనయ నాగేలు ధరియించు చేయి॥ పురసతుల మానములు పొల్లసేసినచేయి తురగంబుబరపెడి దొడ్డచేయి తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి॥పూర్తి వివరాలు ...